ఆధార్ అనుసంధానం లేకుంటే రేషన్ కట్
ఎల్.ఎన్.పేట: రేషన్ కార్డులకు ఆధార్ నంబర్ అనుసంధానం తప్పనిసరిగా చేయించుకోవాలని, లేకుం టే రేషన్ నిలుపుదల జరుగుతుందని డీఎస్‌వో సీహెచ్ ఆనందకుమార్ అన్నారు. తహశీల్దార్ కార్యాలయం లో బుధవారం డీలర్లతో సమావేశం నిర్వహించారు. సరుకుల పంపిణీలో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటివరకు జిల్లాలో 92.47శాతం కార్డులకు ఆధార్ అనుసంధానం చేశామన్నారు. ఇంకా మిగిలి పోయిన వారికోసం రెండో విడతగా అవకాశం కావాలని ప్రభుత్వానికి రాయడం జరిగిందన్నారు. ప్రభుత్వం అనుమతి ఇస్తే రెండో విడతలో ఆధార్ అనుసంధానం పూర్తి చేస్తామన్నారు. సమావేశంలో తహశీల్దార్ పి.రోజ్, సీఎస్‌డిటీ బి.శ్రీదేవి, ఉప తహశీల్దార్ నానిబాబు, ఆర్‌ఐ బి.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
జాబ్‌కార్డుకు ‘ఆధార్’ తప్పనిసరి
పలాస రూరల్: జిల్లాలో ఉపాధి హామీ పథకంలో జాబ్‌కార్డు ఉన్న వేతనదారులు ఆధార్ నంబర్ అనుసంధానం చేసుకోవాలని వాటర్‌షెడ్‌పథకం జిల్లా అదనపు ప్రాజెక్టు డెరైక్టర్ టి.సత్యన్నారాయణ కోరారు. పలాస మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఆయన ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 8,19,624 జాబ్‌కార్డుదారులు ఉండగా 6,77, 378 మంది ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేసుకున్నారన్నారు. మిగి లిన వారు కూడా జాబ్‌కార్డును ఆధార్‌తో అనుసంధా నం చేస్తేనే వేతనాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. త్వరగా జాబ్‌కార్డులకు ఆధార్ అనుసంధానం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
వాటర్‌షెడ్ పథకం అమలులో ఉన్న గ్రామాల్లో 2.80 లక్షలు టేకు మొక్కలు పంపిణీ చేయ డం జరిగిందన్నారు. జిల్లాలో 4,536 కొబ్బరి మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. జలసంరక్షణ పథకంలో జిల్లాలో 1398 చెక్‌డ్యాంలు పాక్షికంగా దెబ్బతినగా, 2213 చెక్‌డ్యాంలు ఎక్కువగా మరమ్మతులకు గురయ్యాయని, 291 చెక్‌వాల్స్ పాక్షికంగా, 477 తీవ్ర స్థాయిలో మరమ్మతులకు గురయ్యాయని చెప్పారు. జిల్లాలో 161 ఇంకు డు గుంటలు మరమ్మతులకు గురి కాగా 251 ఇంకుడు గుంతలు బాగా పాడయ్యాయన్నారు. ఈ సమావేశంలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం, ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఏపీవో బి.ప్రమీల, ఈసీ సురేష్‌వర్మ, టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.