98 పోస్టులకు 89 మంది ఓకే !
► స్కూల్ అసిస్టెంట్ల సెలక్షన్ జాబితా విడుదల
► తొమ్మిది పోస్టులకు అభ్యర్థులు లేరు
► నేడు సర్టిఫికెట్ల పరిశీలన
అనంతపురం ఎడ్యుకేషన్ : కలెక్టర్ కోన శశిధర్ ఆమోదంతో డీఈవో అంజయ్య గురువారం డీఎస్సీ-14 స్కూల్ అసిస్టెంట్ల సెలక్షన్ జాబితాను అధికారికంగా ప్రకటించారు. 98 పోస్టులకు 89 మంది ఓకే అయ్యారు. మిగిలిన తొమ్మిది పోస్టులకు ఆయా కేటగిరీల్లో అభ్యర్థులు లేరు. ఇందులో ఎస్‌ఏ ఇంగ్లిష్ ఒక పోస్టు (వీహెచ్ మహిళ), సంస్కృతంలో రెండు పోస్టులు (ఓసీ మహిళ, ఎస్సీ మహిళ), ఎస్‌ఏ గణితంలో ఒక పోస్టు (హెచ్‌హెచ్ మహిళ), ఎస్‌ఏ గణితం ఉర్దూ మీడియంలో మూడు పోస్టులు (మహిళ), ఎస్‌ఏ ఫిజికల్‌సైన్స్‌లో ఒక పోస్టు (వీహెచ్ మహిళ)కు అభ్యర్థులు లేరు. పీఈటీ పోస్టులకు సంబంధించి ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం అందలేదని డీఈఓ తెలిపారు.
నేడు సర్టిఫికెట్ల పరిశీలన
సెలక్షన్ జాబితాలోని అభ్యర్థుల సెల్‌ఫోన్లకు రాష్ట్ర అధికారుల నుంచి ఇప్పటికే మెసేజ్‌లు వెళ్లాయి. వారికి శుక్రవారం ఉదయం 10 గంటలకు స్థానిక గిల్డ్‌ఆఫ్ సర్వీస్ స్కూల్ (ఇంగ్లిష్ మీడియం, రైతు బజారు వీధి)లో సర్టిఫికెట్లు పరిశీలన ఉంటుందని డీఈఓ తెలిపారు. స్టడీకి సంబంధించి అన్ని సర్టిఫికెట్లు ఒరిజనల్‌తో పాటు రెండు సెట్ల జిరాక్స్ ప్రతులు తీసుకురావాలని సూచించారు. ఓ సీడీలో సర్టిఫికెట్లు స్కాన్ చేసి తీసుకురావాలన్నారు. ఏదైనా కారణాల వల్ల తొలిరోజు హాజరుకాలేకపోయిన అభ్యర్థులకు శనివారం కూడా సర్టిఫికెట్లు పరిశీలన ఉంటుందని స్పష్టం చేశారు.