అవినీతి ఖజానా... | Corruption in the office of the Sub-Treasury | Sakshi
Sakshi News home page

అవినీతి ఖజానా...

Published Sat, Dec 5 2015 1:22 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

Corruption in the office of the Sub-Treasury

ప్రతీ పనికి ఒక్కో రేటు పెన్షనర్లనూ వదలని జలగలు
ఇదీ కలెక్టరేట్‌లోని సబ్‌ట్రెజరీ కార్యాలయంలో పరిస్థితి

 
హన్మకొండ అర్బన్ : కలెక్టరేట్‌లోని డీపీవో కార్యాలయంలో ఏసీబీ దాడులు జరిగి నెల కూడా దాట లేదు. అరుుతే, ఈ కార్యాలయం పక్కనే ఉండే సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఉద్యోగులు తమ అక్రమ వసూళ్లను ఆపలేదనే ఫిర్యాదులు వస్తూనే ఉన్నారుు. ప్రతీ పనికో రేటు నిర్ణరుుంచిన ఉద్యోగులు కార్యాలయూనికి వచ్చే వారిని పీడిస్తుండగా... ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నారుు. వీరి అవినీతి బాగోతానికి సంఘం నేతలు గా చెలామణి అవుతున్న కొందరు సహకరిస్తుండడం గమనార్హం.
 
చావు పైసలకు బేరం
ప్రభుత్వ పెన్షనర్ మరణిస్తే తక్షణ అవసరాల కింద ఆ పెన్షనర్ తీసుకునే పింఛన్ మొత్తాన్ని అందజేస్తారు. అరుుతే, ఈ డబ్బు ఇచ్చే విషయంలోనూ సబ్‌ట్రెజరీ ఉద్యోగులు కక్కుర్తి ప్రదర్శస్తున్నారు. తమకు అనుకూలంగా ఉండే రిటైర్డ్ ఉద్యోగ సంఘాల నేతలను ముందు ఉం చి వ్యవహారం నడిపిస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నారుు. కార్యాలయంలో కూడా కొందరు సంఘం నేతల హవా సాగుతుండడం, వీరికి అధికారుల సహకారం ఉండడంతో దందాకు అంతు లేకుండా పోరుుందని తెలుస్తోంది.
 
తండ్రి చనిపోయాడని వస్తే....

వరంగల్‌లోని ఎల్బీ కళాశాలలో పనిచేసి రిటైర్ అయిన గురువయ్య పింఛన్ పొందుతూ ఇటీవల మృతి చెందారు. దీంతో ఆయనకు వచ్చే పింఛన్‌ను తల్లి పేరిట మార్చాలని కోరుతూ హన్మకొండ మండలం భట్టుపల్లికి చెందని కుమార్ కలెక్టరేట్‌లోని ఏటీవో దుర్గాప్రసాద్‌ను కలిశారు. ఈ విషయమై మరో అధికారిని కలవాలని దుర్గాప్రసాద్ సూచించారు. దీంతో కుమార్ వెళ్లి తన పనిని వివరించగా.. ఫైల్ మొత్తం పరిశీలించిన సదరు ఉద్యోగులు కొన్ని కాగితాలు సరిగ్గా లేవు, మరికొన్ని కావాలంటూ తిప్పి పంపించారు. ఆ తర్వాత ఆయూ పత్రాలతో వెళ్లినా ఏదో కారణం చెబుతూ విసుగెత్తించారు. చివరకు అసలు సంగతేంటని విచారిస్తే రూ.3వేలు ఇస్తే ఒక్క రోజులో పని అరుుపోతుందని సెలవిచ్చారు! అరుుతే, తన వద్ద అంత మొత్తం లేదని చెప్పుకొచ్చిన కుమార్ రూ.2వేలు ఇవ్వగా.. వెంటనే ఏ కాగితం అవసరం లేకుండా పని పూర్తరుుపోరుుంది.
 
పట్టించుకోని అధికారులు
కలెక్టరేట్‌లో ఉన్న సబ్ ట్రెజరీ కార్యాలయంలో అవినీతి వ్యవహారంపై పక్కనే ఉన్న జిల్లా ఖజానా అధికారులకు ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోవడం లేదని చెబుతున్నారు. గతంలో ఉన్నతాధికారులు వచ్చిన సమయంలో కొందరు ఎస్టీవోలో అవినీతిపై ఫిర్యాదు చేశారు. కాగా, శనివారం జిల్లాకు రానున్న ట్రెజరీ స్టేట్ డెరైక్టర్, ఇతర అధికారులకు సబ్ ట్రెజరీ ఉద్యోగుల వ్యవహారంపై ఫిర్యాదు చేసేందుకు పలువురు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ ఫిర్యాదుతోనైనా శాఖ ఉన్నతాధికారులు స్పంది స్తారా, కార్యాలయ ఉద్యోగులు మారతారా అన్నది వేచి చూడాల్సిందే.
 
మధ్యవర్తి ఉంటేనే...

కలెక్టరేట్‌లోని ఎస్టీవో కార్యాలయానికి ఏదైనా పని నిమిత్తం కొత్తవారు వస్తే నానా పాట్లు పడాల్సిందే. ఇక్కడ మధ్యవర్తులు లేనిదే పనికాదు. అరుుతే, వీరిని అధికారులే పెంచి పోషిస్తున్నారనే విమర్శలు ఉన్నారుు. ఇక నవంబర్ మాసం వచ్చిందంటే కార్యాలయ ఉద్యోగులకు పండగే. ఈ నెలలో పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉండడంతో అందిన కాడికి దండుకుంటారు. లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చన వారికి రశీదు ఇవ్వరు... అదేంటని అడిగితే రేపు, తర్వాత... అంటూ వాయిదాలు పెడుతుంటారు. తీరా చూస్తే మీ సర్టిఫికెట్ కనిపించడం లేదు. ఇంకొకటి తెచ్చి ఇవ్వాలని సూచిస్తారు. కలెక్టరేట్‌లో పనిచేసే ఒక మహిళా ఉద్యోగి ఫ్యామిలీ పెన్షన్ కోసం లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చినా సుమారు మూడు నెలలు పింఛన్ ఆపేశారు. ఇదేంటని అడిగితే మీరు సర్టిఫికెట్ ఇవ్వలేదని బదులివవ్వడమే కాకుండా.. నోటికి వచ్చినట్లు మాట్లాడారని ఆ ఉద్యోగి వాపోయూరు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement