ఉప ఎన్నికలో అధికార దుర్వినియోగం
ఆంధ్రప్రదేశ్‌లో నంద్యాల ఉప ఎన్నికలో విచ్చలవిడిగా డబ్బు, మద్యం వినియోగిస్తున్నారని, అధికార దుర్వినియోగం జరుగుతోందని ఎన్నికల నిఘా వేదిక రాష్ట్ర కమిటీ ఆరోపించింది.
ఎన్నికల ప్రధాన అధికారికి ఎన్నికల నిఘా వేదిక వినతి
సాక్షి, సిటీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో నంద్యాల ఉప ఎన్నికలో విచ్చలవిడిగా డబ్బు, మద్యం వినియోగిస్తున్నారని, అధికార దుర్వినియోగం జరుగుతోందని ఎన్నికల నిఘా వేదిక రాష్ట్ర కమిటీ ఆరోపించింది. ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కును స్వేచ్ఛగా, ప్రశాంతంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కమిటీ చైర్మన్ జస్టిస్ అంబటి లక్ష్మణరావు, కన్వీనర్ వి.లక్ష్మణరెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఫిర్యాదు చేయొచ్చు : నంద్యాల ఉప ఎన్నికలో ప్రతి పోలింగ్ బూత్‌లో సీసీ కెమెరాలు, వెబ్ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ఎన్నికల్లో జరిగే అక్రమాలను ఫోన్ ద్వారా తెలిజయజేయవచ్చని అన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు ప్రింటర్‌ను జత పరిచామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఓటర్ల లిస్టులో 3,200 మందికి 2 చోట్ల ఓట్లు ఉండటాన్ని గుర్తించి తొలగించామని చెప్పారు. అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడితే చర్యలు ఉంటాయన్నారు. ఎన్నికల అక్రమాలపై 1950 టోల్ ఫ్రీ నంబర్‌కు, 08518–277305, 08518–277309లకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.