హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా చెక్పోస్టులపై ఆదివారం ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. చెక్ పోస్టులలో అనాధికారంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేటు వ్యక్తులను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. చిత్తూరు జిల్లాలోని నరహరిపేట ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టుపై ఏసీబీ దాడులు నిర్వహించిన నేపథ్యంలో అవినీతికి పాల్పడుతున్న 18మందిని అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి 47వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ తెలిపింది.
అనంతపురం జిల్లాలోని పెనుకొండ ఆర్టీఏ చెక్పోస్టుపై ఏసీబీ దాడులు జరిపి 34వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అక్కడి అధికారులను ఏసీబీ విచారిస్తోంది. నెల్లూరు జిల్లాలోని తడ ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుపై దాడులు నిర్వహించగా భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ పేర్కొంది. ఆదిలాబాద్ జిల్లాలోని బోరజ్ చెక్పోస్టుపైనా, అలాగే శ్రీకాకుళం జిల్లాలోని ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టుపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నట్టు సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా చెక్పోస్టులపై ఏసీబీ దాడులు
Published Sun, Dec 29 2013 8:22 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement