treasury office
-
ఇక్కడ.. లెక్కే లేదు..!
సాక్షి, నెట్వర్క్: ప్రతి పనికి, ప్రతి ఆదేశానికి ఇక్కడ ఓ లెక్క, పద్ధతి ఉండాలి. కానీ అర దశబ్దానికి పైగా ఒకే పోస్టులో పాతుకుపోయిన కొందరు ఉన్నతాధికారుల కారణంగా రాష్ట్ర ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ విభాగంలో ఎలాంటి లెక్క, పద్ధతి లేకుండా పోయిందని చెపుతున్నారు. సిబ్బంది విన్నపాలు, విజ్ఞాపనలు కనీస పరిశీలన లేకుండానే బుట్టదాఖలవుతున్న తీరు ఉన్నత స్థాయి అధికారుల ఇష్టారాజ్యానికి అద్దం పడుతోందని ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా అద్దె భవనాల్లో ఉన్న పలు సబ్‌ట్రెజరీ కార్యాలయాల్లో నీరు కురుస్తోంది. అలాంటి వాటిని వదిలి సొంత భవనాల్లోకి వెళ్లాలన్న విజ్ఞప్తులను పట్టించుకునేవారు కరువయ్యారని అంటున్నారు. అలాగే పదోన్నతులు, బదిలీలు, డిప్యుటేషన్లు, వేధింపులు, మెడికల్ రీయింబర్స్మెంట్ ఫైళ్ల పరిష్కారంలో జాప్యంపై ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఉద్యోగుల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. సొంతభవనాలు సిద్ధమైనా.. అద్దె ఆఫీసుల్లోనే రాష్ట్రంలో పలు చోట్ల సొంతంగా నిర్మించిన కొత్త సబ్‌ట్రెజరీ భవనాలు సిద్ధమైనా.. ప్రైవేటు భవనాలపై ఆ శాఖ ఉన్నతాధికారులకు మోజు తీరటం లేదని విమర్శలు వస్తున్నాయి. ఓ వైపు సౌకర్యాల లేమితో పాటు పలు భవనాలు వర్షాలకు నీరు కురుస్తూ, పెచ్చులూడుతూ ఉద్యోగులను భయపెడుతున్నా ఉన్నతాధికారులు వాటిని వీడటం లేదని ఆరోపణలున్నాయి. సొంత భవనాల్లోకి మారకపోవడం ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా సబ్‌ట్రెజరీ భవనాల ఆధునీకరణ కోసం నాలుగేళ్ల క్రితం రూ.23.8 కోట్లను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు బదిలీ చేశారు. అయితే ప్రభుత్వం ఉన్న భవనాల ఆధునీకరణ (రీ మోడలింగ్) కోసమే నిధులిస్తే.. అన్నీ తానై వ్యవహరిస్తున్న డైరెక్టరేట్ అధికారి కనుసన్నల్లో పలు చోట్ల నూతన భవనాలనే కట్టించేశారు. అయితే నూతన భవనాలు పూర్తయి ఆరునెలలు అవుతున్నా.. ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్మించారన్న కారణంతో వాటిని ట్రెజరీ డైరెక్టరేట్ తిరిగి స్వాధీనం చేసుకోకపోవటంతో ఆయా చోట్ల ఉద్యోగులు అవస్థలు పడాల్సి వస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆరునెలల క్రితమే మిర్యాలగూడ, హుజూర్నగర్, చండూరు, నిడ్మనూరు, కోదాడ, నకిరేకల్, నాంపల్లిలలో నూతన భవనాలు సిద్ధం కాగా, అలంపూర్‌లో నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఇక రామాయంపేట, తూప్రాన్, భద్రాచలం తదితర చోట్ల టెండరు స్థాయిలోనే పనులు నిలిపేశారు. విన్నపాలు వినరు.. ‘ట్రెజరీ కార్యాలయానికి వచ్చే బిల్లులను నిబంధన మేరకు ఐదు రోజుల్లో ఆమోదించాలి.. లేదా తిరస్కరించాలి. లేదంటే మాకు మెమో తప్పదు. కానీ మేము ట్రెజరీస్ డైరెక్టరేట్‌కు చేసే విన్నపాలకు మాత్రం దిక్కులేదు. పరిష్కారానికి ఎన్ని నెలలైనా పట్టొచ్చు’అని ఉద్యోగులు అంటున్నారు. సమస్య తీవ్రతను చెప్పేందుకు డైరెక్టర్‌ను కలవడానికి వెళితే ఎవరికీ అనుమతి ఉండదంటూ రాష్ట్ర ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. తీవ్ర అనారోగ్యానికి గురై, కోలుకునేందుకు రూ.50 లక్షల ఆస్పత్రి బిల్లు చెల్లించిన ఒక ట్రెజరీ ఉ ద్యోగికి చెందిన మెడికల్ రీయింబర్స్మెంట్ ఫైల్ ను డైరెక్టరేట్‌లో 3 నెలలు తొక్కిపెట్టిన వైనం.. డైరెక్టరేట్‌లో ఉద్యోగుల దుస్థితికి నిదర్శనమని సబ్‌ట్రెజరీ స్థాయి అధికారి ఒకరు ‘సాక్షి’వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యుటేషన్లు, పదోన్నతుల విషయ ంలో సీనియర్ ఐఏఎస్ పూర్తి మద్దతు తమకుందన్న ధీమాతో ఏకంగా ఆర్థిక మంత్రి సూచనలను సైతం డైరెక్టరేట్ ఉన్నతాధికారులు పట్టించుకోవటం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్లు పోసి కొన్నా.. తప్పని మొరాయింపు ట్రెజరీ కార్యాలయాలకోసం ఇటీవల రూ.6 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన కంప్యూటర్లు ఉద్యోగులకు చుక్కలు చూపెడుతున్నాయి. సిస్టమ్ ఆన్‌చేసిన అనంతరం బూట్ అయ్యేందుకే ఐదు నుంచి పది నిమిషాల సమయం పడుతోందని చెబుతున్నా రు. మధ్య, మధ్యలో సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయక షట్‌డౌన్ అవుతుండటంతో సమయమంతా వృథా అవు తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా కొన్న వాటికంటే ఆరేళ్ల క్రితంనాటి కంప్యూటర్లే మెరుగ్గా పనిచేస్తున్నాయని చెపుతున్నారు. ఆఫీసుకు వెళ్లాలంటే భయం.. ఆఫీసుకు వెళ్లాలంటేనే భయం వేస్తోంది. పూర్తి శిథిలావస్థకు చేరిన అద్దె భవనంలో ఇప్పుడు విధులు నిర్వహిస్తున్నాం. భవనం స్లాబ్ పెచ్చులూడిపడుతోంది. వర్షం నీళ్లు వచ్చి అనేక ఫైళ్లు తడిచిపోతున్నాయి. కొత్త భవనం సిద్ధమైనా ఇంకా ప్రారంభించటం లేదు. – ఎం.సతీశ్, సీనియర్ అకౌంటెంట్, చండూరు, నల్లగొండ జిల్లా -
ఎనిమిది ట్రంకు పెట్టెల్లో ఆభరణాలు, నగదు
-
మనోజ్ అవినీతి విలాసం..
అనంతపురం క్రైం: ట్రంకు పెట్టెల్లో భారీగా నగదు, బంగారం, వెండి ఆభరణాలు వెలుగుచూసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపడం తెలిసిందే. వీటి వెనుక ఉన్న ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్ గాజుల మనోజ్‌కుమార్ ఆస్తుల విలువ రూ.3 కోట్ల పైమాటేనని పోలీసుల విచారణలో వెల్లడయింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓఎస్డీ రామకృష్ణ ప్రసాద్ వెల్లడించారు. బుక్కరాయసముద్రం ఎస్సీ కాలనీలోని బాలప్ప ఇంట్లో మారణాయుధాలున్నాయనే సమాచారంతో ఈ నెల 18న ఎస్పీ సత్యయేసుబాబు ఆదేశాల మేరకు అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, సీసీఎస్ డీఎస్పీ ఈ.శ్రీనివాసులు, తాడిపత్రి డీఎస్పీ ఏ.శ్రీనివాసులు, ట్రైనీ డీఎస్పీ చైతన్య నాలుగు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం 4 గంటల వరకు సోదాలు నిర్వహించి బంగారం, వెండి, నగదు, డిపాజిట్ పత్రాలు స్వాధీనం చేసుకుని తహసీల్దార్ సమక్షంలో పంచనామా నిర్వహించారు. అవన్నీ ట్రెజరీ కార్యాలయంలో పనిచేసే సీనియర్ అకౌంటెంట్ మనోజ్వేనని విచారణలో గుర్తించారు. రూ.15 లక్షల విలువ చేసే హార్లీ డేవిడ్సన్ బైక్.. బాలప్ప ఇంట్లోకి పెట్టెలు ఎలా వచ్చాయంటే.. మనోజ్ అనంతపురంలోని సాయినగర్ 8వ రోడ్డులో నివాసం ఉంటున్నాడు. ఇతని తండ్రి జి.సూర్యప్రకాష్ పోలీసు శాఖలో హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తూ మరణించాడు. కారుణ్య నియామకం కింద 2005లో మనోజ్‌కుమార్‌కు ట్రెజరీలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది. మనోజ్‌కుమార్‌కు బుక్కరాయసముద్రంలో వ్యవసాయ క్షేత్రం ఉండగా.. అందులో పనిచేసేందుకు స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన నాగలింగ వెళ్లేవాడు. అలా నమ్మకం ఏర్పడిన తర్వాత అతడినే మనోజ్ తన కారు డ్రైవర్‌గా నియమించుకున్నాడు. ఏడేళ్లుగా నాగలింగ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మనోజ్ ఆస్తులను నాగలింగ తన మామ బాలప్ప ఇంట్లో దాచిపెట్టాడు. నగదు...నగలు...వాహనాల స్వాధీనం మనోజ్ కారు డ్రైవర్‌గా పనిచేసే నాగలింగ మామ బాలప్ప ఇంట్లో ఎనిమిది ట్రంకు పెట్టెలను పరిశీలించగా అందులో 54 బంగారు ఆభరణాలు.. మొత్తం 2.42 కేజీల బంగారం, 280 వెండి సామగ్రితో పాటు మొత్తంగా 84.10 కేజీల వెండి, రూ.15,55,560 నగదు , రూ.49.10 లక్షల విలువైన 24 ఫిక్స్డ్ డిపాజిట్/ఎన్ఎస్ఎస్ బాండ్లు, రూ.27.05 లక్షల విలువైన 145 ప్రాంసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు మూడు పిస్తోళ్లు, 18 రౌండ్లు, ఒక ఎయిర్‌గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా బీకేఎస్‌లో ఉన్న మనోజ్ వ్యవసాయ క్షేత్రాన్ని పోలీసు బృందాలు పరిశీలించగా.. అక్కడ రెండు మహీంద్ర ఎక్స్‌యూవీ టాప్ మోడల్ కార్లు, ఒక హార్డీ డేవిడ్ సన్ మోటర్ వాహనం, మూడు ఎన్ఫీల్డ్ ద్విచక్ర వాహనాలు, రెండు కరీజ్మా ద్విచక్ర వాహనాలు, ఒక హోండా యాక్టివా, నాలుగు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న డమ్మీ పిస్తోళ్లు.. అవన్నీ డమ్మీ పిస్తోళ్లే పోలీసుల సోదాల్లో మూడు పిస్తోళ్లు, ఒక ఎయిర్‌గన్ స్వాధీనం చేసుకున్నామని, అవన్నీ డమ్మీవేనని ఓఎస్డీ వెల్లడించారు. పిస్తోళ్లతో పాటు 16 రౌండ్లను స్వాధీనం చేసుకున్నారు. కాల్చినప్పుడు వాటి నుంచి ఫైర్, సౌండ్ మాత్రమే వస్తాయనీ, వీటితో షూట్ చేసినా ఎవరికీ ప్రాణహాని ఉండదని తెలిపారు. కేసు నమోదు భారీ మొత్తంలో ఆభరణాలు, వెండి వస్తువులు, నగదు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ప్రామిసరీ నోట్లు కలిగి ఉండడంతో మనోజ్కుమార్పై సీఆర్ నం 213/2020,యు/ఎస్ 102 సీఆర్పీసీ కింద కేసు నమోదు చేశామని ఓఎస్డీ వివరించారు. కేసు చేధింపులో కీలకంగా వ్యవహరించిన పోలీసులకు ఎస్పీ బి.సత్యయేసు బాబు అభినందించి రివార్డులు ప్రకటించారన్నారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీలు వీరరాఘవరెడ్డి, ఈ.శ్రీనివాసులు, ఏ.శ్రీనివాసులు, ట్రైనీ డీఎస్పీ చైతన్య, సీఐలు సాయిప్రసాద్, శ్యాంరావు, ఎస్ఐ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డీజీపీ దృష్టికి మనోజ్ వ్యవహారం చిరు ఉద్యోగి మనోజ్ భారీగా నగదు, నగలు దాచుకోవడం...పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్న అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను ఎస్పీ సత్యయేసుబాబు డీజీపీ గౌతం సవాంగ్‌కు నివేదిక సమర్పించారు. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ కొనసాగనున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక మనోజ్ అక్రమాస్తులపై ఏసీబీ కూడా దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ముందే చెప్పిన ‘సాక్షి’ జిల్లా ఖజానా కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోందనీ, ముడుపులిస్తే కానీ ఫైళ్లు ముందుకు కదలవని ‘సాక్షి’ ఈ ఏడాది మే 21న ‘ముడుపుల ఖజానా’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. అవినీతి తతంగంలో తెర వెనుక ఇద్దరు ఉద్యోగులున్నారని, అందులో సీనియర్ అకౌంటెంట్ మనోజ్ కీలకపాత్ర పోషించినట్లు పేర్కొంది. ఉద్యోగులకు డీఏ, అరియర్స్ విషయంలోనూ సదరు సీనియర్ అకౌంటెంట్ భారీ స్థాయిలో దందాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయని, వీటితో పాటు కార్యాలయంలో ఎవరికైనా మెమో, షోకాజ్ తదితర నోటీసులిస్తే సమాధానం అతనే రాసి వారితో సొమ్ము చేసుకుంటున్నారని మే నెలలో ప్రచురించిన కథనంలో ‘సాక్షి’ పేర్కొంది. ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం.. -
అవినీతి ‘ఖజానా’ ఆస్తి రూ.3 కోట్ల పైనే
అనంతపురం క్రైం: అనంతపురంలోని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్ గాజుల మనోజ్‌కుమార్ అవినీతి అనకొండగా మారి కూడబెట్టిన ఆస్తి విలువ రూ.3 కోట్లపైనే ఉంటుందని అంచనా వేశారు. ఆస్తిని తన నమ్మిన బంటు అయిన కారు డ్రైవర్ నాగలింగ మామ బాలప్ప ఇంట్లో 8 టంక్రు పెట్టెల్లో దాచిపెట్టాడు. పోలీసుల తనిఖీల్లో 2.42 కేజీల బంగారం, 84.10 కేజీల వెండి, రూ.15,55,560 నగదు, రూ.49.10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు/బాండ్లు, రూ.27.05 లక్షల విలువ గల ప్రామిసరీ నోట్లు లభ్యమయ్యాయి. వీటితో పాటు ఒక ఎయిర్ పిస్తోలు, మరో మూడు 9 ఎంఎం డమ్మీ పిస్తోళ్లు, 18 రౌండ్ల బుల్లెట్లు కూడా ఉన్నాయి. ఈ వివరాలను డీపీవో కార్యాలయ ఆవరణలో పోలీస్ శాఖ ఓఎస్డీ రామకృష్ణ ప్రసాద్ బుధవారం విలేకరులకు తెలియజేశారు. సొత్తును స్వాధీనం చేసుకుని.. మనోజ్కుమార్పై కేసు నమోదు చేసి డీజీపీకి నివేదించామని చెప్పారు. కేసును ఏసీబీకి అప్పగిస్తామన్నారు. అవినీతి డొంక కదిలిందిలా.. ► మనోజ్‌కుమార్ వద్ద మారణాయుధాలు ఉన్నట్టు పోలీసులకు ఫిర్యాదు అందగా.. ఎస్పీ బి.సత్యయేసుబాబు ఈ నెల 18న డీఎస్పీలు వీరరాఘవరెడ్డి, ఇ.శ్రీనివాసులు, ఎ.శ్రీనివాసులు, ట్రైనీ డీఎస్పీ చైతన్య, బుక్కరాయసముద్రం సీఐ సాయిప్రసాద్, ఎస్ఐ ప్రసాద్, సీసీఎస్ సీఐ శ్యామ్‌రావు రంగంలోకి దిగారు. ► మనోజ్‌కుమార్ డ్రైవర్ నాగలింగ, అతడి మామ బాలప్ప ఇళ్లల్లో తనిఖీ చేయగా.. బాలప్ప ఇంట్లో 8 టంక్రు పెట్టెలు కనిపించాయి. ► వాటిని తెరిచి చూడగా రూ.3 కోట్లకు పైగా విలువ చేసే బంగారం, భారీగా వెండి, నగదు, 4 డమ్మీ పిస్తోళ్లు, 18 రౌండ్ల బుల్లెట్లు లభించాయి. స్వాధీనం చేసుకున్న సొత్తును పరిశీలిస్తున్న పోలీసులు విలాసవంతమైన జీవితం ► మనోజ్‌కుమార్ బెంగళూరు వెళ్లేందుకు ఖరీదైన హార్లీ డేవిడ్సన్ బైక్ వాడేవాడని.. దీని ధర రూ.13 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుందని అంచనా. ► రూ.7 లక్షల విలువైన మూడు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌లు, రెండు కరిజ్మా బైక్స్, రెండు మహీంద్ర ఎక్స్‌యూవీ కార్లు కొనుగోలు చేసినట్టు వెల్లడైంది. ఇవికాకుండా హోండా యాక్టివా, తాను పెంచుతున్న గుర్రాల కోసం లీజుకు తీసుకున్న వ్యవసాయ క్షేత్రంలో పనుల కోసం నాలుగు ట్రాక్టర్లు కూడా కొనుగోలు చేశాడు. -
ఖజానా ఖాళీ.. దహన సంస్కారాలకూ డబ్బుల్లేవ్!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్ర ఖజానా నిండుకుంది. ఉద్యోగులు తమ జీతంలో నుంచి ప్రతినెలా దాచుకునే ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)తో పాటు ఎవరైనా చనిపోతే దహన సంస్కారాల కోసం ఇచ్చే డబ్బులకూ చిక్కులు వచ్చిపడ్డాయి. ఈ నెల 6వ తేదీ నుంచి బిల్లుల మంజూరుకు ఆర్థిక శాఖ బ్రేకులు వేసింది. ఒక్కపైసా కూడా చెల్లించవద్దంటూ రాష్ట్రంలోని అన్ని ట్రెజరీలకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఫలితంగా నిధులు విడుదల కావడం లేదు. రాష్ట్ర ఖజానా ఖాళీ కావడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఉద్యోగుల పీఎఫ్‌తో పాటు వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ట్రెజరీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ట్రెజరీ నుంచి కూడా బిల్లులను బ్యాంకులకు పంపుతున్నారు. బిల్లు మంజూరు కోసం ఖజానా నుంచి విత్‌డ్రా చేసేందుకు క్లిక్ చేస్తే.... ఓవర్ డ్రాఫ్టు (ఓడీ) అని చూపిస్తోంది. అంటే ఖజానాలో పైసా కూడా నిధులు లేవన్నమాట. ఒకవేళ బిల్లులు మంజూరు చేయాలంటే ఆర్థిక పరిమితికి మించి అప్పు తీసుకోవాల్సి రానుంది. ఇందుకు రిజర్వ్‌బ్యాంకు (ఆర్బీఐ) అనుమతించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఖజానాకు వివిధ మార్గాల్లో అంటే ఎక్సైజ్, పన్నులు, రవాణా రంగాల నుంచి ఆదాయం జమ అయితేనే బిల్లుల చెల్లింపు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక ఆంక్షల వల్ల కేవలం కర్నూలు జిల్లాలోనే రూ.100 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ మొత్తం రూ.2,500 కోట్ల మేరకు ఉంటుందని ట్రెజరీ వర్గాలు పేర్కొంటున్నాయి. దహన సంస్కారాలకూ డబ్బుల్లేవ్ కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బినిగెర ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా పనిచేసే కవిత ఈ ఏడాది అక్టోబరు 21వతేదీన మరణించారు. కుటుంబ సభ్యులు ఆమె దహన సంస్కార ఖర్చుల కోసం మరణ ధ్రువీకరణ పత్రాన్ని జత చేసి డిసెంబరు 5వ తేదీన అందచేసినా ఇప్పటివరకు మంజూరు కాలేదు. అదేమంటే ఆంక్షలు విధించారంటూ ట్రెజరీ అధికారులు పేర్కొంటున్నారు. ఇదే కాదు.. వివాహాలు, ఇతర అత్యవసరాల కోసం దరఖాస్తు చేసుకున్న పలువురు ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) డబ్బులు మంజూరు కాకపోవడంతో అవస్థలు ఎదుర్కొంటున్నారు. నీరు–చెట్టుకు నేరుగా నిధులు వాస్తవానికి అన్ని బిల్లులు ఆన్లైన్లోనే మంజూరు చేసేందుకు అనుగుణంగా సమగ్ర ఆర్థిక నిర్వహణ విధానం (కాంప్రహెన్షివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం–సీఎఫ్ఎంఎస్)ను ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. బిల్లులను క్రమపద్ధతిలో ఎటువంటి విచక్షణ లేకుండా ఆన్లైన్లో మంజూరు చేసేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇందుకు విరుద్ధంగా నీరు–చెట్టు బిల్లులను సీఎఫ్ఎంఎస్ విధానంలో కాకుండా ప్రభుత్వం నేరుగా విడుదల చేసింది. ఇప్పుడు కూడా బడా కాంట్రాక్టర్లకు అలాగే బిల్లులు నేరుగా చెల్లిస్తున్నారని పేర్కొంటున్నారు. -
విశాఖ సీతమ్మధార ట్రెజరీలో భారీ స్కామ్
-
కుప్పకూలిన కొత్తపేట ట్రెజరీ కార్యాలయం
-
ఫ్రీజింగ్.. ఫ్రీజింగ్..!
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): ఫ్రీజింగ్... ఫ్రీజింగ్.. ప్రస్తుతం జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఇదే మారుమోగుతోంది. రాష్ట్ర ఆర్థిక శాఖ ఏ రోజు ఏ బిల్లుకు ఫ్రీజింగ్ విధిస్తుందో తెలియడం లేదని సంబంధిత అధికారులు, ఉద్యోగులు పేర్కొన్నారు. లోటు బడ్జెట్ కారణంగా 22 రోజులుగా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల బిల్లులు తప్ప.. మిగతా ఏ బిల్లులు కూడా పాస్ కావ డం లేదు. చివరికి అత్యవసరమైన ఎలక్ట్రిసిటీ, టెలిఫోన్,కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, మెడికల్ రీయింబర్స్మెం ట్ బిల్లులుకు సైతం ఫ్రీజింగ్ కారణంగా మోక్షం కలగడం లేదు. వాహనాలు, భవనాల అద్దె, విద్యార్థుల ఉపకా ర వేతనాలు, కాస్మొటిక్, డైట్ చార్జీలు, మెటీరియల్ సప్లయి బిల్లులదీ అదే పరిస్థితి. దీంతో బాధిత ఉద్యోగులు ట్రెజరీ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల బిల్లులు కూడా నిలిచిపోయాయి. సంక్రాంతి పండగ వేళ వేతనాలు అందక క్షోభకు గురవుతున్నారు. తమకెందు కు వేతనాలు మంజూరు కావడం లేదని ట్రెజ రీ కార్యాలయానికి వెళితే ప్రభుత్వం ఫ్రీజింగ్ విధించిందని, తమ చేతిలో ఏమీలేదని ట్రెజరీ అధికారులు, ఉద్యోగులు చెప్తున్నారు. గ్రీన్ చానల్ కిందికి తెచ్చిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ బిల్లులను కూడా నిలిపేయడంతో లబ్ధిదారులకు డబ్బులు అందని పరిస్థితి నెలకొంది. దీంతో వారు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. తరచూ నిలిపివేత.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లోటు కారణంగా ట్రెజరీల్లో బిల్లులు పాస్ చేయకుండా తరచూ ఫ్రీజింగ్ విధిస్తూ వస్తోంది. 2016 అక్టోబర్‌లో ఫ్రీజింగ్‌ను ప్రారంభించిన సర్కారు మధ్యమధ్యలో ఒకటి రెండురోజులు మాత్రమే ఎత్తివేసి మరుసటి రోజు మళ్లీ ఫ్రీజింగ్‌ను విధిస్తోంది. రెండు సంవత్సరాల కాలంలో నాలుగైదు రకాల బిల్లులకు తప్ప మిగతా వాటికి ఫ్రీజింగ్‌ను కొనసాగిస్తూ వస్తోంది. ప్రస్తుతం మళ్లీ 2017 డిసెంబర్ 20న ఫ్రీజింగ్ విధించిన ఆర్థిక శాఖ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల బిల్లులను మినహాయించి మిగతా వాటికి ఫ్రీజింగ్ విధించడంపై ఆయా శాఖల ఉద్యోగులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అదే విధంగా ప్రభుత్వం ఏ రోజు ఏ బిల్లుకు ఫ్రీజింగ్ విధిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ట్రెజరీ ఉద్యోగులకు కూడా ఇబ్బందిగా మారింది. అప్పుడప్పుడు ఒక రోజు మాత్రమే మరికొన్ని బిల్లులకు అనుమతి ఇవ్వడంతో అందరి బిల్లులు పాస్ చేయడం ఉద్యోగులకు కష్టంగా మారింది. అన్ని బిల్లులు పాస్ కావడం లేదు... కొన్ని రోజులుగా ప్రభుత్వం నాలుగైదు మినహా అన్ని బిల్లులపై ఫ్రీజింగ్ విధిస్తూ వస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల బిల్లులకు మాత్రమే అనుమతి ఉంది. మిగతా బిల్లులు పాస్ కావడం లేదు. ఆర్థిక శాఖ ఫ్రీజింగ్ ఎత్తివేస్తే అత్యవసర బిల్లులను పాస్ చేయవచ్చు. – పి.రామ్మోహన్ నాయుడు, డీడీ, ట్రెజరీ శాఖ -
డ్యూటీ రూరల్.. దందా అర్బన్
హన్మకొండ అర్బన్: ట్రెజరీ కార్యాలయంలో వెలుగు చూసిన రూ.22 లక్షల కుంభకోణంలో అర్బన్ జిల్లా ట్రెñజరీ అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. మూడు రోజులుగా విచారణ చేసిన అధికారులు కొన్ని వివరాలు రాబట్టగలిగారు. ప్రాథమిక సమాచారం ఆధారంగా ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన రూరల్ ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్ ఉమామహేశ్వర్‌ను ఇప్పటికే సస్పెండ్ చేయడంతోపాటు మొత్తం ముగ్గురిపై కేసు పెట్టారు. అయితే ఉమామహేశ్వర్ రూరల్ ట్రెజరీలో పనిచేసే ఉద్యోగి. అయితే ఆయన చేసిన దందా మొత్తం అర్బన్ జిల్లా పరిధిలోనిది కావడం విశేషం. నిందితులు పరారీలో ఉన్నారు. 18వేల మంది పెన్షనర్లు జిల్లాల విభజనతో వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోకి సుమారు 18వేల మంది పెన్షనర్లు వచ్చారు. రూరల్‌లో 2 వేల మంది మాత్రమే ఉన్నారు. ఈ క్రమంలో ఎక్కువ మంది పెన్షనర్లు ఉన్న కారణంగా అర్బన్ జిల్లాను తమ అక్రమాలకు నిలయంగా మార్చుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. బేడీసిం vs ఎవరు బేడీసింగ్ ఎవరనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఇంతకాలం ఎక్కడా ఈ పేరు ట్రెజరీ వ్యవహారాల్లో అధికారులు కూడా వినలేదని చెబుతున్నారు. అయితే నగరంలో పెన్షనర్లు, ఉద్యోగులకు వారి బ్యాంకు పాస్ పుస్తకాలు, ఏటీఎం కార్డులు, పెన్షనర్ల పెన్షన్ కాగితాలు తాకట్టు పెట్టుకుని ఎక్కువ వడ్డీలకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చే వడ్డీ వ్యాపారిగా అధికారులు గుర్తించారు. విచారణ నిమిత్తం రావాలని పిలిస్తే మొదట వస్తానని చెప్పినప్పటికీ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంచాడని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కేసులో ఏ3గా ఉన్న బేడీసింగ్ను విచారిస్తే మరిన్ని వాస్తవాలు తెలిసే అవకాశం ఉందని ట్రెజరీ అధికారులు భావిస్తున్నారు. అయినా మారలేదు... ఉమామహేశ్వర్ 2005లో ట్రెజరీలో ఉద్యోగంలో చేరాడు. 2012లో ములుగు ఎస్టీఓలోç ³పనిచేస్తున్న సమయంలో రూ.38 లక్షల కుంభకోణం వ్యవహారంలో సభ్యుడిగా ఉన్నాడు. ఆ సమయంలో అధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలో డీటీఓలో పోస్టింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ములుగు కేసు విచారణ కొనసాగుతోంది. ఎవరీ మూర్తి సూర్యనారాయణ మూర్తి(ఎస్‌ఎన్‌మూర్తి) 2009 నుంచి ఉమ్మడి జిల్లా కేంద్రంలోని డీటీఓలో డాటా ప్రోగ్రామింగ్ అధికారికగా(డీపీఓ) పనిచేశారు. మూర్తి మాతృ సంస్థ టెలంగాణ టెక్నాలజీస్ లిమిటెడ్. దాని నుంచి ట్రెజరీస్‌కు అవసరాల నిమిత్తం డిప్యూటేషన్‌పై తీసుకున్నారు. సుమారు రెండేళ్ల క్రితం మూర్తిని మాతృ సంస్థకు పంపించారు. అయితే ట్రెజరీకి సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం విషయంలో మూర్తి నిష్ణాతుడని పేరుంది. అయితే జిల్లాలో పనిచేసిన సమయంలో ఇక్కడి ఉద్యోగులతో ఉన్న సంబంధాలు మూర్తి కొనసాగిస్తుండేవారు. ఈ క్రమంలో ఉమా మహేశ్వర్‌తో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. దీంతో అవసరం మేరకు యూజర్ ఐడీ, పాస్వర్డ్స్ ఉమామహేశ్వర్‌కు అందజేస్తుండేవాడని ట్రెజరీ అధికారుల విచారణలో తెలిసిందని సమాచారం. అయితే ఒక బాధితురాలు అర్బన్ డీటీఓలో అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో అనుమానం వచ్చిన అర్బన్ ట్రెజరీ అధికారులు మెల్లగా కూపీ లాగారు దీంతో తీగలాగితే డొంక కదిలింది. ఈ దందా సుమారు రెండేళ్లుగా సాగుతున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిసింది. -
ఖజానాకు తాళం
►లావాదేవీలన్నీ ఫ్రీజ్ ►నిధులన్నీ ఉప ఎన్నిక ప్రాంతాల్లోనే ఖర్చు ►ట్రెజరీల్లో పేరుకు పోయిన రూ.కోట్ల బిల్లులు ►నిలిచిన రోజువారీ పనులు ►ఆర్థిక శాఖ అనుమతుల కోసం అధికారుల ఎదురుచూపులు ►సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు ‘‘మీ చెక్కు చెల్లలేదు...డబ్బులిస్తేనే డీజిల్ వేస్తాం’’ - టోకెన్ తీసుకుని డీజిల్ కోసం వెళ్లిన ధర్మవరం మున్సిపాలిటీ కార్మికులకు పెట్రోలు బంకు యజమాని చెప్పిన మాటలివి. ‘‘వారం రోజులు టైమివ్వండి ...తొందర్లోనే బిల్లులు చెల్లిస్తాం...’’ - ట్రాన్స్‌కో అధికారితో ఓ మున్సిపాలిటీ ఉన్నతాధికారి విన్నపం ‘‘ట్రాక్టర్ రిపేరీ వచ్చి వారం రోజులైంది...అడిగితే డబ్బుల్లేవంటున్నారు...నేనేం చేసేది..మీ ఇంటిముందు చెత్తఉంటే తీసుకుపోయి...మున్సిపాలిటీ ముందు వేయండి’’ - ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ఓ కార్మికుడి విసుగు ప్రస్తుతం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో నెలకొన్న పరిస్థితి ఇది. చిన్నా చితకా పనులకు కూడా ట్రెజరీల్లో బిల్లులు పాస్ చేయకపోవడంతో మున్సిపాలిటీ అధికారులంతా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కోట్లాది రూపాయల బిల్లులు ట్రెజరీల్లో పెండింగ్‌లో ఉండిపోగా...పనులు జరగక ఇటు అధికారులు, సమస్యలు పరిష్కారం కాక అటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధర్మవరం: ఆవులను కొట్టి చెప్పులు దానం చేసిన చందంగా ఉంది టీడీపీ సర్కార్ తీరు. చిన్నా చితకా కార్మికుల పొట్టకొట్టి తమకు అవసరమైన చోట నిధుల వరద పారించడం తెలుగుదేశం ప్రభుత్వానికి అలవాటుగా మారింది. నంద్యాల, కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో విచ్చలవిడిగా నిధులు ఖర్చు చేసేందుకుగాను ఇతర ప్రాంతాల్లో అత్యవసర వాటికి కూడా నిధులు విడుదల చేయకుండా లావాదేవీలను ఫ్రీజ్ చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా కోట్లాది రూపాయల బిల్లులు ట్రెజరీల్లోనే పెండింగ్‌లో ఉండిపోయాయి. కనీసం చెత్త తరలించే ట్రాక్టర్లకు కూడా డీజిల్ పోయించడం ఇబ్బందిగా మారడంతో పట్టణాల్లో చెత్త తరలింపులో జాప్యం జరుగుతోంది. మరోవైపు మున్సిపాలిటీల్లో కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు చెల్లించలేకపోవడంతో పనులు సాగడం లేదు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న ప్రస్తుత తరుణంలో కనీసం ఫాగింగ్ చేసేందుకు కూడా చేతిలో చిల్లిగవ్వ లేక మున్సిపాలిటీల సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆగస్టు నుంచి ఆగిన చెల్లింపులు జిల్లాలోని 18 ట్రెజరీలుండగా... వీటి పరిధిలో 135 మంది డ్రాయింగ్ ఆఫీసర్లు (ఆయా శాఖలు/ విభాగాల పరిధిలో నగదు లావాదేవీలు నిర్వహించే) ఉంటారు. మున్సిపాలిటీ, పంచాయతీ, తదితర సంస్థల్లో వివిధ రకాల వేతనాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు వీరు చెల్లిస్తుంటారు. అయితే వీరు పంపిన దాదాపు రూ.50 నుంచి రూ.70 కోట్ల దాకా బిల్లులను ఆర్థిక శాఖ ఫ్రీజ్ చేసింది. ఆగస్టు–09 నుంచి నేటి వరకు వారికి అందాల్సిన అన్ని చెల్లింపులు మొత్తం ఆగిపోయాయి. నంద్యాల, కాకినాడ ఎన్నికల నేపథ్యంలో అక్కడ విచ్చలవిడిగా నిధులు ఖర్చుపెట్టిన సర్కార్ ... రాష్ర్టంలోని మిగతా ఎక్కడా చెల్లింపులు చేయకుండా నిలిపివేసినట్లు తెలుస్తోంది. చిల్లిగవ్వలేక చిక్కులు బిల్లుల చెల్లింపులు ఫ్రీజ్ చేసిన నేపథ్యంలో మున్సిపాలిటీ అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో అనంతపురం నగరపాలక సంస్థతోపాటు, 11 మున్సిపాలిటీలు ఉన్నాయి. బిల్లులు ఫ్రీజ్ చేయడంతో చిన్న అవసరానికీ చిక్కులు తప్పడం లేదు. ముఖ్యంగా డీజిల్ ఖర్చులు, కార్మికుల వేతనాలు చెల్లించేందుకు కూడా డబ్బు లేకపోవడంతో సమాధానం చెప్పుకోలేక అధికారులు సతమతమవుతున్నారు. చెత్త ట్రాక్టర్లు, ఆటోలు, ఇతరత్రా వాహనాలకు సంబంధించిన డీజిల్ బిల్లులు వారానికో.. పదిరోజులకో ఆయా పెట్రోల్ బంకుల యజమానులకు చెల్లిస్తుంటారు. అయితే నెలరోజులుగా చెల్లింపులు లేక పోవడంతో సేవలు సక్రమంగా అందడంలేదు. ఇక కాంట్రాక్ట్ కార్మికులకు అందిచాల్సిన వేతనాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. విద్యుత్ బిల్లులు చెల్లింపులు, పలు అభివృద్ధి పనులకు చెల్లించాల్సిన బిల్లులు అన్ని పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇలా మున్సిపాలిటీలకు సంబంధించిన బిల్లులు దాదాపు రూ. 20 నుంచి 30 కోట్ల రూపాయల బిల్లులు ట్రెజరీలో ఫ్రీజ్ అయ్యాయి. ఆర్థిక శాఖ అనుమతులు ఎప్పుడు ఇస్తుందో.. ఎప్పుడు బిల్లులు వస్తాయో అని స్థానిక సంస్థలు కళ్లుకాయలు కాచేలా ఎదురు చూస్తున్నాయి. -
అవినీతి ఖజానా...
ప్రతీ పనికి ఒక్కో రేటు పెన్షనర్లనూ వదలని జలగలు ఇదీ కలెక్టరేట్లోని సబ్‌ట్రెజరీ కార్యాలయంలో పరిస్థితి హన్మకొండ అర్బన్ : కలెక్టరేట్లోని డీపీవో కార్యాలయంలో ఏసీబీ దాడులు జరిగి నెల కూడా దాట లేదు. అరుుతే, ఈ కార్యాలయం పక్కనే ఉండే సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఉద్యోగులు తమ అక్రమ వసూళ్లను ఆపలేదనే ఫిర్యాదులు వస్తూనే ఉన్నారుు. ప్రతీ పనికో రేటు నిర్ణరుుంచిన ఉద్యోగులు కార్యాలయూనికి వచ్చే వారిని పీడిస్తుండగా... ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నారుు. వీరి అవినీతి బాగోతానికి సంఘం నేతలు గా చెలామణి అవుతున్న కొందరు సహకరిస్తుండడం గమనార్హం. చావు పైసలకు బేరం ప్రభుత్వ పెన్షనర్ మరణిస్తే తక్షణ అవసరాల కింద ఆ పెన్షనర్ తీసుకునే పింఛన్ మొత్తాన్ని అందజేస్తారు. అరుుతే, ఈ డబ్బు ఇచ్చే విషయంలోనూ సబ్‌ట్రెజరీ ఉద్యోగులు కక్కుర్తి ప్రదర్శస్తున్నారు. తమకు అనుకూలంగా ఉండే రిటైర్డ్ ఉద్యోగ సంఘాల నేతలను ముందు ఉం చి వ్యవహారం నడిపిస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నారుు. కార్యాలయంలో కూడా కొందరు సంఘం నేతల హవా సాగుతుండడం, వీరికి అధికారుల సహకారం ఉండడంతో దందాకు అంతు లేకుండా పోరుుందని తెలుస్తోంది. తండ్రి చనిపోయాడని వస్తే.... వరంగల్‌లోని ఎల్బీ కళాశాలలో పనిచేసి రిటైర్ అయిన గురువయ్య పింఛన్ పొందుతూ ఇటీవల మృతి చెందారు. దీంతో ఆయనకు వచ్చే పింఛన్‌ను తల్లి పేరిట మార్చాలని కోరుతూ హన్మకొండ మండలం భట్టుపల్లికి చెందని కుమార్ కలెక్టరేట్లోని ఏటీవో దుర్గాప్రసాద్‌ను కలిశారు. ఈ విషయమై మరో అధికారిని కలవాలని దుర్గాప్రసాద్ సూచించారు. దీంతో కుమార్ వెళ్లి తన పనిని వివరించగా.. ఫైల్ మొత్తం పరిశీలించిన సదరు ఉద్యోగులు కొన్ని కాగితాలు సరిగ్గా లేవు, మరికొన్ని కావాలంటూ తిప్పి పంపించారు. ఆ తర్వాత ఆయూ పత్రాలతో వెళ్లినా ఏదో కారణం చెబుతూ విసుగెత్తించారు. చివరకు అసలు సంగతేంటని విచారిస్తే రూ.3వేలు ఇస్తే ఒక్క రోజులో పని అరుుపోతుందని సెలవిచ్చారు! అరుుతే, తన వద్ద అంత మొత్తం లేదని చెప్పుకొచ్చిన కుమార్ రూ.2వేలు ఇవ్వగా.. వెంటనే ఏ కాగితం అవసరం లేకుండా పని పూర్తరుుపోరుుంది. పట్టించుకోని అధికారులు కలెక్టరేట్లో ఉన్న సబ్ ట్రెజరీ కార్యాలయంలో అవినీతి వ్యవహారంపై పక్కనే ఉన్న జిల్లా ఖజానా అధికారులకు ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోవడం లేదని చెబుతున్నారు. గతంలో ఉన్నతాధికారులు వచ్చిన సమయంలో కొందరు ఎస్టీవోలో అవినీతిపై ఫిర్యాదు చేశారు. కాగా, శనివారం జిల్లాకు రానున్న ట్రెజరీ స్టేట్ డెరైక్టర్, ఇతర అధికారులకు సబ్ ట్రెజరీ ఉద్యోగుల వ్యవహారంపై ఫిర్యాదు చేసేందుకు పలువురు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ ఫిర్యాదుతోనైనా శాఖ ఉన్నతాధికారులు స్పంది స్తారా, కార్యాలయ ఉద్యోగులు మారతారా అన్నది వేచి చూడాల్సిందే. మధ్యవర్తి ఉంటేనే... కలెక్టరేట్లోని ఎస్టీవో కార్యాలయానికి ఏదైనా పని నిమిత్తం కొత్తవారు వస్తే నానా పాట్లు పడాల్సిందే. ఇక్కడ మధ్యవర్తులు లేనిదే పనికాదు. అరుుతే, వీరిని అధికారులే పెంచి పోషిస్తున్నారనే విమర్శలు ఉన్నారుు. ఇక నవంబర్ మాసం వచ్చిందంటే కార్యాలయ ఉద్యోగులకు పండగే. ఈ నెలలో పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉండడంతో అందిన కాడికి దండుకుంటారు. లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చన వారికి రశీదు ఇవ్వరు... అదేంటని అడిగితే రేపు, తర్వాత... అంటూ వాయిదాలు పెడుతుంటారు. తీరా చూస్తే మీ సర్టిఫికెట్ కనిపించడం లేదు. ఇంకొకటి తెచ్చి ఇవ్వాలని సూచిస్తారు. కలెక్టరేట్లో పనిచేసే ఒక మహిళా ఉద్యోగి ఫ్యామిలీ పెన్షన్ కోసం లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చినా సుమారు మూడు నెలలు పింఛన్ ఆపేశారు. ఇదేంటని అడిగితే మీరు సర్టిఫికెట్ ఇవ్వలేదని బదులివవ్వడమే కాకుండా.. నోటికి వచ్చినట్లు మాట్లాడారని ఆ ఉద్యోగి వాపోయూరు. -
కడప ట్రెజరీలో క్షుద్ర పూజలు
కడప సెవెన్‌రోడ్స్ : కడప కలెక్టరేట్ ఆవరణంలోని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో క్షుద్ర పూజలు నిర్వహించారన్న విషయం కలకలం సృష్టిటించింది. అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న నాగరాజు మంగళవారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు తన కార్యాలయానికి వచ్చారు. తన కుర్చీ వద్ద నిమ్మకాయలు, కుంకుమ, ఎండు మిరపకాయతో పూజలు నిర్వహించి ఉండటాన్ని గమనించి విషయాన్ని డిప్యూటీ డెరైక్టర్ రంగప్ప దృష్టికి తీసుకెళ్లారు. అసిస్టెంట్ ట్రెజరీ అధికారితో ఈ సంఘటనపై విచారణ చేయిస్తానని, స్టాఫ్ మీటింగ్ ఏర్పాటు చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తానని ఆయన చెప్పారు. అసిస్టెంట్ డెరైక్టర్ నాగరాజు మాట్లాడుతూ.. తానంటే గిట్టని సిబ్బంది ఎవరో క్షుద్ర పూజలు చేశారని ఆరోపించారు. పది రోజుల కిందట కూడ నల్ల జిలకర మంత్రించి తన కుర్చీ వద్ద చల్లారని తెలిపారు. బద్వేలు సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఓ ఉద్యోగి రూ.26 లక్షలు స్వాహా చేయడంపై తాను విచారణ నిర్వహించానని, విధులకు సక్రమంగా హాజరు కాని సిబ్బందిని మందలించాల్సి వచ్చేదన్నారు. వారంతా ఏకమై తనను భయపెట్టి బదిలీపై వెళ్లేలా చేసేందుకే ఇలా క్షుద్ర పూజలు నిర్వహించారని వివరించారు. కాగా, కార్యాలయ తాళాలు అసిస్టెంట్ డెరైక్టర్ వద్దే ఉంటాయని, ఆయనకు తెలియకుండా మరొకరు కార్యాలయంలోకి వచ్చి క్షుద్ర పూజలు ఎలా నిర్వహిస్తారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఆయన తన కుర్చీ వద్ద కాళీమాత ఫొటో ఉంచుకుని నిత్యం పూజలు నిర్వహిస్తుంటారని, ఉద్యోగులను దెబ్బతీయాలన్న దురుద్దేశంతో ఆయనే ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఉద్యోగులు పరస్పర ఫిర్యాదులు, విమర్శలు, ప్రతి విమర్శలు పాతపడిపోవడంతో క్షుద్ర పూజలతో బజారుకెక్కారు. -
కలెక్టరేట్లో మిస్‌ఫైర్.. కానిస్టేబుల్ మృతి
సంగారెడ్డి: సంగారెడ్డి కలెక్టరేట్లోని ట్రెజరీ కార్యాలయంలో తుపాకీ మిస్ ఫైర్ అయిన ఘటనలో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం ఉదయం 5.55 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. సంగారెడ్డి రూరల్ సీఐ శ్యామల వెంకటేశం కథనం మేరకు.. కడప జిల్లా పులివెందుల వాసి అయిన ఎస్ రమేష్ కుమార్‌రెడ్డి (46) ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఉద్యోగ రీత్యా సంగారెడ్డి పట్టణంలోని రాజంపేటలో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్లోని ట్రెజరీ కార్యాలయంలో విధులు నిర్వర్తించాడు. శనివారం ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో తుపాకీని మారుస్తుండగా మిస్ ఫైర్ అయింది. దీంతో బుల్లెట్ రమేష్‌కుమార్‌రెడ్డి గుండెల్లోకి దూసుకెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు 1991 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్. ఘటనా స్థలాన్ని ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ సందర్శించారు. మిస్ ఫైరా? లేక ఆత్మహత్యా? కానిస్టేబుల్ రమేష్ కుమార్‌రెడ్డి మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. మిస్ ఫైరా? లేక ఆత్మహత్యనా? అని పోలీసులు అనుమానిస్తున్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
ఏసీబీ వలలో ఖజానా కార్యాలయం ఉద్యోగి
గుంటూరు సిటీ, న్యూస్‌లైన్, జిల్లా ఖజానా కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్ డి.రవికిరణ్‌ను శుక్రవారం ఏసీబీ అధికారులు పథకం ప్రకారం వల పన్ని పట్టుకున్నారు. గుంటూరు ఏసీబీ డిఎస్పీ రాజారావు వెల్లడించిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న దాసరి బాలకృష్ణ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ఎరన్డ్ లీవ్ రూ. 4 లక్షల50 వేలు మంజూరు కావాల్సివుంది. జిల్లా ఖజానా కార్యాలయంలో ఏప్రిల్ 9వ తేదీ బిల్లు సమర్పించాడు. బిల్లు మంజూరు నిమిత్తం సీనియర్ అకౌంటెంట్ రవికిరణ్ లక్షకు వెయ్యి రూపాయల వంతున రూ.4,500 లంచం డిమాండ్చేశాడు. పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగి వేసారి న బాలకృష్ణ తనకు బిల్లు మంజూరై బ్యాంకు ఖాతాలో డబ్బులు జమకాగానే ఇచ్చేట్లుగా రవికిరణ్‌తో ఏప్రిల్ 18న ఒప్పం దం చేసుకున్నాడు. గత నెల 22వ తేదీ బాలకృష్ణ ఖాతాలో రూ. 4 లక్షల 50 వేలు జమయింది. దీంతో తనకు లంచం కింద రూ. 4,500 ఇవ్వాలని రవికిరణ్ ప్రతీ రోజూ బాలకృష్ణకు ఫోన్ చేసి విసిగిస్తున్నాడు. అనుకున్న ప్రకారం డబ్బులివ్వకపోతే తదుపరి వచ్చే బెనిఫిట్లను నిలుపుదల చేస్తానని హెచ్చరించడం తో బాలకృష్ణ గుంటూరు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల వ్యూహం మేరకు శుక్రవారం బాలకృష్ణ ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్ రవికిరణ్‌కు మూడు వేల రూపాయలు ఇచ్చాడు. అక్కడే కాపుకాసిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న రవి కిరణ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నింది తుడు రవికిరణ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఏసీబీ డీఎ స్పీ రాజారావు తెలిపారు. దాడిలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు ఎం.నరసింహారెడ్డి, కె.సీతారామ్ తదితరులు పాల్గొన్నారు. -
అవినీతి ఖజానా
నెల్లిమర్ల, నెల్లిమర్ల రూరల్, న్యూస్‌లైన్: అవినీతి నిరోధక శాఖ వలకు ఖజానా సిబ్బంది చిక్కారు. నెల్లిమర్ల మండల కేం ద్రంలో ఉప ఖజానాధికారిగా పనిచేస్తున్న పద్మిణీ ఆచారిణి, అదే కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న శంకర పోలినాయుడులు రూ.3,500 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఒకేసారి ఒక అధికారి మరో ఉద్యోగి ఏసీబీకి చిక్కడంతో మండలానికి చెందిన అధికారులు, ఉద్యోగులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏసీబీ డీఎస్పీ సి.హెచ్. లక్ష్మీపతి అందించిన వివరాల ప్రకారం..నెల్లిమర్లకు చెందిన 5వ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ దాడిశెట్టి రాంబాబు 2002లో మృతిచెందారు. ఇతని భార్య అన్నపూర్ణ కూడా అంతకు ముందు రెండేళ్ల క్రితమే మరణించడంతో వీరి కుమారులకు పింఛను మంజూరైంది. దీనికి సంబంధించిన ఎరియర్స్ సుమారు రూ.90 వేలు వచ్చాయి. ఈ మొత్తాన్ని అందజేసేందుకు ఎస్టీఓ రూ.3500 లంచం డిమాండ్ చేశారు. దీంతో డెంకాడ పోలీస్‌స్టేషన్‌లో హెచ్‌సీగా పనిచేస్తున్న రాంబాబు తమ్ముడు డి. శంకరరావు ఏసీబీని ఆశ్రయించారు. పథకం ప్రకారం ఏసీబీ అధికారులు అందజేసిన నగదును శుక్రవారం మధ్యాహ్నం ఎస్టీఓకు మూడు వేల రూపాయలు, సీనియర్ అసిస్టెంట్‌కు రూ.అయిదు వందలు శంకరరావు ఇచ్చారు. దీంతో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దాడుల్లో ఏసీబీ సీఐలు డి.రమేష్, ఎస్.లక్ష్మోజీ, గౌస్ఆజాద్ సిబ్బంది పాల్గొన్నారు. ఫిర్యాదు దారు వివరాల ప్రకారం.. చింతలవలస లోని 5వ ఏపీఎస్పీ బెటాలియన్ లో కానిస్టేబుల్‌గా పనిచేసిన దాడిశెట్టి రాంబాబు, భార్య అన్నపూర్ణ మృతి చెందడంతో వారి కుమారులు తులసీరావు, దామోదరావు పెదనాన్న అప్పలరాజు సంరక్షణలో ఉన్నారు. 2005లో అప్పలరాజు కూడా మృతి చెందడంతో ప్రస్తుతం పెద్దమ్మ వద్ద ఉంటున్నారు. ఈనేపథ్యంలో పింఛనుకు సంబంధించి ఎరియర్స్ వచ్చాయని నెల్లిమర్ల మండల కేంద్రంలోని ఉప ఖజానా కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న శంక ర పోలినాయుడు రెండు నెలల క్రితం రాంబాబు కుటుంబీకులకు సమాచారం అం దించారు. ఎరియర్స్‌కు సంబంధించిన బిల్లును మంజూరు చేసేందుకు గాను డెంకాడ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దివంగత రాంబాబు సోదరుడు దాడిశెట్టి శంకరరావు పోలినాయుడును సంప్రదించారు. అయితే బిల్లు వ్యవహారమంతా జిల్లా కేంద్రంలోని ఖజానా కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న యుగంధర్ చూస్తున్నారని పోలినాయుడు శంకరరావుకు చెప్పారు. బిల్లు మం జూరు చేయాలంటే ఎరియర్స్ మొత్తంలో సగం తమకు అందజేయాలని డిమాండ్ చేశారు. దీనికి ఎరియర్స్‌గా మంజూరైన రూ.90వేలలో రూ.25 వేలు ఇచ్చేందుకు శంకరరావు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో నెల్లిమర్ల ఎస్టీఓ పద్మిని ఆచారిణిని శంకరరావు కలిసి బిల్లు మంజూరు చేయాలని కోరారు. అయితే బిల్లు మంజూరు చేసేందుకు తనకు రూ.3500 లంచంగా ఇవ్వాలని ఎస్టీఓ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంతో విసిగి పోయిన శంకరరావు ఏసీబీని ఆశ్రయించారు. ఆనందంలో ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి అడ్డాగా మారిన ఉపఖాజానా శాఖ కార్యాలయంలోని అధికారులు ఏసీబీకి చిక్కారనే వార్త మండల వ్యాప్తంగా దావానలంలా వ్యాపించడంతో పలు ప్రభుత్వ శాఖలకు చెందిన సిబ్బంది, పలు గ్రామాల ప్రజాప్రతినిధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి చిన్నపనికి లంచం ముట్టచెప్పనిదే ఫైలు కదిలే పరిస్థితి ఉండేది కాదని వారు అంటున్నారు. ప్రతి నెలా జీతాల బిల్లులకు సైతం ఎంతోకొంత చెల్లిస్తేగాని మంజూరయ్యేవి కాదని చెబుతున్నారు. ఈ దెబ్బతో లంచం తీసుకునే అధికారులు కాస్తై జంకుతారని వారు అంటున్నారు. అధికారుల గుండెల్లో గుబులు ఒకే నెలలో మూడు శాఖలకు చెందిన అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడంతో జిల్లాలోని అధికారుల గుండెల్లో గుబులు మొదలైంది. అవినీతిపై ప్రజల్లో మరింత చైతన్యం వచ్చినప్పుడే అధికారుల్లో జవాబుదారీతనం వస్తుందని పలువురు అంటున్నారు. -
వసూల్ రాజాలు!
గజ్వేల్, న్యూస్‌లైన్: స్థానిక ఉపకోశాధికారి(సబ్ ట్రెజరీ) కార్యాలయం లో వసూళ్ల పర్వం జోరుగా సాగుతోంది. ఇటీవల ఉపాధ్యాయులకు విడుదలైన డీఏ (డ్రాట్ అలనెన్స్) బిల్లుల విషయంలో ఈ తతంగానికి తెరతీసినట్లు తెలిసింది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఆరు నెలల క్రితం డీఏ(కరువు భత్యం)ను మంజూరు చేస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఇందులోభాగంగా 2003 డీఎస్సీ వారికి రూ. 38 వేలు, 2006 డీఎస్సీ ఉపాధ్యాయులకు రూ.19 వేల వరకు కరువుభత్యం రానుంది. ఈ జీఓ ద్వారా గజ్వేల్ తాలుకా పరిధిలోని గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, దౌల్తాబాద్ మండలాల పరిధిలో పనిచేస్తున్న సుమారు 500 మందికిపైగా ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. వీరంతా గజ్వేల్‌లోని ఎస్టీఓ కార్యాలయంలో బిల్లులు చేయించుకుని డీఏ పొందాల్సి ఉంది. దీంతో ఇదే అదునుగా భావించిన సంబంధిత కార్యాలయ అధికారులు వసూళ్ల పర్వానికి తెరతీసినట్లు తెలిసింది. ఒక్కో ఉపాధ్యాయుని వద్ద రూ. 800 నుంచి రూ.1,200 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కార్యాలయంలోని ఓ అధికారి కనుసన్నల్లో ఈ తతంగం నడస్తున్నట్లు సమాచారం. డబ్బులిస్తేనే బిల్లులు చేస్తామని ఉపాధ్యాయులను వేధించిన క్రమంలో కొన్ని రోజుల కిందట ఓ ఉపాధ్యాయ సంఘం నాయకులు కార్యాలయంలోకి వెళ్లి అధికారులతో వాగ్వాదానికి సైతం దిగారు. ఆ తర్వాత వసూళ్లకు కాస్త బ్రేక్ వేసిన అధికారులు మళ్లీ తమ దందా కొనసాగించారని టీచర్లు చెబుతున్నారు. లంచమిస్తేనే బిల్లు చేస్తారంట చాలా రోజుల తర్వాత మాకు ప్రభుత్వం డీఏ మంజూరు చేసింది. ఈ జీవో రాగానే ఎంతో సంబరపడ్డాం. కానీ లంచమిస్తేనే బిల్లులు చేస్తామని ఎస్టీఓ కార్యాలయంలో అధికారులు వేధిస్తున్నారు. డబ్బులివ్వపోతే బిల్లులు చేయడం లేదు. -న్యూస్‌లైన్‌తో ఓ ఉపాధ్యాయుడి ఆవేదన ఆరోపణలు అవాస్తవం ఉపాధ్యాయులకు సంబంధించిన డీఏ బిల్లుల విషయంలో వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణల్లో నిజం లేదు. ఏ ఒక్క ఉపాధ్యాయున్ని కూడా ఇబ్బంది పెట్టకుండా బిల్లులు చేయించి పంపుతున్నాం. కార్యాలయంలో ఎవరైనా ఇబ్బంది పెట్టినట్లు భావిస్తే ఉపాధ్యాయులు నా దృష్టికి తీసుకురావాలి. - రవీందర్‌రెడ్డి, ఉపకోశాధికారి, గజ్వేల్