హన్మకొండ అర్బన్: ట్రెజరీ కార్యాలయంలో వెలుగు చూసిన రూ.22 లక్షల కుంభకోణంలో అర్బన్ జిల్లా ట్రెñజరీ అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. మూడు రోజులుగా విచారణ చేసిన అధికారులు కొన్ని వివరాలు రాబట్టగలిగారు. ప్రాథమిక సమాచారం ఆధారంగా ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన రూరల్ ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్ ఉమామహేశ్వర్‌ను ఇప్పటికే సస్పెండ్ చేయడంతోపాటు మొత్తం ముగ్గురిపై కేసు పెట్టారు. అయితే ఉమామహేశ్వర్ రూరల్ ట్రెజరీలో పనిచేసే ఉద్యోగి. అయితే ఆయన చేసిన దందా మొత్తం అర్బన్ జిల్లా పరిధిలోనిది కావడం విశేషం. నిందితులు పరారీలో ఉన్నారు.
18వేల మంది పెన్షనర్లు
జిల్లాల విభజనతో వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోకి సుమారు 18వేల మంది పెన్షనర్లు వచ్చారు. రూరల్‌లో 2 వేల మంది మాత్రమే ఉన్నారు. ఈ క్రమంలో ఎక్కువ మంది పెన్షనర్లు ఉన్న కారణంగా అర్బన్ జిల్లాను తమ అక్రమాలకు నిలయంగా మార్చుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
బేడీసిం vs ఎవరు
బేడీసింగ్ ఎవరనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఇంతకాలం ఎక్కడా ఈ పేరు ట్రెజరీ వ్యవహారాల్లో అధికారులు కూడా వినలేదని చెబుతున్నారు. అయితే నగరంలో పెన్షనర్లు, ఉద్యోగులకు వారి బ్యాంకు పాస్ పుస్తకాలు, ఏటీఎం కార్డులు, పెన్షనర్ల పెన్షన్ కాగితాలు తాకట్టు పెట్టుకుని ఎక్కువ వడ్డీలకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చే వడ్డీ వ్యాపారిగా అధికారులు గుర్తించారు. విచారణ నిమిత్తం రావాలని పిలిస్తే మొదట వస్తానని చెప్పినప్పటికీ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంచాడని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కేసులో ఏ3గా ఉన్న బేడీసింగ్‌ను విచారిస్తే మరిన్ని వాస్తవాలు తెలిసే అవకాశం ఉందని ట్రెజరీ అధికారులు భావిస్తున్నారు.
అయినా మారలేదు...
ఉమామహేశ్వర్ 2005లో ట్రెజరీలో ఉద్యోగంలో చేరాడు. 2012లో ములుగు ఎస్టీఓలోç ³పనిచేస్తున్న సమయంలో రూ.38 లక్షల కుంభకోణం వ్యవహారంలో సభ్యుడిగా ఉన్నాడు. ఆ సమయంలో అధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలో డీటీఓలో పోస్టింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ములుగు కేసు విచారణ కొనసాగుతోంది.
ఎవరీ మూర్తి
సూర్యనారాయణ మూర్తి(ఎస్‌ఎన్‌మూర్తి) 2009 నుంచి ఉమ్మడి జిల్లా కేంద్రంలోని డీటీఓలో డాటా ప్రోగ్రామింగ్ అధికారికగా(డీపీఓ) పనిచేశారు. మూర్తి మాతృ సంస్థ టెలంగాణ టెక్నాలజీస్ లిమిటెడ్. దాని నుంచి ట్రెజరీస్‌కు అవసరాల నిమిత్తం డిప్యూటేషన్‌పై తీసుకున్నారు. సుమారు రెండేళ్ల క్రితం మూర్తిని మాతృ సంస్థకు పంపించారు. అయితే ట్రెజరీకి సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం విషయంలో మూర్తి నిష్ణాతుడని పేరుంది. అయితే జిల్లాలో పనిచేసిన సమయంలో ఇక్కడి ఉద్యోగులతో ఉన్న సంబంధాలు మూర్తి కొనసాగిస్తుండేవారు. ఈ క్రమంలో ఉమా మహేశ్వర్‌తో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. దీంతో అవసరం మేరకు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్స్ ఉమామహేశ్వర్‌కు అందజేస్తుండేవాడని ట్రెజరీ అధికారుల విచారణలో తెలిసిందని సమాచారం. అయితే ఒక బాధితురాలు అర్బన్ డీటీఓలో అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో అనుమానం వచ్చిన అర్బన్ ట్రెజరీ అధికారులు మెల్లగా కూపీ లాగారు దీంతో తీగలాగితే డొంక కదిలింది. ఈ దందా సుమారు రెండేళ్లుగా సాగుతున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment