=ఐకేపీ మహిళా గ్రూపుల ఆధ్వర్యంలో 42
=పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో 51
=జేసీ ఉషాకుమారి వెల్లడి
కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : జిల్లాలో 93 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి జాయింట్ కలెక్టర్ పి.ఉషాకుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2013-14 ఖరీఫ్ సీజన్‌లో రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి మద్దతు ధర లభించేలా, దళారుల బారినపడకుండా ప్రభుత్వం తీసుకునే చర్యల్లో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. ఇందిరా క్రాంతిపథం మహిళా గ్రూపుల నిర్వహణలో 42 కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల నిర్వహణలో 51 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఒక్కొక్క కొనుగోలు కేంద్రానికి వాటి పరిధిలో ఉన్న రైస్‌మిల్లులను కేటాయిస్తున్నట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల వద్ద నుంచి సేకరించిన ధాన్యానికి కేటాయించిన బిల్లులకు రవాణా అనుమతులు ఇచ్చినట్లు వివరించారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సిబ్బందిని నియమించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. కేంద్రాల పర్యవేక్షకులుగా పౌరసరఫరాల డీటీలను నియమించినట్లు చెప్పారు.
ధాన్యం కొనుగోలుకు 93 కేంద్రాలు
Published Sat, Nov 30 2013 12:34 AM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM
Advertisement