విజయనగరం(వేపాడ): విజయనగరం జిల్లా వేపాడ మండల కేంద్రంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో సోమవారం మృతి చెందాడు. వివరాలు.... వేపాడ గ్రామానికి చెందిన పి.మహ్మద్(26) ఎలక్ట్రిక్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం సాయంత్రం మహ్మద్ మృతదేహం గ్రామంలోని ఓ ఇంటి వద్ద కనిపించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యా? ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.