విశాఖ విమానాశ్రయానికి ‘ఏ’ గ్రేడ్‌ హోదా | A grade status to Vishakha International Airport | Sakshi
Sakshi News home page

విశాఖ విమానాశ్రయానికి ‘ఏ’ గ్రేడ్‌ హోదా

Published Tue, Feb 21 2017 1:28 AM | Last Updated on Tue, Sep 5 2017 4:11 AM

విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం ‘ఏ’ గ్రేడ్‌ హోదా దక్కించుకుంది. దీనికి తాజాగా ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆమోదముద్ర వేసింది.

గోపాలపట్నం (విశాఖ): విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం ‘ఏ’ గ్రేడ్‌ హోదా దక్కించుకుంది. దీనికి తాజాగా ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆమోదముద్ర వేసింది. దీంతో శ్రీనగర్, గోవా, కోచి, పుణే విమానాశ్రయాల సరసన విశాఖ విమానాశ్రయం నిలిచింది.

20 లక్షలు దాటిన ప్రయాణికులు
విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం రివ్వున ఎదిగింది. 2011– 12లో 9,58,160 మంది ప్రయాణిస్తే, 2012– 13లో 10,37,608 మంది, 2013– 14లో 10,12,522 మంది, 2014– 15 నాటికి 10,99,480 మంది ప్రయాణించగా, ఈ ఏడాది జనవరి నాటికి 20 లక్షల ప్రయాణికులు దాటినట్లు సమాచారం. ఇలా 20 లక్షల ప్రయాణికులు దాటిన అంతర్జాతీయ విమానాశ్రయాలకు ఏ గ్రేడ్‌ విమానాశ్రయ హోదా కల్పిస్తారు. ఇది విశాఖకు దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement