కుప్పం: నవుు్మకున్న వ్యవసాయుం నట్టేట వుుంచింది.. రుణవూఫీ నిరాశను మిగిల్చింది.. తాకట్టు పెట్టిన బంగారు నగలు వేలంలో వెళ్లాయి.. రుణాలు చెల్లించాలని బ్యాంకు నోటీసులు.. వడ్డీతో సహా చెల్లించాలని ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్లు.. ఈ బాధలన్నీ తట్టుకోలేక ఓ రైతు పురుగుల వుందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కుప్పం వుండల పరిధిలోని ఎన్.కొత్తపల్లె గ్రావూనికి చెందిన వేణుగోపాల్ (37) వ్యవసాయాన్ని నవుు్మకుని జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వుూడేళ్లుగా వ్య వసాయుం అంతంత మాత్రంగానే సాగుతోంది. తనకున్న 3 ఎకరాల 50 సెంట్ల భూమిలో వ్యవసాయుం చేసేందుకు అప్పులు చేసి నాలుగు బోర్లు వేశారు. రూ.8 లక్షలు ఖర్చు పెట్టారు. కానీ చుక్కనీరు రాలేదు. దీంతో పట్టణంలోని కరూర్ వైశ్యా బ్యాంకులో వుూడు ఖాతాల్లో బంగారు నగలు తాకట్టు పెట్టి రూ.99 వేలు రుణం పొందారు. కరూర్ వైశ్య బ్యాంక్ లోన్ నెంబర్ 147391857193లో రూ.20 వేలు, లోన్ నెంబర్ 147391779030లో రూ.59 వేలు, లోన్ నెంబర్ 147391781436లో రూ. 20 వేలు రుణం తీసుకున్నారు. దీంతో పాటు ఇండియున్ బ్యాంకులో భూవుుల పాసుపుస్తకాలు పెట్టి రూ.70 వేలు రుణం పొందారు.
పట్టుపరిశ్రవు శాఖలో రుణం తీసుకొని పట్టుగూళ్ల పెంపకానికి షెడ్డును నిర్మించారు. బోర్లు వేసేందుకు ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ.8 లక్షలు అప్పు చేశారు. రుణవూఫీ కలసి వస్తుందని ఆశపడితే చివరకు నిరాశ మిగిల్చింది. దీనికి తోడు కరూర్ వైశ్యా బ్యాంక్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 2. వూర్చి 6 తేదీల్లో నోటీసులు వచ్చాయి. మరోపక్క ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల నుంచి తీవ్ర స్థారుులో ఒత్తిళ్లు మొదలయ్యాయి. అప్పుల బాధ తట్టుకోలేక కూలీ పనుల కోసం వుూడు నెలలుగా బెంగళూరుకు నిత్యం రాకపోకలు సాగించారు. కొంత భూమి విక్రయించి అప్పులు తీర్చేస్తామని కుటుంబ సభ్యలను కోరితే వారు కాదన్నారు. ఏం చేయాలో దిక్కుతోచక వునస్తాపానికి గురైన వేణుగోపాల్ శుక్రవారం రాత్రి పొలం వద్ద పురుగుల వుందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలియడంతో స్థానికులు కుప్పం పీఈఎస్ ఆస్పతికి తరలించారు. చికిత్స పొందుతూ వేణుగోపాల్ అర్ధరాత్రి వుృతి చెందాడు.
ఆదుకోని రుణమాఫీ.. రైతు ఆత్మహత్య
Published Sun, May 10 2015 5:04 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement