విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్ : జిల్లాలో స్టాఫ్‌నర్సు పోస్టులకు విపరీతమైన పోటీ నెలకొంది. ఒక్క పోస్టుకు సుమారు 80 మంది అభ్యర్థినులు పోటీ పడుతున్నారు. జిల్లాలో 24 గంటలు పని చేసే పీహెచ్‌సీ ల్లో ఖాళీగా ఉన్న ఎనిమిది స్టాఫ్‌నర్సు పోస్టులకు గత నెలలో వైద్య ఆరోగ్యశాఖాధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనెల 8వ తేదీన దరఖాస్తుల స్వీకరణ ముగిసే నాటికి జిల్లా వ్యాప్తంగా 591 దరఖాస్తులు అం దారుు. దీంతో పోస్టుల భర్తీకి అధికారులు తలలు పట్టుకుటున్నారు. దరఖాస్తులను పరిశీలించి మెరిట్ లిస్టు తయారు చేస్తున్నారు. కాగా దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసిన నుంచి బేరసారాలు మొదలయ్యూ రుు. వైద్య ఆరోగ్యశాఖకు చెందిన కొంతమంది అధికారులతో పాటు అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలు ఈ తతాంగాన్ని నడపిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్ట్ పోస్టులే అయినప్పటికీ ఒక్కోక్క పోస్టుకు రూ. లక్షల్లో బేరసారాలు సాగుతున్నట్టు సమాచా రం
8 పోస్టులకు 591 దరఖాస్తులు
Published Thu, Dec 12 2013 3:50 AM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM
Advertisement
Advertisement