illegal collection
-
టీడీపీ నేత సోమిరెడ్డికి మంత్రి వార్నింగ్
-
ఆగని వసూళ్ల దందా...
► నాగలాపురం చెక్‌పోస్టులో పెరిగిన మామూళ్లు ► బరితెగిస్తున్న వాణిజ్య పన్నుల శాఖ ► ప్రయివేటు వ్యక్తులతో వసూళ్ల పర్వం ► తిరుపతి ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు ► రూ.21,860 ల నగదు స్వాధీనం నాగలాపురం చెక్‌పోస్టు...అక్రమ వసూళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇక్కడ పనిచేసే వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగులు పూర్తిగా బరితెగిస్తున్నారు. చెక్‌పోస్టులో ఏకంగా వసూళ్ల దుకాణాన్ని తెరిచేశారు. అడ్డదారిలో అక్రమ సంపాదన కొనసాగిస్తున్నారు. ఉన్నతాధికారుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ, ఏసీబీ దాడులను లెక్కలేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మామూళ్లు ఇవ్వని వాహన యజమానులను ముప్పతిప్పలు పెడుతున్నారు. సరిగ్గా ఐదు నెలల కిందట ఇక్కడి వసూళ్ల వ్యవహారం కమిషనర్ దృష్టికి వెళ్లింది. అప్పట్లో ఒకరిద్దరు అధికారులు, సిబ్బందిపై వేటు పడింది. అయినా ఆ శాఖ ఉద్యోగుల్లో మార్పు లేదు. గురువారం జరిగిన ఏసీబీ దాడుల్లో మరో మారు అడ్డంగా దొరికి పోయారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి /నాగలాపురం : నాగలాపురంలోని వాణిజ్య పన్నుల శాఖ చెక్ పోస్ట్‌పై మరోసారి ఏసీబీ దాడులు జరిగాయి. గురువారం ఉదయం 8 గంటలకు ఆకస్మికంగా దాడులు ప్రారంభించిన అధికారులు రెండు గంటల పాటు ఉద్యోగులు, సిబ్బందికి చెమటలు పట్టించారు. రికార్డులను పరిశీలించి రూ.21,860 ల అదనపు నగదును స్వాధీనం చేసుకున్నారు. అక్కడ విధుల్లో ఉన్న కమర్షియల్ ట్యాక్సు అధికారులు, ఉద్యోగులను ప్రశ్నించారు. అక్రమ వసూళ్లకు పాల్పడ్డ వారిపై రిపోర్టు తయారు చేశారు. అవినీతి నిరోధక శాఖ డీజీ ద్వారా సంబంధిత ఉద్యోగులపై చర్యలకు సిఫార్సు చేయనున్నారు. వీళ్లు మారరంతే... నాగలాపురం చెక్‌పోస్టులో గడచిన రెండేళ్లుగా అవినీతి పెరిగింది. సరుకు రవాణాలో అవకతవకలను గుర్తించి పన్ను విధించా ల్సిన అధికారులే అక్రమార్కులతో చేయి కలుపుతున్నారు. చేయి తడపందే వాహనం కదిలేందుకు అనుమతి ఇవ్వడం లేదు. 2015 నుంచి ఇప్పటివరకూ ఈ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ అధికారులు నాలుగుసార్లు దాడిచేశారు. ప్రతిసారీ అనధికార నగదు దొరుకుతూనే ఉంది. ఏసీబీ అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల్లో మార్పు రావడం లేదు. జిల్లాస్థాయి ఉన్నతాధికారులకు సైతం మామూళ్లు వెళ్తుండబట్టే అవినీతికి అడ్డుకట్ట పడడం లేదనే విమర్శలున్నాయి. ఇక్కడి సిబ్బంది ప్రయివేటు వ్యక్తుల ద్వారా వసూళ్లు చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఏసీబీ సైతం గుర్తించింది. ముందస్తు సమాచారంతోనే.. నాగలాపురం చెక్‌పోస్ట్ అవినీతిపై లారీ యజమానులు, చదువుకున్న డ్రైవర్లు ఫిర్యాదు చేస్తుంటారు. ఏసీబీ అధికారులు సైతం లారీ డ్రైవర్లు ఇచ్చిన ముందస్తు సమాచారంతోనే దాడులకు పూనుకున్నారు. ప్రధానంగా ఇక్కడి చెక్‌పోస్టులో ప్రయివేటు వ్యక్తుల పెత్తనం ఎక్కువగా కనిపిస్తోంది. సాధ్యమైనంత మేర అధికారులు, సిబ్బంది తమ చేయి కనబడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ తరహాలోనే గురువారం విధుల్లో ఉన్న ఏసీటీవో చెన్నరాయుడు, సీనియర్ అసిస్టెంట్ నరసింహులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది శ్రీనివాసులు, ఎస్. శ్రీనివాసులు, మురుగదాస్‌లతో పాటు ప్రయివేటు వ్యక్తులు ఉమాపతి, రాజేష్, పరంధామ్ చెక్‌పోస్టు లోపల ఉన్నారు. ప్రయివేటు వ్యక్తుల నుంచి రూ.14,560లు, కిచెన్ నుంచి రూ.7300లు స్వాధీనం చేసుకున్నారు. నిఘాను పెంచాం తమిళనాడు సరిహద్దు చెక్‌పోస్ట్ కావడంతో పాటు ఎక్కువ ఫిర్యాదులు వస్తున్న దరిమిలా నాగలాపురం చెక్‌పోస్ట్‌పై నిఘా పెంచామని ఏసీబీ సీఐ చంద్రశేఖర్ తెలిపారు. అవినీతిని తగ్గించేందుకు దాడులు కొనసాగిస్తూనే ఉన్నామన్నారు. వాణిజ్య పన్నుల శాఖలో కలవరం నాగలాపురం చెక్‌పోస్ట్‌లో ఏసీబీ దాడులు జరిగిన నేపథ్యంలో తిరుపతి, చిత్తూరు, పుత్తూరు ప్రాంతాల్లో పనిచేసే వాణిజ్య పన్నుల శాఖలో కలవరం మొదలైంది. కాగా 2016 డిసెంబరు మొదటి వారంలో ఒకిరిద్దరు ఉద్యోగులపై వేటు పడిందనీ, ఈసారి ఎవరిపై దెబ్బ పడుతుందోనని బెంబేలెత్తుతున్నారు. -
అడుగడుగునా మేత
టార్గెట్ రూ.2 కోట్లు భవన నిర్మాణదారులకు నోటీసులు అభివృద్ధి కమిటీ పేరు గిమ్మిక్కు అధికార పార్టీ అండలో అక్రమాల దందాతో పెనమలూరు నియోజకవర్గంలోని ముఖ్య ప్రజాప్రతినిధి వసూళ్ల పర్వానికి తెర తీశాడు. యనమలకుదురులో అక్రమ కట్టడాలను లక్ష్యంగా చేసుకున్న ఆ మేతల నేత గతంలో రూ.1.5 కోట్లు దండుకున్నాడు. తాజాగా మరో రూ.2 కోట్లకు దోపిడీకి తెర తీశాడు. 50 అక్రమ కట్టడాల నుంచి రూ.5 లక్షలకు తగ్గకుండా దండుకునేందుకు పక్కాగా స్కెచ్ గీశాడు. స్మార్ట్ విలేజీ పేరిట ఈ మొత్తం స్వాహాకు రంగం సిద్ధం చేశాడు. పెనమలూరు : యనమలకుదురులో మరోసారి అక్రమ వసూళ్లకు తెరలేచింది. స్మార్ట్ గ్రామం అభివృద్ధి కమిటీ ముసుగులో నియోజకవర్గంలోని టీడీపీ ముఖ్య ప్రజాప్రతినిధి ఈ దందాకు సిద్ధమయ్యారు. ఏకంగా రూ.2 కోట్ల వసూళ్లు టార్గెట్‌గా రంగం సిద్ధం చేశారు. అనుకున్నదే తడవుగా పంచాయతీ కార్యదర్శితో అక్రమ కట్టడాలకునోటీసులు జారీ చేయించటం మొదలుపెట్టారు. పంచాయతీ ఆదాయానికి గండి... యనమలకుదురులో కొందరు బిల్డర్లు అక్రమ కట్టడాలు చేపట్టారు. గ్రామ పంచాయతీ ఎటువంటి ప్లాన్లూ ఇవ్వకుండానే నకిలీ ప్లాన్లతో గ్రూప్ హౌస్‌లు, అనేక అక్రమ కట్టడాలను నిర్మించారు. ఈ వ్యవహారంపై ఆధారాలు సహా ‘సాక్షి’ కథనాలు ప్రచురించింది. పంచాయతీ ఆదాయానికి దాదాపు అర కోటి రూపాయలకు పైగా గండి కొట్టిన వైనాన్ని బహిర్గతం చేసింది. దీనిపై గతంలో ఇక్కడ పనిచేసిన పంచాయతీ కార్యదర్శులు సస్పెన్షన్‌కు గురయ్యారు. అక్రమంగా ప్లాన్లు ఇచ్చారంటూ గ్రామస్తులు న్యాయస్థానాన్ని ఆశ్రయించటంతో న్యాయమూర్తి ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నారు. మొదటికి వచ్చిన వసూళ్లు గతంలో టీడీపీ ముఖ్య ప్రజాప్రతినిధి అక్రమ కట్టడాలపై కన్నేసి సీఆర్డీఏ, విజిలెన్స్, జిల్లా పంచాయతీ అధికారులను అడ్డు పెట్టుకుని దాదాపు రూ.కోటిన్నర వసూళ్లకు పాల్పడ్డారు. ఇది కప్పిపుచ్చుకోవటానికి కృష్ణానది నుంచి అక్రమంగా ఇసుక తరలించి గ్రామంలో అక్కడక్కడ ఇసుకతో రోడ్లు వేసి తాను గ్రామాన్ని అభివృద్ధి చేశానని చెప్పుకొని బాకా కొట్టుకున్నారు. గట్టిగా ఒక వాన పడితే నిలవని స్థాయిలో వీటి నాణ్యత ఉండటం గమనార్హం. ఇప్పుడు గ్రామంలో దాదాపు 50 అక్రమ కట్టడాలను గుర్తించారు. వీరి వద్ద నుంచి రూ.2 కోట్లుకు పైగా వసూళ్లకు టీడీపీ నేత రంగం సిద్ధం చేశారు. గతంలోలా వసూళ్ల వ్యవహారం అల్లరి అవకుండా ఇప్పుడు పంథా మార్చారు. స్మార్టు గ్రామం అభివృద్ధి కమిటీ పేరుతో బిల్డర్లను ఒక్కో గ్రూప్హౌస్కు రూ.5 లక్షలు చొప్పున 50 నిర్మాణాలకు టార్గెట్ రూ.2 కోట్లకు పైగా పెట్టారు. అధికారులను రంగంలోకి దించి నోటీసులు ఇప్పించే పనిలో పడ్డారు. ఒక కమిటీ కూడా వేసి డీడీలు తీయించే పనిలో టీడీపీ నేత ఉన్నారు. అక్రమ ప్లాన్లపై కేసులేవీ? అక్రమ ప్లాన్లతో నిర్మాణాలు చేస్తున్న వారిపై ఇప్పటివరకు క్రిమినల్ కేసులు పెట్టలేదు. టీడీపీ ముఖ్య ప్రజాప్రతినిధి అండదండలతో ఈ అక్రమ నిర్మాణాలు జరుగుతుండటంతో అధికారులెవరూ చర్యలకు సాహసం చేయలేదు. పంచాయతీ కార్యాయలంలో ముద్రలు వాడి, పంచాయతీ ఆదాయానికి గండి కొట్టి, బ్యాంకులను మోసం చేసి రుణాలు పొందిన వారిని వదిలేశారు. పైగా టీడీపీ నేత ఆదేశాలతో అధికారులే ఇప్పుడు కలెక్షన్ ఏజెంట్లుగా మారారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోనే ఈ తరహా మోసం ఎక్కడా జరగదని చెబుతున్నారు. రాజధానికి కూతవేటు దూరంలో ఈ అక్రమ దందా, వసూళ్లు జరుగుతున్నా ఉన్నతాధికారులు కన్నెత్తి కూడా చూడకపోవటంపై విమర్శలు వ్యక్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులే కోర్టును ఆశ్రయిస్తామని అంటున్నారు. కమిటీతో తస్మాత్ జాగ్రత్త టీడీపీ నేత వేసిన కమిటీ ఇప్పుడు చర్చనీయాంశమైంది. కమిటీ పగ్గాలు తీసుకునేవారు ఈ అక్రమ వసూళ్లకు జవాబుదారీగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో వారు చట్టపరిధిలో ఇరుక్కుపోయే ప్రమాదముంటుందని చెబుతున్నారు. -
మున్నంగి ఇసుక రీచ్‌లో అక్రమ వసూళ్లు
లబోదిబోమంటున్న లారీ డ్రైవర్లు చర్యలు తీసుకుంటానన్న సీసీ మున్నంగి (కొల్లిపర) : మండలంలోని మున్నంగి గ్రామ సమీపంలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలో డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇసుక రీచ్‌లో అక్రమ వసూళ్ల పర్వం కొనసాగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్వాక్రా మహిళల చాటున అధికార పార్టీ నేత ఆధ్వర్యంలో సాగుతున్న ఈ రీచ్‌లో లారీ డ్రైవర్ల వద్ద నగదు వసూలు చేస్తున్నారు. ఇసుకను లారీలకు లోడ్ చేసే సమయంలో ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేనప్పటికి రూ.300 వరకు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. అయితే లోకల్ లారీల నుంచి కాకుండా గుంటూరు నుంచి వచ్చే వాటి నుంచి ఈ దందా చేస్తున్నారు. ఇలా రోజుకు 20కిపైగా లారీల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇదేమని అడిగిన డ్రైవర్లకు మాత్రం ఇసుక ఎక్కువ లోడ్ చేస్తున్నాం కాబట్టి వసూలు చేస్తున్నామని చెబుతున్నారు. దీంతో లారీ డ్రైవర్లు చేసేదేమీ లేక లోడ్ చేయించుకుని నిర్వాహకులు అడిగిన మేర ఇచ్చేస్తున్నారు. దీనిపై క్లస్టర్ కో ఆర్డినేటర్ (సీసీ) ఐ.ప్రసాద్‌ను వివరణ కోరగా అక్రమ వసూళ్లు జరుగుతున్న మాట వాస్తవమేనని చెప్పారు. రెండు మూడు రోజులుగా అక్రమ వసూళ్లు జరుగుతున్నట్లు తనకు కొందరు డ్రైవర్లు ఫిర్యాదు చేశారని, దీనిపై నిర్వాహకులను హెచ్చరించానని తెలిపారు. ఇకనుంచి అక్రమ వసూళ్లు లేకుండా చూస్తానన్నారు. డంప్ చేయనున్నారా... ఫ్రిబవరి నెల నుంచి నూతన పద్ధతిలో ఇసుక రీచ్‌లకు వేలం పాటల ద్వారా నిర్వహణ ఉంటుందనే ప్రచారం రావడంతో మున్నంగి రీచ్‌లోని ఇసుకను నది ఒడ్డున డంప్ చేసేందుకు చర్యలు ప్రారంభించారు. నది ఒడ్డున ఉన్న ఖాళీ ప్రాంతంలో భూమిని చదును చేసి శుభ్రం చేశారు. గత డిసెంబర్ 2వ తేదీన 41 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక రవాణాకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సోమవారం వరకు 22 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను రవాణా చేయగలిగారు. ఈ విషయంపై సీసీ ఐ.ప్రసాద్ వివరణ కోరగా పీడీ లేదా కలెక్టర్ అనుమతి మేరకు డంప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. డంప్ చేసేందుకు అనుమతి వచ్చే అవకాశం ఉందన్నారు. -
డబ్బు కొట్టు.. ప్లాట్ పట్టు!
అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్న కొందరు ‘తమ్ముళ్లు’ పట్టించుకోని పోలీసులు .. మోసపోతున్న పేదలు తెనాలి అర్బన్ : తెనాలిలో అక్రమ వసూళ్ళ పర్వం కొనసాగుతోంది. ప్రతి పనికి ఓ రేటును ఫిక్స్ చేసి కొందరు అధికార పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇప్పటి ఏకంగా పేదలను దోచుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేశారనే వాదన పట్టణంలో విన్పిస్తోంది. ఇదే విషయాన్ని కొందరు టీడీపీ నాయకులు సోమవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్వయంగా వెల్లడించడాన్ని బట్టి దందా ఏ స్థాయిలో సాగుతుందో అర్థమౌతుంది. పేదలే టార్గెట్.. తెనాలి పట్టణంలో మొత్తం 40 వార్డులున్నాయి. ఇక్కడ అనేక మంది పేదలు నివశిస్తున్నారు. వీరికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలనే ఉద్ధేశంతో దివంగత మహానేత వైఎస్ అప్పట్లో భావించారు. అందులో భాగంగా అప్పటి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ పెదరావూరు సమీపంలో సుమారు 40 ఎకరాలు సేకరించేందుకు ప్రయత్నించారు. అయితే కొందరు రైతులు దీనిపై కోర్టును ఆశ్రయించగా మరి కొందరు స్వచ్ఛందంగా భూమిని ప్రభుత్వానికి అందజేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆ స్థలంలో అపార్ట్మెంట్లను ని ర్మించి పేదలకు ఇవ్వాలని భావించారు. ఎంపికైన లబ్ధిదారుడు ప్రభుత్వానికి రూ.50 వేలు చెల్లిస్తే ప్రభుత్వం బ్యాంకర్ల సాయంతో దానిని నిర్మించి పేదలకు అందజేసేందుకు నిర్ణయించారు. ఈ విషయం స్థానిక ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులకు తెలిసింది. దీంతో కొందరు స్థానిక సంస్థల ప్ర జా ప్రతినిధులు, నాయకులు వసూళ్ళ పర్వానికి తెర తీశారు. లబ్ధిదారుల ఎంపిక జరగాలంటే తమ ఆమోదం లేకుండా కుదరదని పేదలను నమ్మిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఒక్కో పేదవాడి నుంచి రూ.10 వేల నుంచి రూ.25 వేల వర కు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే ఒక్కో దళారి రూ.లక్షల్లో వసూలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే, గ్యాస్ కనెక్షన్లను ఇప్పిస్తామని మరి కొందరు టీడీపీ నాయకులు పేదలను దోచుకుంటున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. దీనిపై తహశీల్దార్ జీవీ సుబ్బారెడ్డి, డీఎస్పీ సీహెచ్ సౌజన్యలను వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి రాలేదన్నారు. ఇలాంటి అక్రమాలను సహించేది లేదని స్పష్టం చేశారు. బాధితులెవరైనా తమకు ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
అవినీతి ఖజానా...
ప్రతీ పనికి ఒక్కో రేటు పెన్షనర్లనూ వదలని జలగలు ఇదీ కలెక్టరేట్లోని సబ్‌ట్రెజరీ కార్యాలయంలో పరిస్థితి హన్మకొండ అర్బన్ : కలెక్టరేట్లోని డీపీవో కార్యాలయంలో ఏసీబీ దాడులు జరిగి నెల కూడా దాట లేదు. అరుుతే, ఈ కార్యాలయం పక్కనే ఉండే సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఉద్యోగులు తమ అక్రమ వసూళ్లను ఆపలేదనే ఫిర్యాదులు వస్తూనే ఉన్నారుు. ప్రతీ పనికో రేటు నిర్ణరుుంచిన ఉద్యోగులు కార్యాలయూనికి వచ్చే వారిని పీడిస్తుండగా... ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నారుు. వీరి అవినీతి బాగోతానికి సంఘం నేతలు గా చెలామణి అవుతున్న కొందరు సహకరిస్తుండడం గమనార్హం. చావు పైసలకు బేరం ప్రభుత్వ పెన్షనర్ మరణిస్తే తక్షణ అవసరాల కింద ఆ పెన్షనర్ తీసుకునే పింఛన్ మొత్తాన్ని అందజేస్తారు. అరుుతే, ఈ డబ్బు ఇచ్చే విషయంలోనూ సబ్‌ట్రెజరీ ఉద్యోగులు కక్కుర్తి ప్రదర్శస్తున్నారు. తమకు అనుకూలంగా ఉండే రిటైర్డ్ ఉద్యోగ సంఘాల నేతలను ముందు ఉం చి వ్యవహారం నడిపిస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నారుు. కార్యాలయంలో కూడా కొందరు సంఘం నేతల హవా సాగుతుండడం, వీరికి అధికారుల సహకారం ఉండడంతో దందాకు అంతు లేకుండా పోరుుందని తెలుస్తోంది. తండ్రి చనిపోయాడని వస్తే.... వరంగల్‌లోని ఎల్బీ కళాశాలలో పనిచేసి రిటైర్ అయిన గురువయ్య పింఛన్ పొందుతూ ఇటీవల మృతి చెందారు. దీంతో ఆయనకు వచ్చే పింఛన్‌ను తల్లి పేరిట మార్చాలని కోరుతూ హన్మకొండ మండలం భట్టుపల్లికి చెందని కుమార్ కలెక్టరేట్లోని ఏటీవో దుర్గాప్రసాద్‌ను కలిశారు. ఈ విషయమై మరో అధికారిని కలవాలని దుర్గాప్రసాద్ సూచించారు. దీంతో కుమార్ వెళ్లి తన పనిని వివరించగా.. ఫైల్ మొత్తం పరిశీలించిన సదరు ఉద్యోగులు కొన్ని కాగితాలు సరిగ్గా లేవు, మరికొన్ని కావాలంటూ తిప్పి పంపించారు. ఆ తర్వాత ఆయూ పత్రాలతో వెళ్లినా ఏదో కారణం చెబుతూ విసుగెత్తించారు. చివరకు అసలు సంగతేంటని విచారిస్తే రూ.3వేలు ఇస్తే ఒక్క రోజులో పని అరుుపోతుందని సెలవిచ్చారు! అరుుతే, తన వద్ద అంత మొత్తం లేదని చెప్పుకొచ్చిన కుమార్ రూ.2వేలు ఇవ్వగా.. వెంటనే ఏ కాగితం అవసరం లేకుండా పని పూర్తరుుపోరుుంది. పట్టించుకోని అధికారులు కలెక్టరేట్లో ఉన్న సబ్ ట్రెజరీ కార్యాలయంలో అవినీతి వ్యవహారంపై పక్కనే ఉన్న జిల్లా ఖజానా అధికారులకు ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోవడం లేదని చెబుతున్నారు. గతంలో ఉన్నతాధికారులు వచ్చిన సమయంలో కొందరు ఎస్టీవోలో అవినీతిపై ఫిర్యాదు చేశారు. కాగా, శనివారం జిల్లాకు రానున్న ట్రెజరీ స్టేట్ డెరైక్టర్, ఇతర అధికారులకు సబ్ ట్రెజరీ ఉద్యోగుల వ్యవహారంపై ఫిర్యాదు చేసేందుకు పలువురు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ ఫిర్యాదుతోనైనా శాఖ ఉన్నతాధికారులు స్పంది స్తారా, కార్యాలయ ఉద్యోగులు మారతారా అన్నది వేచి చూడాల్సిందే. మధ్యవర్తి ఉంటేనే... కలెక్టరేట్లోని ఎస్టీవో కార్యాలయానికి ఏదైనా పని నిమిత్తం కొత్తవారు వస్తే నానా పాట్లు పడాల్సిందే. ఇక్కడ మధ్యవర్తులు లేనిదే పనికాదు. అరుుతే, వీరిని అధికారులే పెంచి పోషిస్తున్నారనే విమర్శలు ఉన్నారుు. ఇక నవంబర్ మాసం వచ్చిందంటే కార్యాలయ ఉద్యోగులకు పండగే. ఈ నెలలో పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉండడంతో అందిన కాడికి దండుకుంటారు. లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చన వారికి రశీదు ఇవ్వరు... అదేంటని అడిగితే రేపు, తర్వాత... అంటూ వాయిదాలు పెడుతుంటారు. తీరా చూస్తే మీ సర్టిఫికెట్ కనిపించడం లేదు. ఇంకొకటి తెచ్చి ఇవ్వాలని సూచిస్తారు. కలెక్టరేట్లో పనిచేసే ఒక మహిళా ఉద్యోగి ఫ్యామిలీ పెన్షన్ కోసం లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చినా సుమారు మూడు నెలలు పింఛన్ ఆపేశారు. ఇదేంటని అడిగితే మీరు సర్టిఫికెట్ ఇవ్వలేదని బదులివవ్వడమే కాకుండా.. నోటికి వచ్చినట్లు మాట్లాడారని ఆ ఉద్యోగి వాపోయూరు. -
రాజధాని పేరిట అక్రమ దందా
పెద్ద కొడుక్కి విరాళమట! పింఛను సొమ్ములో రూ.100 కోత జన్మభూమి కమిటీల తీర్మానాలంటూ తెలుగు తమ్ముళ్ల హడావుడి ప్రశ్నిస్తే.. పింఛను రాదంటూ హెచ్చరికలు కౌతవరం బ్యాంకు ప్రాంగణంలో బాహాటంగా వసూళ్లు రెండు జిల్లాల్లో రూ.7 కోట్ల వసూలు లక్ష్యం! రాజధాని శంకుస్థాపన పేరుతో వందల కోట్ల రూపాయలు ఇష్టారాజ్యంగా ఖర్చు చేసిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు రాజధాని నిర్మాణం పేరుతో అక్రమ వసూళ్లకు తెరతీసింది. జన్మభూమి కమిటీల పేరుతో తెలుగు తమ్ముళ్లే బహిరంగంగా ఈ వసూళ్లకు దిగుతున్నారు. ప్రశ్నించిన వారిని పింఛను రాదంటూ బెదిరింపులకు దిగుతున్నారు. విరాళం అంటే ఎవరైనా తమ ఇష్టపూర్వకంగా ఇచ్చేదై ఉండాలి.. కానీ ముందే రూ.100 చొప్పున కోత విధించి మిగిలినదే చేతిలో పెడుతుండటం శోచనీయం. విజయవాడ : రాజధాని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు సరికొత్త దందాకు