purchase of grain
-
ధాన్యం సొమ్ము చెల్లింపుల్లో ముందంజ
సాక్షి, భీమవరం: రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటకు సొమ్ములు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం నూతన ఒరవడిని సృష్టించడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతులు పండించిన ధాన్యం విక్రయించిన వారంలోగా సొమ్ములను వారి బ్యాంకు ఖాతాలకు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. పండించిన పంటను నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడం ద్వారా దళారుల కమీషన్ల బెడద లేకుండా రైతులకు మద్దతు ధర అందుతోంది. అంతేగాకుండా ధాన్యం సొమ్ములతోపాటు గోనె సంచులు, హమాలీలు, రవాణా చార్జీలను సైతం ప్రభుత్వమే చెల్లించడం రైతులకు వరంగా మారింది. 296 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జిల్లాలోని 20 మండలాల పరిధిలో గడిచిన దాళ్వా సీజన్లో సుమారు 2.19 లక్షల ఎకరాల్లో రైతులు వరి పండించగా, పంట కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం 296 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ధాన్యాన్ని దళారులు, రైస్ మిల్లర్లకు విక్రయించకుండా నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే ధాన్యం అమ్మకం చేసిన 21 రోజుల్లోగానే పంట సొమ్ము రైతుల బ్యాంకు ఖాతాలకు జమచేస్తుందని వ్యవసాయ, రెవెన్యు శాఖాధికారులు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. దీనితో దాళ్వా సీజన్లో జిల్లాలోని 74,083 మంది రైతుల నుంచి 6,43,128 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. వీరికి మొత్తం రూ.1,312.21 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.1,310.82 కోట్లు చెల్లించారు. అలాగే గోనె సంచులు, హమాలీ, రవాణా చార్జీలకు రైతులకు చెల్లించాల్సిన సుమారు రూ.41.55 కోట్లు దాదాపు జమ చేయగా కొద్దిమొత్తంలో ధాన్యం రవాణ చేసిన ఏజెన్సీలకు చెల్లించాల్సి ఉంది. బ్యాంకు లింకేజీ సక్రమంగా లేకే జాప్యం జిల్లాలోని ధాన్యం విక్రయాలు చేసిన రైతుల్లో కేవలం 117 మందికి రూ.1.39 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే ఆయా రైతులు తమ బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింకేజీ చేయకపోవడం, జన్‌ధన్ బ్యాంకు ఖాతాకు కేవలం రూ.50 వేలు మాత్రమే జమచేసే అవకాశం ఉండడం వంటి అవరోధాలు కారణంగా సొమ్ములు జమ కాలేదు. అలాగే గోనె సంచులు, రవాణా, హమాలీ చార్జీలకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన మొత్తం వారి బ్యాంకు ఖాతాల్లో జమచేయగా ఏజెన్సీల ద్వారా ధాన్యం రవాణా చేసిన సుమారు రూ.1.58 కోట్ల సొమ్మును ఏజెన్సీలు క్లయిమ్స్ అందజేయకపోవడంతో చెల్లించలేదు. ధాన్యం సొమ్ములతోపాటు రైతులకు రవాణా, హమాలీ, గోనె సంచులకు సంబంధించిన సొమ్ములను త్వరితగతిన ప్రభుత్వం చెల్లిస్తుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
గుండె తరుక్కుపోతోంది
జగిత్యాలలోని ఓ కొనుగోలు కేంద్రంలో మల్లయ్య అనే రైతుకు సంబంధించిన ధాన్యం కాంటా పెట్టారు. మరునాడు అందులో తాలు, గడ్డి ఉన్నాయని, తాము చెప్పినంత తరుగుకు ఒప్పుకుంటేనే ధాన్యం దించుకుంటామని మిల్లు యజమాని నిర్వాహకులకు ఫోన్ చేశాడు. ఇదే విషయం నిర్వాహకులు మల్లయ్యకు ఫోన్ చేసి చెప్పడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అంగీకరించాడు. కాంటాలు పెడతలేరు మాది ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామం. పది రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చా. నాలుగు రోజులు అవుతోంది బస్తాలు నింపి. ఇప్పటివరకు కాంటాలు పెడతలేరు. కొనుగోళ్లు అయితలెవ్వు. మబ్బులు పడుతుండడంతో తడుస్తయేమోనని భయంగా ఉంది. – బొమ్మగాని ఉప్పలయ్య, వరంగల్ జిల్లా సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోలేక కష్టాలు పడుతున్నారు. మరోవైపు తరుగు పేరిట మిల్లర్లు వారిని వేధిస్తున్నారు. ఏటా కోట్లాది రూపాయల రైతుల కష్టాన్ని తరుగు పేరిట దోచుకుంటున్నా.. ఈ యాసంగిలో ఇది శ్రుతి మించింది. మిల్లర్లు ఏకంగా రైతుకే ఫోన్లు చేసి ధాన్యం వెనక్కి తీసుకెళ్లాలని చెబుతున్నారు. ఈ బెదిరింపులతో ఆందోళనకు గురవుతున్న రైతులు వారు చెప్పినట్లు తరుగుకు తలూపుతున్నారు. గతనెల 22న కొనుగోళ్లు ప్రారంభమైనపుడే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు మొత్తం మిలాఖత్ అయి క్వింటాల్‌కు ఏకంగా తొమ్మిది నుంచి పది కిలోల వరకు తరుగుతో దోపిడీకి తెరతీశారు. వాస్తవానికి కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్‌కు నాలుగు కిలోల చొప్పున తరుగు తీశాక.. ఆ ధాన్యాన్ని మిల్లులో ఆన్లైన్లో నమోదు చేయాలి. ఇక్కడే మిల్లు యజమానులు చక్రం తిప్పుతున్నారు. లారీలో వచ్చిన ధాన్యాన్ని మిల్లుల్లో దించడం లేదు. ధాన్యంలో తాలు, గడ్డి, మట్టి ఉన్నాయని, తమకు అవసరం లేదంటూ వేధిస్తున్నారు. ధాన్యం తీసుకెళ్లాలంటూ రైతులకు ఫోన్లు చేసి చెబుతున్నారు. దీంతో రైతులు మిల్లులకు పరుగులు పెడుతున్నారు. అలా వచ్చిన వారిని మరింత వేధిస్తూ మరింత తరుగు తీసైనా సరే తమ ధాన్యం కొనాలంటూ బతిమాలేలా మిల్లర్లు చేస్తున్నారు. మరోవైపు గన్నీ బ్యాగులు, లారీలు, టార్పాలిన్ల కొరత, ట్రాన్స్‌పోర్టు ఇబ్బందులు కూడా రైతులు తమ ధాన్యం అమ్ముకోవడానికి వీల్లేకుండా చేస్తున్నాయి. ఆసిఫాబాద్‌లో గింజ కూడా కొనలేదు.. ఈ యాసంగిలో రాష్ట్రవ్యాప్తంగా 80.46 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 32 జిల్లాల్లో 7,183 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకుంది. ఇప్పటివరకు ఇందులో 6,889 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జరపగా.. అందులో 186 కేంద్రాలను ఇప్పటికే మూసివేశారు. మొత్తం 32 జిల్లాల్లో దాదాపు 5.23 లక్షల మంది రైతుల నుంచి ఇప్పటి వరకూ దాదాపు 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. దీని విలువ దాదాపు రూ.6,934 కోట్ల వరకు ఉంటుందని అధికారుల అంచనా. నల్లగొండలో అత్యధికంగా రూ.1,100 కోట్ల ధాన్యం, నిజామాబాద్‌లో రూ.1,030 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసిన అధికారులు.. ఆసిఫాబాద్‌లో శనివారం (20వ తేదీ) సాయంత్రం వరకు రూపాయి విలువైన ధాన్యం కూడా కొనుగోలు చేయకపోవడం గమనార్హం. ఓవైపు నైరుతి రుతుపవనాలు సమీపిస్తుండటం, మృగశిర కార్తెకు మరెన్నో రోజులు లేకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. కొనుగోలు ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తికాకపోతే.. ఇప్పటికే వడగండ్లు, అకాల వర్షాలకు దారుణంగా దెబ్బతిన్న తాము.. ఈ జాప్యంతో మరింత దారుణంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 రోజులుగా పడిగాపులు మాది మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం మల్లేపల్లి. 13 ఎకరాల్లో వరి సాగు చేస్తే సుమారు 260 కింటాళ్ల దిగుబడి వచ్చింది. ధాన్యాన్ని ఈ నెల 7న స్థానిక కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చా. గత 15 రోజులుగా ఇక్కడికి ఒక్క లారీ కూడా రాలేదు. శనివారం కురిసిన వర్షానికి తడిసింది. మళ్ళీ కూలీలను పెట్టి ఆరబెట్టాల్సి వచ్చింది. – సూరినేని కమలాకర్, మంచిర్యాల రాత్రింబవళ్లు కుప్పల వద్దే వెంటవెంటనే కొనుగోళ్లు చేయకపోవడంతో రాత్రి, పగలు తేడా లేకుండా కుప్పల వద్దే పడిగాపులు కాస్తున్నాం. ధాన్యాన్ని కుప్పలుగా పోసి ఇప్పటికి 20 రోజులు అవుతోంది. తూకం వేసేందుకు హమాలీలు దొరకడం లేదు. లారీలు కూడా సకాలంలో రావడం లేదు. ఈసారి అసలే ధాన్యం దిగుబడి తగ్గింది. మరోవైపు రోజురోజుకు ధాన్యం బరువు దిగిపోతోంది. పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెబితే కానీ లారీ డ్రైవర్లు ఇటువైపు రావడం లేదు. – ప్రభాకర్, రైతు, తుక్కాపూర్, మెదక్ వెంటనే ధాన్యం కొనాలి 170 బస్తాలు కొనుగోలు కేంద్రంలోనే ఉన్నాయి. వర్షాలు, దొంగల భయానికి రోజూ కావలి కాస్తున్నాం. ఇంకా కాంటా పెట్టడం లేదు. వెంటనే కాంటా పెట్టి ధాన్యం కొనాలి. – చిన్నయ్య, నికల్పూరు, డొంకేశ్వర్, నిజామాబాద్ -
అకాల కష్టం అండగా ఉందాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన అన్నదాతలకు పూర్తి స్థాయిలో అండగా నిలవాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. పంట నష్టపోయిన రైతుల్లో ఏ ఒక్కరికీ పరిహారం అందలేదన్న మాటే రాకూడదని, పంటలు కొనుగోలు చేయడం లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదని స్పష్టం చేశారు. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతోపాటు రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను ముమ్మరంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్దేశించారు. ఆర్బీకేల స్థాయిలో నిశితంగా పర్యవేక్షణ జరగాలని స్పష్టం చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై గురువారం ఉదయం క్యాంపు కార్యాలయంలో సమీక్షించిన సీఎం జగన్ అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. సచివాలయాల్లో రైతుల జాబితాలు వర్షాల వల్ల పంటలు సహా ఇతర నష్టాలకు సంబంధించి గ్రామ సచివాలయాల స్థాయిలోనే ఎప్పటికప్పుడు వివరాలను సేకరించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత నష్టపోయిన రైతుల జాబితాలను సామాజిక తనిఖీల కోసం సచివాలయాల్లో ప్రదర్శించాలని సూచించారు. తద్వారా ఎవరైనా మిగిలిపోతే వెంటనే అధికారుల దృష్టికి తెచ్చేందుకు వీలుంటుందన్నారు. వేగంగా రబీ ధాన్యం కొనుగోలు రబీ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. పంటను కొనుగోలు చేయడం లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదని స్పష్టం చేశారు. ఫిర్యాదులకు ట్రోల్ ఫ్రీ నెంబర్ రైతులకు ఏమైనా ఇబ్బందులుంటే ఫిర్యాదు చేసేందుకు ట్రోల్ ఫ్రీ నెంబర్‌ను అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు చేపట్టాలన్నారు. రైతన్నల ముఖంలో చిరునవ్వు కనిపించేలా అధికారుల చర్యలు ఉండాలని స్పష్టం చేశారు. రానున్న రోజులకు సంబంధించి వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు వివరాలు తెప్పించుకుంటూ వర్ష ప్రభావిత ప్రాంతాలపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతి జిల్లాకు వ్యవసాయ శాస్త్రవేత్త రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి సమీక్షలో అధికారులు వివరించారు. రబీ ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా సాగుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే 4.75 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. పంట కోతలు పూర్తి కాని ప్రాంతాల్లో ఏం చేయాలన్న అంశంపై రైతులకు సూచనలు చేస్తున్నట్లు తెలిపారు. పంటలు కోసిన చోట పనలు తడిస్తే ఉప్పు ద్రావణం చల్లడం లాంటి విధానాలను పాటించడంపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రతి జిల్లాకు ఒక వ్యవసాయ శాస్త్రవేత్తను అందుబాటులో ఉంచి స్థానిక అధికారుల ద్వారా రైతులకు అవగాహన కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ధాన్యం భద్రంగా గోడౌన్లకు తరలింపు వివిధ కొనుగోలు కేంద్రాలు, ఆర్బీకేలు, రైతుల వద్ద ఉన్న ధాన్యం నిల్వలను భద్రంగా ప్రభుత్వ భవనాలు, గోడౌన్లలోకి తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు ఊపందుకున్నట్లు చెప్పారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్స్ తెరిచామని, యంత్రాంగం అంతా అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. -
ధాన్యం కొనుగోలుతో రైతులకు భరోసా
సాక్షి, అమరావతి: ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్రంలోని రైతులకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతోందని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తాము ఇంతే కొంటామంటూ ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని స్పష్టం చేశారు. మిల్లర్ల ప్రమేయం లేకుండా రైతులు పండించిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంటే.. ధాన్యం కొనుగోలులో ఆంక్షలు అంటూ ‘ఈనాడు’ తప్పుడు ఆరోపణలు చేయడం దారుణం అని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మూడు పంటలు పండే పచ్చని పంట పొలాలను రాజధాని పేరిట సేకరించినప్పుడు రామోజీ ఎందుకు బాధ పడలేదని ఆయన ప్రశ్నించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం మూడున్నరేళ్లుగా రైతులకు అన్ని విధాలుగా అండగా నిలవడం దేశమంతా గుర్తిస్తుండటం కనిపించడం లేదా అని నిలదీశారు. రైతులకు మద్దతు ధర దక్కుతోందనే అక్కసుతో బురద చల్లుతున్నారని ధ్వజమెత్తారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే.. రామోజీ.. ఆరోజు ఎందుకు నోరు విప్పలేదు? ► టీడీపీ ఐదేళ్ల పాలనలో రూ.40 వేల కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే, ఈ మూడున్నరేళ్లలో మా ప్రభుత్వం రూ.50,699 కోట్ల విలువైన 2.71 కోట్ల టన్నుల ధాన్యం సేకరించింది. టీడీపీ ఐదేళ్లలో రూ.3 వేల కోట్ల విలువైన ఉత్పత్తులు కొనుగోలు చేస్తే, ఈ మూడున్నరేళ్లలో ఈ ప్రభుత్వం రూ.7,500 కోట్ల విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేసింది. ఇవి రామోజీకి కన్పించక పోవటం దురదృష్టకరం. ► వ్యవసాయం దండగ అని చంద్రబాబు విమర్శించినప్పుడు రామోజీ ఎందుకు నోరు విప్పలేదు? ఈరోజు రాష్ట్రం పాడి పంటలతో కళకళలాడుతోంది. సాగునీరు పుష్కలంగా అందుతోంది. దిగుబడులు బాగా పెరిగాయి. రైతులు సంతోషంగా ఉన్నారు. కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధరకే రైతులు పంట విక్రయించుకుంటున్నారు. ► రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 56 బీసీ కార్పొరేషన్ల మీద.. టీడీపీ, దాని కుల మీడియా రాసిన కథనాలు వారి పెత్తందారీ పోకడలను, అహంకారాన్ని మరోసారి బయట పెట్టాయి. ఈ కార్పొరేషన్ల ద్వారా వేలాది మంది బీసీలకు రాజకీయంగా గుర్తింపు రావడం నిజం కాదా? ఊరికొకరికి మాత్రమే మేలు చేసే గత ప్రభుత్వ దుర్మార్గం బట్టబయలు కాలేదా? -
36,75,996 టన్నుల ధాన్యం సేకరణ
సాక్షి, అమరావతి: శాసన సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని బుధవారం తెలుగుదేశం పార్టీ సభ్యులు పదేపదే అడ్డుకొన్నారు. ఎన్నిసార్లు చెప్పినా వారు వినకపోవడంతో స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని వాయిదా వేశారు. సభ్యుల ప్రశ్నలన్నింటికీ సంబంధిత శాఖల మంత్రులు సమాధానం చెప్పినట్లుగానే భావించాలని సభాపతి కోరారు. సభలో పలువురు వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నలకు మంత్రుల సమాధానాలు ఇలా ఉన్నాయి.. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొంటున్నాం. ఇందుకోసం 7,000 వరి సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశాం. వరి సేకరణలో 21,000 మంది నిమగ్నమై ఉన్నారు. రైతు క్షేత్రం నుంచి మిల్లు వరకు అన్ని రకాల వ్యయాలను ప్రభుత్వం భరిస్తోంది. ఇప్పటి వరకు 36,75,996 మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేశాం. రైతులకు రూ.4,676.96 కోట్లు చెల్లించాం. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పీడీఎస్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో 1.53 లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నాం. వైఎస్సార్ సున్నా వడ్డీ ద్వారా రూ.1,282.11 కోట్ల చెల్లింపులు రాష్ట్రంలో బ్యాంకులు పంట రుణాలపై ఏడు శాతం వడ్డీని విధిస్తున్నాయి. ఇందులో రూ.లక్ష లోపు రుణం తీసుకొని సకాలంలో చెల్లించిన వారికి కేంద్రం 3 శాతం వడ్డీ సబ్సిడీగా ఇస్తుంటే, రాష్ట్రం వైఎస్సార్ సున్నా వడ్డీ కింద 4 శాతం సబ్సిడీ ఇస్తోంది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 65,65,191 మంది రైతులకు రూ.1,282.11 కోట్లు చెల్లించాం. రాష్ట్రంలో 6.16 లక్షల మంది నిరుద్యోగులు రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా వివిధ కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 6,16,689 మంది నిరుద్యోగులు ఉండగా అందులో 4,22,055 మంది పురుషులు, 1,94,634 మంది మహిళలు ఉన్నారు. కోవిడ్ చికిత్సకు రూ.2,893.41 కోట్లు రాష్ట్రంలో కోవిడ్ వ్యాధిగ్రస్తుల చికిత్స కోసం రూ.2,893.41 కోట్లు వ్యయం చేశాం. వ్యాక్సిన్ కోసం రూ.85.79 కోట్లు ఖర్చు చేశాం. ఓటీఎస్‌కు డిమాండ్ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓటీఎస్) ద్వారా నివాసం ఉంటున్న వారికి ఇంటిపై పూర్తి హక్కులను ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ పథకం కోసం ఇప్పటివరకు 9,86,966 దరఖాస్తులు రాగా 2022 మార్చి 2 నాటికి 4,47,713 మందికి యాజమాన్య హక్కులు ఇచ్చాం. రూ.36,303.86 కోట్ల పెట్టుబడులు వచ్చాయి పెట్టుబడులను ఆకర్షించడానికి ఔట్రీచ్ పేరిట పలు కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. వీటిద్వారా 2019 జూన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో రూ.36,303.86 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవరూపం దాల్చి, 91 మెగా ప్రాజెక్టులు ఉత్పత్తిని ప్రారంభించాయి. మరో 70మెగా ప్రాజెక్టులకు రూ.1,61,154.85 కోట్ల పెట్టుబడులు క్రియాశీలకంగా అమల్లో ఉన్నాయి. మరో రూ.41,434 కోట్ల పెట్టుబడులతో 31 ప్రాజెకులు ప్రారంభ దశలో ఉన్నాయి. -
రైతన్నకు 100 % ‘మద్దతు’
సాక్షి, అమరావతి: రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చూసేందుకే ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్రను తొలగించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. గతంలో ఎవరూ ఇలా చేయలేదన్నారు. కలెక్టర్లు, జేసీలు రైతులకు ఎంఎస్పీ దక్కేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్పందనలో భాగంగా ఉన్నతాధికారులతో మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలు, ప్రాసెసింగ్ యూనిట్లపై ముఖ్యమంత్రి జగన్ పలు సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు దోపిడీకి గురి కారాదు అన్నదాతల కష్టాలను దృష్టిలో ఉంచుకుని తడిసిన, రంగు మారిన ధాన్యాన్నీ కూడా కొనుగోలు చేశామని, గతంలో ఎప్పుడూ లేనివిధంగా రైతులను ఆదుకున్నామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఎంఎస్పీకి ఒక్క పైసా కూడా తగ్గకుండా రైతులకు ధర అందాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ దోపిడీకి గురి కారాదని స్పష్టం చేశారు. రైతులకు మంచి ధర అందించాలన్న తపనతో ముందుకు సాగాలని నిర్దేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో కేవలం రైతుల పేర్లను నమోదు చేయడంతో సరిపెట్టకూడదని, అక్కడితో బాధ్యత పూర్తైందని భావించరాదని స్పష్టం చేశారు. కొనుగోళ్లపై రోజువారీ సమీక్ష రోజువారీగా కొనుగోలు కేంద్రాలు, కొనుగోళ్లపై కలెక్టర్లు సమీక్ష చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో అవసరమైన కూలీలను కూడా ఆర్బీకేల పరిధిలో సమీకరించుకోవాలని, ప్రక్రియను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని సూచించారు. రైతుల నుంచి నిరంతరం ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు ఎంఎస్పీ దక్కడం, దోపిడీకి గురి కాకుండా చూడటం, కొనుగోళ్ల ప్రక్రియలో మిల్లర్ల పాత్రను నివారించడం మన ముందున్న లక్ష్యాలని స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ గుర్తు చేశారు. ‘ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో ఆర్బీకేలను తెచ్చి విత్తనం నుంచి కొనుగోళ్ల వరకూ సేవలు అందిస్తున్నాం. పంటల ధరలపై పర్యవేక్షణకు సీఎం యాప్‌ను తెచ్చాం. 1,100 మల్టీ పర్పస్ గోడౌన్లు, ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాం. వీటిపై కలెక్టర్లు దృష్టి సారించాలి. గోడౌన్ల నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాలి’ అని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. నెలాఖరు కల్లా భూముల గుర్తింపు ‘పార్లమెంట్ నియోజకవర్గాల స్థాయిలో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. 26 చోట్ల వీటిని నెలకొల్పుతున్నాం. అవసరాలను బట్టి వీటికి భూములు గుర్తించి అప్పగించే ప్రక్రియ నెలాఖరు కల్లా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. -
ప్రతి గింజనూ కొంటాం: మంత్రి కన్నబాబు
సాక్షి, అమరావతి: భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తుందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. అన్నదాతలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇప్పటికే 7,681 ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోలు చేయాలని మ్యాపింగ్ చేశామని తెలిపారు. వచ్చింది వచ్చినట్లుగా కొనుగోలు చేస్తున్నామని, ప్రతి ఆర్బీకేకి మిల్లులను అనుసంధానం చేశామని వివరించారు. వర్షాల వల్ల తేమ శాతం అధికంగా ఉన్న ధాన్యం కొనుగోలుపై ప్రధానంగా దృష్టి సారించినట్లు చెప్పారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడారు. టీడీపీ హయాంలో ఏనాడైనా కొన్నారా? రంగు మారిన ధాన్యాన్ని టీడీపీ హయాంలో ఏనాడైనా కొనుగోలు చేశారా? కొనుగోళ్లలో మిల్లర్ల జోక్యాన్ని నియంత్రించాలని ఏనాడైనా ఆలోచించారా? మంచి ధాన్యానికి, రంగు మారిన ధాన్యానికి ఒకే ధర ఇస్తారా? చంద్రబాబు అలా ఇచ్చారా? చంద్రబాబుకు అధికారం పోయిందని ఈనాడులో అడ్డమైన రాతలు రాస్తారా? వరికి కన్నీటి తడి కాదది.. ఈనాడు కంట తడే అందులో కనిపించింది. ఆర్బీకేల ద్వారా రైతులకు చేస్తున్న మేలు కనపడటం లేదా? సీఎం జగన్‌ను శత్రువుగా చూడటం మాత్రమే వారికి తెలుసా? ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ప్రజలకు చూపించాల్సింది ‘చంద్ర’ వీడియోలు కాదు. నిన్న రాష్ట్రానికి వచ్చి మాట్లాడిన రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు వీడియోలను చూపిస్తే బాగుంటుంది. ప్యాకేజీ చాలని స్వీట్లు పంచుకోలేదా? విడిపోయిన తరువాత రాష్ట్రానికి తొలి సీఎంగా ఉన్న చంద్రబాబుకు విభజన హామీలు ఏమయ్యాయని అడగటానికి సిగ్గుండాలి. ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీ చాలని బాబు బృందం స్వీట్లు పంచుకుని పండగ చేసుకోలేదా? అమరావతికి మట్టి, నీళ్లు... మీకు ప్యాకేజీ కావాలని అడిగింది బాబే కదా? ప్యాకేజీ ఇచ్చారని ప్రధాని మోదీకి నాడు అసెంబ్లీలో ధన్యవాదాల తీర్మానం చేయడాన్ని మరిచిపోయారా? ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ ఎంపీలతో రాజీనామాలు, ఢిల్లీలో దీక్షలు చేయించింది ఆరోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ జగన్ కాదా? ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు అంత చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు టీడీపీ ఎంపీలతో ఎందుకు రాజీనామాలు చేయించలేదు? స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై నిజాలను నిగ్గు తేలుస్తుంటే రాజకీయ కక్ష అని ఆరోపించడం ఏమిటి? సీఐడీ పోలీసులు నిజాలను నిగ్గు తేలుస్తుంటే డ్రామాలతో అడ్డుకుంటారా? మినహాయింపు ఇవ్వాలని లేఖ రాశాం.. ప్రకృతి విపత్తుల సమయంలో నిబంధనలు సడలించడం ఆనవాయితీ. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కొంత మినహాయింపు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశాం. 25 శాతంగా ఉండే నూకల శాతాన్ని 28 నుంచి 35 శాతానికి పెంచి జిల్లాల వారీగా అనుమతించాలని అభ్యర్థించాం. పాడైపోయిన ధాన్యం కొనుగోలుకు సంబంధించి 3 నుంచి 7 శాతానికి పెంచాలని కోరాం. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయాలని సీఎం జగన్ ఇప్పటికే అధికారులు, మిల్లర్లను ఆదేశించారు. వియ్యంకుడు అఖండ.. కుమారుడు పప్పుండ దివంగత సీఎం వైఎస్సార్ ప్రారంభించిన పోలవరాన్ని ఆయన తనయుడు, సీఎం జగన్ పూర్తి చేస్తారు. సీఎం వన్‌టైమ్ సెటిల్మెంట్ పథకం ద్వారా దాదాపు 40 లక్షల కుటుంబాలకు మేలు చేస్తుంటే సహించలేక చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగ వర్గాలు చంద్రబాబును జీవితాంతం విశ్వసించవు. వియ్యంకుడు అఖండ.. కుమారుడు పప్పుండ.. అనే బాధ ఆయన్ను వేధిస్తోంది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించొద్దని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కంటే ముందే ప్రకటించి పోరాటం చేస్తోంది వైఎస్సార్సీపీనే. -
భూ రికార్డులు చూశాకే ధాన్యం కొనుగోలు
న్యూఢిల్లీ: ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) వ్యాపారులకు కాకుండా అసలైన రైతులకే దక్కేలా కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సుదాన్షు పాండే చెప్పారు. వచ్చే నెల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసేటప్పుడు రైతుల భూమి రికార్డులను పరిశీలించనున్నట్లు (క్రాస్‌చెక్) సుదాన్షు తెలిపారు. రాష్ట్రాల్లోని డిజిటల్ ల్యాండ్ రికార్డులను ఎఫ్‌సీఐతో అనుసంధానించినట్లు వెల్లడించారు. రైతన్నల ప్రయోజనాల కోసమే ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు. రైతులు వారి సొంత భూమిలో లేదా కౌలుకు తీసుకున్న భూమిలో పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సేకరిస్తుందని అన్నారు. ఏ ప్రాంతంలో ఎంత పంట పండించారు అనేది తెలుసుకోవడంతోపాటు అసలైన రైతులకు కనీస మద్దతు ధర దక్కేలా చేయడమే భూమి రికార్డుల క్రాస్‌చెక్ ఉద్దేశమని వివరించారు. -
ధాన్యం రైతు 'ధర'హాసం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ధాన్యాన్ని ప్రభుత్వమే కనీస మద్దతు ధరకు (ఎమ్మెస్పీ) భారీగా కొనుగోలు చేస్తుండటంతో రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తోంది. ఉన్న ఊళ్లోనే ధాన్యాన్ని అమ్ముకోగలుగుతున్నారు. తద్వారా రవాణా ఖర్చు ఆదా అవుతోంది. ప్రస్తుత రబీలో ధాన్యాన్ని విక్రయించేందుకు ఆర్బీకేల ద్వారా 3.55 లక్షల మంది రైతులు తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. శనివారం నాటికి 2,11,320 మంది రైతుల నుంచి రూ.4,521.08 కోట్ల విలువైన 24,14,969.28 టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రబీ పంట కోతలు పూర్తయ్యాయి. దాంతో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే అధిక భాగం ధాన్యాన్ని కొనుగోలు చేశారు. నెల్లూరు, ప్రకాశం.. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే పంట కోతలు ప్రారంభమవుతుండటంతో ఆ ప్రాంతాల్లోనూ వేగంగా ధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాల శాఖ అధికారులు సిద్ధమయ్యారు. ఆర్బీకేల ద్వారా కళ్లాల వద్దే కొనుగోలు చేయడమే కాకుండా 21 రోజుల్లోగా అన్నదాతల ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నారు. ప్రభుత్వమే భారీ ఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేస్తుండటంతో బహిరంగ మార్కెట్లోనూ అదే ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిణామం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 24,14,969.28 టన్నులు కొనుగోలు ► రబీలో రైతులు 21.75 లక్షల హెక్టార్లలో వరి పంట సాగు చేశారు. దిగుబడి అయిన ధాన్నాన్ని వీలైనంతంగా కొనుగోలు చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులకు దిశా నిర్దేశం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే 24,14,969.28 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం విశేషం. కొనుగోళ్లు ఇంకా కొనసాగుతున్నాయి. ► ప్రభుత్వం ధాన్యం క్వింటాలుకు సాధారణ రకానికి రూ.1868, ఏ–గ్రేడ్ రకానికి రూ.1888 ఎమ్మెస్పీగా ప్రకటించి, అదే ధరకు కొనుగోలు చేస్తోంది. రైతుల కళ్లాల వద్దే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. దాంతో గ్రామాల్లోని 7,706 ఆర్బీకేలతో పౌర సరఫరాల శాఖ నేతృత్వంలోని 3,936 ధాన్యం కొనుగోలు కేంద్రాలను అనుసంధానం చేశారు. ► ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు తమ పేర్లను ఆయా గ్రామాల్లోని ఆర్బీకేల్లో నమోదు చేయించుకోవాలి. ఈ–పంటలో ఆ రైతులు వరి సాగు చేశారా లేదా అన్నది సరి చూసుకుని, కళ్లాల వద్దే ధాన్యం కొనుగోలుకు కూపన్లు జారీ చేస్తారు. ఏ రోజున ఏ సమయంలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తారన్నది ఆ కూపన్లలో స్పష్టంగా ఉంటుంది. ► ఆ మేరకు ఆర్బీకేలోని వీఏఏ (గ్రామ వ్యవసాయ సహాయకుడు) కళ్లం వద్దకు వెళ్లి ధాన్యం నాణ్యతను పరిశీలించి, కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఎఫ్‌సీఐ (భారత ఆహార సంస్థ) ప్రమాణాల మేరకు నాణ్యత లేకపోతే.. ధాన్యంలో తేమ శాతం తగ్గే వరకు అరబెట్టాలని వీఏఏ సూచిస్తారు. ఆ తర్వాత ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన 21 రోజుల్లోగా రైతు ఖాతాలో డబ్బులు జమ చేస్తారు. గిట్టుబాటుధర దక్కకపోతే అమ్ముకోవద్దు బహిరంగ మార్కెట్లో కనీస మద్ధతు ధర దక్కకుంటే ధాన్యాన్ని అమ్ముకోవద్దు. ఆర్బీకేల్లో పేర్లు నమోదు చేయించుకోండి. కళ్లాల వద్దే ధాన్యం కొనుగోలు చేయడానికి కూపన్లు జారీ చేస్తాం. కూపన్లలో పేర్కొన్న రోజున ధాన్యం కొనుగోలు చేయడానికి అధికారులు రాకపోతే.. మరో కూపన్ జారీ చేసి, ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. రైతులు పండించిన అన్ని రకాల ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. మిల్లర్లు, దళారీలకు ధాన్యాన్ని అమ్ముకోవద్దు. – కోన శశిధర్, కమిషనర్, పౌర సరఫరాల శాఖ రైతులకు అన్ని విధాలా భరోసా ► దేశంలో ఎక్కడా లేని రీతిలో రాష్ట్రంలో ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం, నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచింది. వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు పంటల సాగులో సూచనలు, సలహాలు ఇస్తూ వెన్నుదన్నుగా నిలుస్తోంది. ► అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల వల్ల పంటకు నష్టం వాటిల్లితే బీమా పథకం ద్వారా పరిహారం అందజేస్తూ రైతులకు బాసటగా నిలుస్తోంది. తుదకు పండించిన పంటను కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తోంది. -
దెబ్బతిన్న ధాన్యం కొనుగోలు
సాక్షి, అమరావతి: అన్నదాతలను అన్ని రకాలుగా ఆదుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనివిధంగా ధాన్యం కొనుగోలు నిబంధనలను సడలించింది. తుపాను కారణంగా తడిసిన, రంగు మారిన, పాడైపోయిన, మొలకెత్తిన, పురుగు పట్టిన ధాన్యాన్ని కూడా రైతుల నుంచి సేకరించి కష్టకాలంలో అండగా నిలవాలని నిర్ణయించింది. సడలించిన నాణ్యత ప్రమాణాలకు మించి పూర్తిగా పాడైపోయిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి ప్రత్యేక గోదాములలో నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని 1,993 గ్రామాల్లో 2,92,689 హెక్టార్లలో పంట దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. పంట నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులు కేంద్ర బృందంతో కలిసి పర్యటించి నివేదిక తయారు చేశారు. ధాన్యాన్ని విక్రయించడంలో ఇబ్బందులుంటే అధికారుల దృష్టికి తెచ్చేందుకు రైతు భరోసా, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రతి 20 కొనుగోలు కేంద్రాల పర్యవేక్షణకు ఒక అధికారిని నియమించారు. పౌరసరఫరాల సంస్థ ఇప్పటి వరకు రూ.701.05 కోట్ల విలువ చేసే 3.74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. సడలించిన నిబంధనలు ఇలా.. తడిసిన, రంగుమారిన, పాడైపోయిన, మొలకెత్తిన, పురుగుపట్టిన ధాన్యాన్ని గ్రేడ్లవారీగా గుర్తించి మద్దతు ధర తగ్గించి చెల్లిస్తారు. తడిసిన, రంగుమారిన ధాన్యం 5 – 6 శాతం ఉంటే ధరలో ఒక శాతం, 6 – 7 శాతం ఉంటే ధరలో 2 శాతం, 7 – 8 శాతం ఉంటే ధరలో 3 శాతం, 8 – 9 శాతం ఉంటే ధరలో 4 శాతం, 9 – 10 శాతం ఉంటే మద్దతు ధరలో 5 శాతం తగ్గించి చెల్లిస్తారు. సడలించిన నిబంధనలు రాష్ట్రం అంతటా వర్తిస్తాయి. పూర్తిగా దెబ్బతిన్న ధాన్యాన్నీ కొంటాం... ‘నాణ్యత ప్రమాణాలకు మించి పూర్తిగా పాడైపోయిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ధర చెల్లిస్తాం. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ప్రత్యేక గోదాముల్లో నిల్వ చేస్తాం. ధాన్యం విక్రయాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పరిష్కరించేందుకు ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశాం’ – కోన శశిధర్, ఎక్స్ అఫీషియో కార్యదర్శి, పౌరసరఫరాల శాఖ -
ధాన్యం తడిసినా కొనుగోలు చేస్తాం
సాక్షి, అమరావతి: తుపాను ప్రభావంతో తడిసిన, మొలకెత్తిన, పురుగు పట్టిన..ఇలా ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్, ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలు చేసేలా జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ బుధవారం కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పరిశీలనకు పౌరసరఫరాల శాఖ అధికారులు వెళ్లారన్నారు. తుపాను కారణంగా దెబ్బతిన్న ధాన్యాన్ని పరిశీలించేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశామని, ఒక బృందం కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, రెండో బృందం తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటిస్తున్నారని వెల్లడించారు. రైతు భరోసా కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పాడైపోయిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 2,578 ధాన్యం కొనుగోలు కేంద్రాలను 6,643 రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానం చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు 4,46,000 మంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నారని, రైతుల కోసం రాష్ట్రస్థాయిలో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశామన్నారు. కంట్రోల్ రూం ఫోన్ నంబర్లు పౌరసరఫరాలశాఖ కమిషనర్ కార్యాలయం: 18004251903 పశ్చిమగోదావరి: 08812 230448 తూర్పుగోదావరి: 08886613611 కృష్ణా: 7702003571, గుంటూరు: 8331056907 -
రైతులకు ఆన్లైన్లో ‘ఈ పేమెంట్’
ఖమ్మం వ్యవసాయ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు చెక్కుల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా ఆన్లైన్ ఈ పేమెంట్ విధానాన్ని జిల్లాలో అమలు చేస్తున్నట్లు జేసీ సురేంద్రమోహన్ తెలిపారు. ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించిన రైతులకు ‘ఆన్లైన్ ఈ పేమెంట్’ ద్వారా సత్వరమే చెల్లింపులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విధానాన్ని ఖమ్మం లోని యాక్సిస్ బ్యాంకులో మంగళవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐదుగురు రైతులకు రూ.12.66లక్షలను వారి ఖాతాల్లో జమ చేశారు. అనంతరం సంబంధిత బ్యాంకు మేనేజర్లు, రైతులతో నేరుగా ఫోన్లో మాట్లాడి నగదు జమ వివరాలు అడిగి తెలుసుకున్నారు. చర్లకు చెందిన ఎం.రామరాజుకు డీసీసీబీలోని అతని ఖాతాకు రూ.3,82,976లను, సత్యనారాయణపురం గ్రామానికి చెందిన పి.చిట్టివెంకటరాజుకు అతని ఎస్బీహెచ్ ఖాతాకు రూ.2.72 లక్షలను, అదే గ్రామానికి చెందిన డి.వీరభద్రరాజుకు చెందిన ఎస్బీహెచ్ ఖాతాకు రూ.2.44 లక్షలు, బి.నర్సింహరాజుకు సంబంధించిన ఎస్బీహెచ్ ఖాతాకు రూ.85,952, డి.శ్రీధర్ ఎస్బీహెచ్ ఖాతాకు రూ.2,81,248లను ఆన్లైన్ విధానం ద్వారా చెల్లించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న కనీస మద్దతు ధరను పొందేందుకు రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని, పైకం చెల్లింపుల్లో జాప్యాన్ని, దళారుల సమస్యను నివారించేందుకు ఆన్లైన్ ఈ పేమెంట్ విధానాన్ని ప్రయోగాత్మకంగా జిల్లాలో ప్రారంభించారని అన్నారు. గత సంవత్సరం 30వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, ఈ ఏడాది దానికి మూడో వంతు 90వేల నుంచి లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు లక్ష్యం నిర్ధేశించామని అన్నారు. జిల్లాస్థాయిలో వ్యవసాయ, మార్కెటింగ్, ఐకేపీ, పౌర సరఫరాల శాఖల సమన్వయంతో పెద్ద ఎత్తున ధాన్యం సేకరణకు కలిసి కట్టుగా పనిచేస్తున్నట్లు తెలిపారు. వరి పండించే రైతులందరికీ ఆన్లైన్ ఈ పేమెంట్ విధానంపై అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ వైవీ.సాంబశివరావు, జిల్లా పౌర సరఫరాల అధికారి గౌరీశంకర్, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులకు వీబీ.భాస్కర్‌రావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు, మార్కెటింగ్ శాఖ ఇన్చార్జ్ సహాయ సంచాలకులు ఎంఏ.అలీమ్, ఇన్ఫర్మేషన్ సెంటర్ జిల్లా అధికారి శ్రీనివాస్, యాక్సిస్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ గురునాధం, మేనేజర్లు రాఘవరెడ్డి, శివతేజ, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. -
ఆంక్షల తూకం..
ధాన్యం కొనుగోలు కేంద్రాల తీరిదీ =నూజివీడు డివిజన్లో మినహా చాలాచోట్ల బోణీ కాని వైనం =జిల్లాలో 93 కేంద్రాల్లో ఐదు కేంద్రాల్లోనే సేకరణ =కొనుగోళ్లలో నిబంధనలతో ఆవైపే చూడని అన్నదాత =బయటిమార్కెట్‌లో రైతులను దోచుకుంటున్న దళారులు సాక్షి, మచిలీపట్నం : పేరుకే అవి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు.. వాస్తవానికి అక్కడ పెట్టే మెలికలతో చికాకు వచ్చిన రైతులు మళ్లీ కమీషన్ ఏజెంట్లకే ధాన్యాన్ని అమ్ముకోక తప్పట్లేదు. ప్రస్తుత సార్వా సీజన్లో దెబ్బతిన్న పంటను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేలా గత నెల 25న జిల్లాలో 93 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశారు. జిల్లాలోని నాలుగు సబ్ డివిజన్ల పరిధిలో ఐకేపీ ద్వారా 42, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్) ద్వారా 51 కొనుగోలు కేంద్రాలను తెరిచారు. విచిత్రం ఏమిటంటే కొనుగోలు కేంద్రాలు తెరిచి 20 రోజులు దాటినా ఇప్పటివరకు జిల్లాలో వీటి ద్వారా సేకరించిన ధాన్యం 1100 క్వింటాళ్లు మాత్రమే. నూజివీడు డివిజన్లో 27 కొనుగోలు కేంద్రాలుంటే.. వాటిలో మర్లపాలెం, రెడ్డిగూడెం, చెక్కలపల్లి, కూనపరాజుపర్వ నాలుగు కేంద్రాల్లో మాత్రమే కొనుగోళ్లు బాగున్నాయి. విజయవాడ డివిజన్లో 20 కొనుగోలు కేంద్రాలు తెరిచినా గొల్లపూడి సెంటర్లో మాత్రమే బోణీ అయ్యింది. మచిలీపట్నం డివిజన్లో 30, గుడివాడ డివిజన్లో 16 కొనుగోలు కేంద్రాలు ఉన్నా వాటి దరిదాపులకే రైతులు వెళ్లడంలేదు. ఆ డివిజన్లలో మిల్లర్లదే పైచేయి కావడంతో అయినకాడికి వారికే అమ్ముకుంటున్నారు. దెబ్బతిన్న పంటకు ధరేదీ? జిల్లాలో వరుస వైపరీత్యాలతో కుదేలైన రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు అక్కరకు రాకపోవడంతో కమీషన్ ఏజెంట్లు, మిల్లర్లను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతుకు కష్టమెక్కువ ధర తక్కువ అనే రీతిలో కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. అసలే దెబ్బతిన్న పంటను అరకొరగానైనా దక్కించుకునేందుకు హడావుడిగా మాసూళ్లు చేసే రైతాంగానికి కొనుగోలు కేంద్రాలు ఏ మాత్రం ఉపయోగపడటం లేదు. అందుకే ఆవైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. అక్కడ ఇచ్చే ధర తక్కువగా ఉండటంతో పాటు సవాలక్ష ఆంక్షలు పెట్టడం కూడా కారణమని రైతులు చెబుతున్నారు. తూకంలో ఆంక్షలు... కొనుగోలు కేంద్రాల్లో ఆంక్షల తూకంతో రైతులు వాటిపై ఆసక్తి చూపడం లేదు. ధాన్యం సేకరణకు ఇచ్చిన మార్గదర్శకాల్లో మట్టిబెడ్డలు, రాళ్లు, ఇతర పదార్థాలు ఒక శాతం, రంగుమారిన, దెబ్బతిన్న ధాన్యం, పురుగుశాతం 4 శాతం వరకు, తప్ప తాలు గింజలు 3 శాతం, ధాన్యంలో మిగిలిన రకాలు కలిసిపోవడం 7 శాతం, తేమ 17 శాతం వరకు అనుమతిస్తున్నారు. ఈ నిబంధనలకు లోబడి ఉంటేనే బస్తా ధాన్యం రూ.1008కి కొనుగోలు చేసేలా ధర నిర్ణయించారు. వరుస విపత్తుల వల్ల కొనుగోలు కేంద్రాల్లోని నిబంధనలకు లోబడి ధాన్యం లేకపోవడం సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో రైతులు ఆయా కేంద్రాల్లో ధాన్యం నాణ్యత పరిశీలన కోసం పడిగాపులు పడలేక, అక్కడి నిబంధనలు తట్టుకోలేక అయినకాడికి కమీషన్ ఏజెంట్లు, మిల్లర్లు, దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించింది. దళారుల రైతుల పరిస్థితి ఆసరాగా చేసుకొని బస్తాకు రూ.800 నుంచి రూ.1000 వరకు చెల్లిస్తున్నారు. రవాణా ఖర్చులతో పోల్చితే నాణ్యమైన ధాన్యానికి కాస్త మెరుగైన ధరే లభిస్తున్నా.. విపత్తుల వల్ల నాణ్యత తగ్గిన ధాన్యం విషయంలో రైతులు దళారులు చెప్పిన ధర చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొనుగోలు కేంద్రాలతో అమ్మకాలు వేగం జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవటం వల్ల బయట మార్కెట్లో ధాన్యం ధర దక్కేలా చేయగలిగాం. కనీస మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాల్లో కొనేలా మార్గదర్శకాలు ఉన్నాయి. బస్తా ధాన్యం రూ.1008కి కొనుగోలు కేంద్రాల్లో కనీస మద్దతు ధరను నిర్ణయించాం. దీని వల్ల బయట మార్కెట్లో అదనపు ధరకు రైతు అమ్ముకునే అవకాశం వచ్చింది. జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం చేసేలా చర్యలు తీసుకున్నాం. - చిట్టిబాబు, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ మొక్కుబడి కేంద్రాలు... జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులకు ఏమాత్రం ఉపయోగపడని మొక్కుబడి కేంద్రాలుగానే మారాయి. అక్కడ పెట్టే ఆంక్షలతో రైతులు వాటిపై ఆసక్తి చూపడం లేదు. గత్యంతరంలేని స్థితిలో రైతులు కమీషన్‌దారులను ఆశ్రయించి అయినకాడికి అమ్ముకుంటున్నారు. వరుస ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసేలా ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ణయాన్ని ప్రకటించలేదు. నిబంధనలు సడలించి కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం మద్దతు ధరకే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి. - ఎంవీఎస్ నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ నిబంధనల్లో సడలింపు ఏదీ నష్టపోయిన పంటల్ని జిల్లాలో పరిశీలించిన కేంద్ర బృందం ధాన్యం కొనుగోళ్లలో నిబంధనలు సడలిస్తామని చెప్పేసి వెళ్లారు. ఆ తర్వాత నిబంధనల్ని సడలించామన్న ఒక ప్రకటన కూడా ప్రభుత్వం నుంచి రానే లేదు. రంగుమారిన, సగం పాలుపోసుకున్న ధాన్యానికి మద్దతు ధర ఇవ్వకపోతే ఒక్క గింజ కూడా కొనుగోలు కేంద్రానికి తోలే అవకాశమే లేదు. - పెన్నేరు ప్రభాకర్, వడ్లమన్నాడు రైతు క్లబ్ కన్వీనరు -
ధాన్యం కొనుగోలుకు 93 కేంద్రాలు
=ఐకేపీ మహిళా గ్రూపుల ఆధ్వర్యంలో 42 =పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో 51 =జేసీ ఉషాకుమారి వెల్లడి కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : జిల్లాలో 93 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి జాయింట్ కలెక్టర్ పి.ఉషాకుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2013-14 ఖరీఫ్ సీజన్లో రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి మద్దతు ధర లభించేలా, దళారుల బారినపడకుండా ప్రభుత్వం తీసుకునే చర్యల్లో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. ఇందిరా క్రాంతిపథం మహిళా గ్రూపుల నిర్వహణలో 42 కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల నిర్వహణలో 51 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఒక్కొక్క కొనుగోలు కేంద్రానికి వాటి పరిధిలో ఉన్న రైస్‌మిల్లులను కేటాయిస్తున్నట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల వద్ద నుంచి సేకరించిన ధాన్యానికి కేటాయించిన బిల్లులకు రవాణా అనుమతులు ఇచ్చినట్లు వివరించారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సిబ్బందిని నియమించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. కేంద్రాల పర్యవేక్షకులుగా పౌరసరఫరాల డీటీలను నియమించినట్లు చెప్పారు.