వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ
Published Sat, Dec 28 2013 4:37 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. పోస్టుల భర్తీకి సంబంధించి ఇన్‌చార్జి కలెక్టర్ యూసీజీ నాగేశ్వరరావు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 90 వీఆర్‌ఓ, 137 వీఆర్‌ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపా రు. అభ్యర్థులు శనివారం ఉదయం 10. 30 గంటల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు. వీఆర్‌ఓ పోస్టులను జిల్లా యూనిట్‌గా భర్తీ చేయనున్న ట్టు చెప్పా రు. వీఆర్‌ఏ పోస్టులను మాత్రం ఏ గ్రామంలో ఖాళీ ఉంటే అక్కడ రిజర్వేషన్ ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ పోస్టులకు సంబంధించి తహశీల్దార్, పంచాయతీ కార్యాలయాలతో పాటు ఆయూ గ్రామాల్లో దం డోరా వేయించనున్నట్టు చెప్పారు. సదరంలో వికలాంగ ధ్రువీకరణ పత్రాలు పొందిన అభ్యర్థులు ఎటువంటి ఫీజు లేకుండానే దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఆ ప్రాంతానికి చెందిన అభ్యర్థులతో భర్తీ చేస్తామన్నారు.
వయస్సు నిబంధన : వీఆర్‌ఓ పోస్టుకు 18 నుంచి 36, వీఆర్‌ఏ పోస్టులకు 18 నుంచి 37 ఏళ్లులోపు వయస్సు ఉండాలి. మాజీ సైని కులకు మూడేళ్లు, వికలాంగులకు ఏడేళ్లు, ఎస్సీ. ఎస్టీ, బీసీలకు ఐదేళ్ల వయస్సు అధికంగా ఉన్నా.. దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను వచ్చేనెల 12వ తేదీలోగా అందజేయూలి. కాగా దరఖాస్తుల కోసం అభ్యర్థుల నుంచి అధికంగా వసూళ్లు చేస్తే చర్యలు తప్పవ ని ఇన్‌చార్జి కలెక్టర్ హెచ్చరించారు. ఈ మేరకు ఈసేవ, మీసేవ, ఏపీ ఆన్‌లైన్ నిర్వాహకుల తో సమావేశం ఏర్పాటు చేసి, స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ఏఓ రమణమూర్తిని ఆదేశించారు.
దరఖాస్తుకు రూ.10 మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేశారు. ఆయనతో పాటు డీఆర్‌ఓ బి.హేమసుందరవెంకటరావు కూడా ఉన్నారు.
Advertisement
Advertisement