తెరతీశారు. ఇసుక మొదలుకొని మద్యం షాపుల వరకు దేనినీ వదలని ‘తెలుగు’ తమ్ముళ్లు ఆఖరికి పింఛనుదారుల నుంచీ బలవంతపు వసూళ్లు చేస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే ఇకపై పింఛను రాదంటూ బెదిరిస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పింఛనుదారుల నుంచి రాజధాని నిర్మాణానికి విరాళం పేరుతో పింఛను మొత్తంలో రూ.100 కోత విధించే కార్యక్రమాన్ని చేపట్టారు. గత వారం రోజుల నుంచే జన్మభూమి కమిటీలు తీర్మానం చేశామంటూ హడావుడి చేసి ఈ నెల రెండో తేదీ నుంచి ఈ వసూళ్లు మొదలుపెట్టాయి. గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో ఫించనుదారులు అక్రమ వసూళ్ల పర్వాన్ని నిలదీయడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గ్రామాల్లో అలజడి... ప్రతి ఇంటికి పెద్ద కొడుకై వెయ్యి రూపాయల పింఛను నెలనెలా ఇస్తున్నాడు. అందులో రూ.100 విరాళం రాజధాని నిర్మాణం కోసం పెద్ద కొడుక్కి ఇవ్వలేరా.. అంటూ వసూళ్లకు తెగబడుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు వసూళ్ల బాధ్యత పంచాయతీ సర్పంచ్, స్థానిక జన్మభూమి కమిటీలపై పెట్టడంతో గ్రామాల్లో అలజడి మొదలైంది. రెండు జిల్లాల్లో కలిపి 7.01 లక్షల మంది అన్ని కేటగిరీల పింఛనుదారులు ఉన్నారు. వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెలకు రూ.67.89 కోట్లు నెలనెలా బ్యాంకుల ద్వారా చెల్లిస్తున్నాయి. మరో వారం వ్యవధిలోనే రెండు జిల్లాల్లో కలిపి రూ.7 కోట్లు వసూలు చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. ఇచ్చే సొమ్ములో ముందే కోత... జీవిత చరమాంకంలో ఉన్న వృద్ధులు, తోడు కోల్పోయి అనాథలుగా మారిన వితంతువులు, అంగవైకల్యంతో ఉన్న వికలాంగులపై జాలి చూపాల్సింది పోయి.. వారికి ఇచ్చే అరకొర సొమ్ములోనే విరాళాల పేరుతో అడ్డగోలు వసూళ్లకు తెగబడటం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఎమ్మెల్యేలే బహిరంగంగా ప్రకటనలు చేసి మరీ రూ.100 విరాళం ఇవ్వాలని కోరుతుండగా, ఇక్కడ మాత్రం జన్మభూమి కమిటీల పేరుతో వసూళ్లు సాగిస్తున్నారు. బ్యాంకర్లతో ముందే మాట్లాడుకుని ఇచ్చే పింఛను మొత్తంలో నుంచి రూ.100 ముందే కోత విధించి మిగిలిన సొమ్ము లబ్ధిదారులకు ఇచ్చేలా ప్లాన్ చేయటం గమనార్హం. మంగళవారం కౌతవరం ఆంధ్రాబ్యాంకు ప్రాంగణంలోనే టీడీపీ నేతలు ఈ వసూళ్లకు తెగబడటం వివాదాస్పదమైంది. తమకు ఏ గతీ లేక పింఛను తీసుకొని బతుకుతున్నామని, అందులోనూ కోత విధిస్తే ఎలా అని ప్రశ్నించారు. రాజధానికి ఎందుకివ్వాలి రాజధాని నిర్మాణానికి పింఛనుదారుల నుంచి డబ్బులు లాగేసుకుంటున్నారు. వృద్ధులు, వికలాంగులకు ఇచ్చే డబ్బుల్లో ముందే కోత విధించి పింఛను ఇవ్వటం విడ్డూరంగా ఉంది. అసలు రాజధాని నిర్మాణానికి చందాలు పింఛనుదారులే ఎందుకు ఇవ్వాలి. ఇష్టమైతే చందా ఇస్తారు గాని బలవంతంగా లాక్కుంటారా? - దాసి రాధాకృష్ణ, కౌతవరం శివారు బలరామపురం కమిటీ నిర్ణయిస్తే దందా చేస్తారా? గ్రామంలో చంద్రబాబు చెబితే కమిటీ వేసుకున్నారట. ఆ కమిటీ చెప్పిన మేరకు ఈ వసూళ్లు చేస్తుంటే మేము చూస్తా ఊరుకోవాలా? వందేసి రూపాయలు బలవంతంగా వసూలు చేయటం దారుణంగా ఉంది. దానికి రాజధాని నిర్మాణం పేరు పెట్టి ఏదో బాకీలాగా బలవంతంగా వసూలు చేస్తున్నారు. - బోలపాటి నిర్మల, కౌతవరం శివారు బలరామపురం -
జాతరపై టీడీపీ రాజకీయం
అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు నగరిలో టీడీపీ నాయకుల ఇష్టారాజ్యం అంతర్మధనంలో పలువురు సీనియర్లు కక్ష సాధింపుతోనే ఎమ్మెల్యే రోజా, మున్సిపల్ చైర్పర్సన్ కుటుంబంపై కేసులు చిత్తూరు : నగరిలో ఏటా ఘనంగా నిర్వహించుకునే గంగ జాతరలోను తెలుగుదేశం పార్టీ రాజకీయం చేసి వర్గ వైషమ్యాలకు ఆజ్యం పోస్తోంది. పార్టీలకు అతీతంగా ఐదేళ్ల నుంచి జాతర నిర్వహిస్తున్న కమిటీని ఈ సారి పూర్తిగా టీడీపీ నేతలు హస్తగతం చేసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జాతర పేరుతో పెద్ద ఎత్తున అక్రమ వసూళ్లకు తెరతీశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు స్థానిక పోలీసులకు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. దీనిపై స్పందించిన సంబంధిత అధికారి ఒకరు అక్రమ వసూళ్లకు పాల్పడరాదంటూ పత్రికా ప్రకటనలు చేసిన విషయం విదితమే. గతేడాది జరిగిన జాతరలో ఎమ్మెల్యే రోజాపై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడిన సంఘటనకు సంబంధించి ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకున్న దాఖలాలు లేవు. రోజా ఎమ్మెల్యేకాక ముందు నుంచే ప్రతి ఏటా జాతరలో భాగంగా శుక్రవారం జరిగే అమ్మవారి హారతికి హాజరుకావడం తెలిసిందే. ఆమెకు అప్పట్లో జాతర నిర్వాహక కమిటీ సభ్యులంతా స్వాగతం పలికిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారి జరిగిన జాతర (గతేడాది)లో హారతి రోజున టీడీపీ నేతలు చేసిన దాడిలో గాయపడినా ఆమె సహనంతో ఉన్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా సహకరించారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు ఓటమిని జీర్ణించుకోలేకనే టీడీపీ నేతలు అడ్డదారుల్లో ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగా మున్సిపల్ కమిషనర్‌ను అడ్డం పెట్టుకుని పోలీసుల సహకారంతో చైర్పర్సన్ కుటుంబంపై అక్రమ కేసులు పెట్టడం తెలిసిందే. మరోవైపు ఈ నెల 15, 16,17,18 న నగరిలో జరిగే జాతరలో తమ ఆధిపత్యం చూపించుకోవాలనే వ్యూహంతో మున్సిపల్ చైర్పర్సన్ కుటుంబాన్ని ఉద్దేశపూర్వకంగానే జాతరకు దూరం చేశారు. కేసుల్లో జైలుకెళ్లిన మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే కుమార్, మరో నలుగురికి బెయిల్ వస్తుందని తెలిసి వారు జాతరకు వారొస్తే గొడవలు జరుగుతాయంటూ పోలీసు అధికారులతో నివేదిక ఇప్పించారనే విమర్శలు వస్తున్నాయి. ఇందు కోసం పార్టీలోకి వలసొచ్చిన ఓ టీడీపీ నేత లక్షలాది రుపాయలు ఖర్చుపెట్టారన్న ప్రచారం ఉంది. అయితే టీడీపీ నేతలపై పలుకేసులు ఉన్నా పోలీసులు ఎటువంటి నివేదికలు ఇవ్వకపోవడం గమనార్హం. -
అక్రమ వసూళ్ల అనకొండ
పెనుకొండ చెక్‘పోస్టు’ రవాణాశాఖ అధికారులకు కాసులు కురిపించే కల్పతరువుగా మారుతోంది. పదేళ్లు కార్యాలయంలో పని చేయడం కన్నా ఏడాది ఈ చెక్‌పోస్ట్‌లో పని చేస్తే చాలన్న భావనలో అధికారులు ఉంటున్నారు. ఏసీబీ అధికారులకు పట్టుబడినా శాఖాపరమైన చర్యలు నామమాత్రంగా ఉంటుండడంతో ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని రెచ్చిపోతున్నారు. - పెనుకొండ చెక్‌పోస్టులో రోజుకు రూ.70 వేలకు పైగా అక్రమార్జన - ప్రైవేట్ వ్యక్తులతో వ్యవహారం అనంతపురం టౌన్ : జాతీయ రహదారిపై పెనుకొండ సమీపంలో ఉన్న ఆర్టీవో చెక్‌పోస్టులో అక్రమ వసూల్లు మూడుపువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ శాఖకు చెందిన కింది స్థాయి నుంచి పైస్థాయి అధికారుల వరకూ వాటాలు ఉండడం వల్లనే ఈ దందా యథేచ్ఛగా సాగుతోందని తెలుస్తోంది. ఇక్కడ పనిచేస్తున్న అధికారులు తమ వ్యక్తిగతంగా ఓ ప్రైవేట్ వ్యక్తిని నియమించుకొని వ్యవహారం చక్కబెడుతున్నారంటే రోజువారి అక్రమ ఆదాయం ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సొమ్ము వీరి జేబుల్లో చేరుతోంది. వివరాల్లోకెళితే ఇక్కడి చెక్పోస్టుఅనంతపురం డిప్యూటీ కమిషనర్ నియంత్రణలో, హిందూపురం ఆర్టీఓ పరిధిలో ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఇద్దరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు (ఎంవీఐ), నలుగురు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికితోడు ప్రతి షిప్ట్లోనూ కానిస్టేబుళ్లు ఉంటారు. అధికారికంగా వీరు మాత్రమే ఇక్కడ ఉండగా అనధికారికంగా ప్రతి అధికారికి వ్యక్తిగతంగా ఓ ప్రైవేట్ వ్యక్తి పని చేస్తున్నాడు. వీరు తనిఖీ కేంద్రం వద్దకు వచ్చే వాహనదారులతో అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్నారు. ఓవర్లోడింగ్, రికార్డులు సరిగా లేనివి, ప్రైవేట్ ట్రావెల్స్, టూరిస్ట్ బస్సులు ఇలా ప్రతి వాహనదారుడి నుంచి వసూలు చేసిన మొత్తాన్ని గుట్టుచప్పుడు కాకుండా అధికారులకు చేస్తారు. ఇక్కడి నుంచి ఎవరు బదిలీ అయినా ప్రైవేట్ వ్యక్తులు మా త్రం ‘హెల్పిం డ్ హ్యాండ్స్’గా ఉంటూ అన్నీ చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది. ఇది బహిరంగ రహస్యమే అయినా ఉన్నతాధికారులు స్పందించకపోవడంపై వారి చిత్తశుద్ధిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధికారులకు నెలవారీ వాటాలు : ఈ చెక్‌పోస్ట్ ద్వారా ప్రతి రోజూ రూ.లక్ష ఆదాయం రవాణా శాఖకు వస్తోంది. ఇది అధికారికంగా మాత్రమే. అనధికారికంగా మరో రూ. 70 వేలకు పైగా వస్తున్నట్లు సమాచారం. ఏసీబీ అధికారుల దాడుల్లో పట్టుబడుతున్న అనధికారిక సొమ్మే ఇందుకు నిదర్శనం. ఏడాదికి సుమారు రూ. 3 కోట్ల వరకు అనధికారిక ఆదాయం వస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ చెక్‌పోస్ట్‌లో పని చేసేందుకు అధికారులు ఉత్సాహం చూపుతుంటారని ఆ శాఖ వర్గాలే చెబుతున్నాయి. షరా‘మామూలే’ : చెక్‌పోస్ట్‌లో పట్టుబడుతున్న అధికారులపై ఆ శాఖ ఉన్నతాధికారులకు ఏసీబీ అధికారులు నివేదికలు పంపుతున్నారు. అయితే అక్కడ రాజకీయ ఒత్తిళ్లతో ‘సరి’ చేసుకుంటుండడంతో వసూళ్ల దందా షరా‘మామూలు’గా సాగుతోంది. ఏసీబీ దా డులు జరిగిన కొద్ది రోజులు అక్రమ వసూళ్లకు విరామం ప్రకటిస్తారు. ఆ తర్వాత యథాప్రకారం వసూళ్ల పర్వానికి తెరతీస్తుంటారు. ప్రైవేట్ వ్యక్తులు హల్చల్ చేస్తున్నా ఉన్నతాధికారులు దృష్టిపెట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. రెండున్నరేళ్లలో జరిగిన ఏసీబీ దాడుల వివరాలు.. - 2013 ఏప్రిల్ 3న ఏసీబీ దాడిలో అప్పటి ఏఎంవీఐ శ్రీనివాసులు, కానిస్టేబుల్ బాబయ్య, ప్రైవేట్ వ్యక్తులు రాము, శంకర్ పట్టుబడ్డారు. వారి నుంచి రూ.1,33,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. - 2013 డిసెంబర్ 21న ఏఎంవీఐ సుబ్బరాయుడు, హాంగార్డు కిష్టప్ప, కానిస్టేబుల్ బాబయ్యతో పాటు ప్రైవేట్ వ్యక్తులు శంకర్, శివారెడ్డిలను అదుపులోకి తీసుకునిరూ.53,440 నగదు స్వాధీనం చేసుకున్నారు. - 2013 డిసెంబర్ 29న ఎంవీఐ ప్రసాద్, కానిస్టేబుల్ నాగభూషణ్, హోంగార్డు ఆదినారాయణ పట్టుబడ్డారు. రూ.37 వేలు స్వాధీనం చేసుకున్నారు - 2014 జనవరి 17న ఏఎంవీఐ సుబ్బరాయుడు, కానిస్టేబుల్ రవీంద్రరెడ్డి పట్టుబడ్డారు. రూ.39,055 నగదు స్వాధీనం చేసుకున్నారు. - 2014 జులై 27న ఎంవీఐ వరప్రసాద్, కానిస్టేబుల్ నరసింహులు, హోంగార్డు రాధాకృష్ణ పట్టుబడగా రూ.27,500 స్వాధీనం చేసుకున్నారు. - 2015 మార్చి 25న ఏఎంవీఐ నాగేంద్ర, హెడ్‌కానిస్టేబుల్ జాన్ మోజెస్‌తో పాటు ప్రైవేట్ వ్యక్తి రామును అదుపులోకి తీసుకుని రూ.77,800 సీజ్ చేశారు. - 2015 ఆగస్టు 13న అర్ధరాత్రి ఏసీబీ అధికారులు దాడులు చేయగా ఎంవీఐ ప్రసాద్, చెక్‌పోస్ట్ సబార్డినేటర్ బాలాజీ, ప్రైవేట్ వ్యక్తి శివారెడ్డి పట్టుబడ్డారు. ఎంవీఐ రెస్ట్ రూం నుంచి రూ.15 వేలతో పాటు శివారెడ్డి నుంచి రూ.16,200 స్వాధీనం చేసుకుని రికార్డులు సీజ్ చేశారు. చెక్‌పోస్ట్ ఇన్చార్జ్, ఎంవీఐ మల్లికార్జునపై కూడా చర్యలు తీసుకోవాలని ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. -
కస్సు ‘బస్సు’
తాత్కాలిక సిబ్బందికి వరంలా మారిన ఆర్టీసీ సమ్మె {పయాణికుల నుంచి ఇష్టానుసారం వసూలు సంస్థకు వస్తున్నది నామమాత్రపు ఆదాయం ఏడు రోజులవుతున్నా గాడిలో పడని టికెట్ రేట్లు {పమాదాలు, అక్రమ వసూళ్లపై లోపించిన పర్యవేక్షణ విశాఖపట్నం: పిల్లికి చెలగాటం..ఎలుకకు ప్రాణసంకటమన్నట్లుగా తయారైంది ఆర్టీసీ సమ్మె వల్ల ప్రయాణికుల పరిస్థితి. బస్కెక్కాలంటేనే జనం వెనుకడుగేస్తున్నారు. తాత్కాలిక సిబ్బంది ‘టికెట్ రేట్’కు అంతూపొంతూ లేకుండా పోతోంది. రోజుకు వెయ్యి రూపాయల వేతనం కోసం వచ్చిన వారు వేలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ఎక్కువ చెల్లించలేక ప్రయాణికులడిగితే సిబ్బంది తిరగబడుతున్నారనే ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. బస్సు దించేస్తున్న సంఘటనలూ ఉంటున్నాయి. నివారించాల్సిన అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. టిక్కెట్లు కూడా లేకపోవడంతో తనిఖీలు కూడా మానేసి కార్యాలయాలకు పరిమితమవున్నారు. ఫలితంగా అటు సంస్థకు,ఇటు ప్రయాణీకులకు ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో ఆర్టీసీకి 1016 బస్సులున్నాయి. అరకు, సింహాచలం వంటి ప్రాంతాలకు ప్రతి రోజూ వందలాది బస్సు సర్వీసులు తిరుగుతాయి. కాకినాడ, రాజమండ్రి, శ్రీకాకుళం, నర్శీపట్నం, విజయనగరం వంటి నగరాలకు నాన్‌స్టాప్ సర్వీసులు నడుపుతున్నారు. దాదాపు 500 బస్సులు సిటీ సర్వీసులున్నాయి. దీంతో ఆదాయం కూడా అదే స్థాయిలో వస్తోంది. సాధారణ రోజుల్లో రూ.70 లక్షల రాబడి ఉంటే ప్రస్తుతం వేసవి సెలవులు కావడంలో రోజుకి రూ.1.04 కోట్లు ఆదాయం వస్తోంది. సమ్మె ప్రారంభానికి ముందు రోజు వరకూ ఉన్న పరిస్థితి ఇది. కానీ ఇప్పుడలా లేదు. సమ్మె ఏడు రోజులుగా జరుగుతోంది. అధికారులు 150 అద్దె బస్సులను రంగంలోకి దించారు. అందుబాటులో ఉన్న టైనీ డైవర్లను వినియోగించారు. అవి ఏ మూలకు సరిపోకపోవడంతో ప్రైవేట్ బస్సులకు గేట్లు తెరిచారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లుగా పని చేయడానికి వస్తే రోజుకి రూ.1000 చొప్పున చెల్లిస్తామన్నారు. దీంతో నిరుద్యోగులు క్యూకట్టారు. వెయ్యి రూపాయలకు ఇంత మంది వస్తున్నారేమిటని అధికారులే ఆశ్చర్యపోయారు. కానీ వారి ఆలోచన తర్వాత అర్ధమైంది. ప్రయాణీకుల అవసరాలను సొమ్ము చేసుకోవడం ప్రారంభించారు. ఆర్టీసీ డిపోల్లోని బంకుల్లోనే తమ బస్సులకు ఆయిల్ కొట్టించుకుని మరీ తీసుకువెళ్లిన బస్సుల్లో సాయంత్రానికి రెండు మూడు వేల రూపాయలకు మించి ఆదాయం చూపించడం లేదు. సమ్మె వల్ల ఆర్టీసీకి రోజుకి రూ.85లక్షల నష్టం వాటిల్లుతోందని అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో 60 శాతం బస్సులను నడుపుతున్నామంటున్నారు. అంటే కోటి రూపాయల ఆదాయం వచ్చే ఆర్టీసీ 40 శాతం బస్సులను నడపకపోవడం వల్ల ఆ నలభై శాతం మాత్రమే ఆదాయం కోల్పోవాలి. ఈ లెక్కన రూ.60లక్షల ఆదాయం సమకూరాలి. కానీ వస్తున్నది కేవలం రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య మాత్రమే మిగతా రూ.40 లక్షలు ఏమవుతున్నట్టు.? ఈ ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం లేదు. ఎక్కువ వసూలు చేస్తే చర్యలు ‘‘కార్మికుల సమ్మె వల్ల ప్రైవేటు బస్సులను తాత్కాలిక సిబ్బందిని తీసుకున్నాం. అయితే టిక్కెట్లు కొట్టే పరిస్థితి లేదు. దీంతో వారికి టిక్కెట్టు ధరల చార్టు ఇచ్చాం. దాని ప్రకారమే తీసుకోమని చెప్పాం. ఎక్కువ వసూలు చేసినట్టు తెలిస్తే విధుల నుంచి తప్పిస్తామని,తర్వాత ఎప్పుడూ అవకాశం ఇవ్వమని కూడా హెచ్చరించాం. అంతకు మించి తనిఖీలు నిర్వహించడానికి ప్రస్తుతం అధికారులెవరూ అందుబాటులో లేరు. -వై.జగదీష్‌బాబు, ప్రాంతీయాధికారి, ఆర్టీసీ, విశాఖ -
రాష్ట్రవ్యాప్తంగా చెక్పోస్టులపై ఏసీబీ దాడులు
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా చెక్పోస్టులపై ఆదివారం ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. చెక్ పోస్టులలో అనాధికారంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేటు వ్యక్తులను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. చిత్తూరు జిల్లాలోని నరహరిపేట ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుపై ఏసీబీ దాడులు నిర్వహించిన నేపథ్యంలో అవినీతికి పాల్పడుతున్న 18మందిని అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి 47వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ తెలిపింది. అనంతపురం జిల్లాలోని పెనుకొండ ఆర్టీఏ చెక్‌పోస్టుపై ఏసీబీ దాడులు జరిపి 34వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అక్కడి అధికారులను ఏసీబీ విచారిస్తోంది. నెల్లూరు జిల్లాలోని తడ ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుపై దాడులు నిర్వహించగా భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ పేర్కొంది. ఆదిలాబాద్ జిల్లాలోని బోరజ్ చెక్పోస్టుపైనా, అలాగే శ్రీకాకుళం జిల్లాలోని ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నట్టు సమాచారం. -
‘సేవ’పై నిఘా
సాక్షి, గుంటూరు :‘స్వచ్ఛంద సేవ’ ముసుగులో ప్రజల నెత్తిన శఠగోపం పెడుతున్న సంస్థలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆర్ఎంపీ, హిమ్, కంట్రీక్లబ్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అక్రమ వసూళ్ల దందా తెలిసిందే. ఈ నేపథ్యంలో అటువంటి పేర్లతో కార్య కలాపాలు సాగిస్తున్న సంస్థల వివరాలను రాబట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు రెండు రోజుల కిందట ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు వచ్చాయి. ఇప్పటికే రెవెన్యూ సిబ్బంది క్షేత్ర స్థాయిలో స్వచ్ఛంద సంస్థలపై సర్వే ప్రారంభించగా, పోలీసు, ఇంటెలిజెన్స్ సిబ్బంది బోగస్ సంస్థలను గుర్తించే పనిలో ఉన్నారు.జిల్లాలో అధికమే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలను పరిశీలిస్తే హైదరాబాద్, ప్రకాశం జిల్లాల తరువాత స్థానం గుంటూరుదే కావడం గమనార్హం. ఇటీవల ఓ ప్రైవేటు సంస్థ చేసిన సర్వే ప్రకారం జిల్లా వ్యాప్తంగా 20,620 స్వచ్ఛంద సంస్థలు రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. అయితే కేవలం నాలుగువేలకు పైగా సంస్థలు మాత్రమే చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిని కొందరు స్వశక్తితో నడుపుతుండగా, మరికొందరు డొనేషన్ల ద్వారానే సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. 16,980 సంస్థలు ఎలాంటి కార్యకలాపాలు లేకుండానే రెన్యువల్‌కు పరిమితమయ్యాయి.శాఖల వారీగా... జిల్లాలో ఇప్పటి వరకు హెల్త్ అర్గనైజేషన్ పేరుతో 1100 స్వచ్ఛంద సంస్థలు, ఎడ్యుకేషన్, రీసెర్చ్ పేరుతో 5,578, కల్చరల్, రిక్రియేషన్ 2,116, సోషల్ సర్వీస్ 3,854, ఎన్విరాన్మెంట్ 47, హౌసింగ్ డెవలప్మెంట్ 3 వేలకు పైగా, లా అండ్ అడ్వకేట్ అండ్ పాలిటిక్స్ పేరుతో 8, ఇంటర్నేషనల్ స్థాయిలో 28, రిలీజియన్స్ పేరుతో 574, బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ అండ్ యూనియన్స్ 939, ఇవికాక మరో 5,907 సంస్థలు రిజిస్టర్ అయ్యాయని జిల్లా ప్రణాళిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఐటీ మినహాయింపునకు... స్వచ్ఛంద సేవా సంస్థలను నెలకొల్పే ఉద్దేశం ఏమైనప్పటికీ వాటిని స్వార ్థప్రయోజనాలకు వాడుకుంటున్న ఉదంతాలు అనేకం. మత సంస్థలు కాకుండా కొందరు రాజకీయ, పారిశ్రామిక రంగాల్లో పేరొందిన వ్యక్తులు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు ఎవరికివారు సంస్థలు నడుపుతున్నారు. వీరి స్నేహ బంధాలను ఉపయోగించుకుని డొనేషన్ల రూపంలో రసీదులు రాయించడం వాటిని ఐటీ రిటర్న్స్‌కు చూపడం పరిపాటిగా మారింది. కొన్ని సంస్థలు గ్రామాల్లో అమాయక ప్రజలను గ్రూపులుగా విభజించి వారితో వాయిదాల పద్ధతిలో డబ్బు కట్టించడం రెట్టింపు వస్తుందని నమ్మించడం, పర్యటన ప్యాకేజీలంటూ డబ్బులు కాజేయడం జరుగుతూ ఉంది. జిల్లాలో ఓ సంస్థ వెనుకబడిన వర్గాలకు ఇళ్లు నిర్మించి ఇస్తామంటూ ఒక్కో కుటుంబం నుంచి రూ.5 వేలు వసూలు చేసింది. ఆర్ఎంపీ, హిమ్ సంస్థల వ్యవహారం గుప్పుమనడంతో ఇళ్లు కట్టిస్తానన్న ప్రతినిధులు కూడా మాయమయ్యారు.రంగంలోకి పోలీస్, రెవెన్యూ యంత్రాంగం .. బోగస్ సంస్థల గురించి ఇప్పటికే గ్రామాల వారీగా రెవెన్యూ యంత్రాంగం సర్వే చేస్తుండగా, పోలీసు ఇంటెలిజెన్స్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. నరసరావుపేట డివిజన్లో మొత్తం 5,300 స్వచ్ఛంద సంస్థలు, తెనాలి డివిజన్లో 5,538 సంస్థలు రిజిస్టర్ కాగా, వీటిల్లో 1,284 సంస్థలు సేవలు అందిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం. మిగిలినవి కాగితాలకే పరిమితమని అధికారుల అభిప్రాయం.