ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్ సీఐ | ACB Entrapped excerise CI | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్ సీఐ

Published Thu, Sep 12 2013 1:58 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

ACB Entrapped excerise CI

 సూర్యాపేట, న్యూస్‌లైన్: ఎక్సైజ్ శాఖలో అతడిది ఉన్నత ఉద్యోగమే.. వేతనం కూడా ఐదు అంకెల్లో ఉంటుం ది.. అది కూడా చాలదని రెండు చేతులా సంపాదించాలని అనుకున్నాడు.. చివరకు లం చం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కా డు.. ఇదీ సూర్యాపేటలో బుధవారం  ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఎక్సైజ్ సీఐ స్టోరీ.. ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని జాగృతి వైన్స్ యజమాని ఢిల్లీ జంగారెడ్డిని ఎక్సైజ్ సీఐ జి.ప్రభాకర్ మూడు నెలలుగా డబ్బుల కోసం వేధిస్తున్నాడు. ప్రతి నెలా రూ.10వేలతో పాటు నాలుగు మద్యం బాటిళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. అంతేకాకుండా గతజూలైలో వైన్స్ రెన్యూవల్ చేసేందుకు గుడ్‌విల్‌గా రూ.40వేలు తీసుకున్నాడు. దీంతో పాటు స్థానిక ఎన్నికల సమయంలో మద్యం దొరకకపోవడంతో ఉన్న మద్యాన్ని ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్ముకోమ్మని సీఐ సలహా ఇచ్చాడు.
 
 కొంత మంది వైన్స్ యజమానులతో కుమ్మక్కై కావాలనే జాగృతి వైన్స్‌పై కేసు నమోదు చేయిం చాడు. ఈ కేసుతో వైన్స్ యజమానులకు సుమారు రూ.లక్షన్నర నష్టం వాటిల్లింది. అంతేగాక కేసును సరి చేయించినందుకు అదనంగా సీఐ మరో రూ.30వేలు తీసుకున్నాడు. వైన్స్ సీజ్ చేసిన సమయంలో యజమానికి సంబంధించిన పాన్‌కార్డు వైన్స్‌లో ఉంది. దానిని తీసుకుంటామని యజమాని సీఐని అడగ్గా రూ.3వేల విలువ చేసే రెండు మద్యం బాటిళ్లు కావాలని డిమాండ్ చేశాడు. ప్రతినెలా మామూళ్లు ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో యజమాని జంగారెడ్డి మూడు నెలల మాముళ్లు రూ.30వేలను వారం రోజుల్లో ఇస్తానని సీఐతో నమ్మబలికాడు.
 
 పట్టించాడు ఇలా..
 డబ్బుల కోసం వేధిస్తున్న సీఐ ప్రభాకర్‌ను ఏసీబీ అధికారులకు పట్టించాలని వైన్స్ యజ మాని జంగారెడ్డి నిర్ణయించుకున్నాడు. అందు లో భాగంగా ఇటీవల ఏసీబీ అధికారులను సంప్రదించాడు. శనివారం వారు సూర్యాపేటకు వచ్చి ఎక్సైజ్ సీఐ ప్రభాకర్‌కు జంగారెడ్డి డబ్బులు ఇచ్చేందుకు సిద్ధం చేశారు. కాగా సీఐ ప్రభాకర్ సెలవులో ఉండటంతో అప్పుడు వీలు పడలేదు. తిరిగి బుధవారం వచ్చి ఎక్సైజ్ కార్యాలయంలో సమీపంలో అద్దెకు నివాసముండే సీఐ ఇంటికి జంగారెడ్డి వెళ్లి వెయ్యి రూపాయల నోట్లు గల రూ.30వేలను సీఐకి అందజేశాడు.
 
 వాటిని సీఐ తన టేబుల్ డెస్క్‌లో భద్రపరుచుకున్నాడు. అప్పటికే సీఐ నివాసం చుట్టూ కాపు గాసిన ఏసీబీ అధికారులు వెంటనే సీఐ నివాసంలోకి వెళ్లి తనిఖీలు చేయగా జంగారెడ్డి ఇచ్చిన రూ.30 వేలు లభించాయి. దీంతో వైన్స్ యజమానిని నుంచి లంచం తీసుకున్న సీఐపై కేసు నమోదు చేసుకొని అతడిని అరెస్టు చేశారు. ఈ దాడిలో హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ ఎం.ప్రభాకర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు ముత్తిలింగం, సి.రాజు, ఇతర  సిబ్బంది ఉన్నారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే సెల్ నెంబర్లు 9440446140, 9440446142లలో ఫిర్యాదు చేయాలని  ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్ కోరారు.
 
 అక్రమ సంపాదనే ధ్యేయంగా..
 సూర్యాపేట ఎక్సైజ్ సీఐ జి.ప్రభాకర్ విధుల్లో చేరినప్పటి నుంచి అక్రమ సంపాదన వైపే మొగ్గు చూపినట్టు ఆరోపణలు వినిపిస్తున్నా యి. మే 2వ తేదీన సూర్యాపేట ఎక్సైజ్‌సీఐగా ప్రభాకర్ బాధ్యతలు చేపట్టారు. ఆనాటి నుంచి అక్రమంగా సంపాదించేందుకు ఎక్కువ ఆసక్తి కనబరిచినట్టు పలువురు మద్యం దుకాణ దారులు ఆరోపిస్తున్నారు.
 
 గత నాలుగు నెల లుగా సుమారు రూ.30లక్షలు అక్రమంగా సంపాదించాడని ఆరోపణలున్నాయి. ఇటీవల మ ద్యం దుకాణాల లెసైన్స్‌లను రెన్యూవల్ చేసినందుకు గాను సుమారు రూ.15లక్షలు మద్యం దుకాణాల యజమానుల నుంచి వసూళు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.  అదే విధంగా సూర్యాపేట నియోజకవర్గంలోని పలు మద్యం దుకాణాల్లో సదరు ఎక్సైజ్ సీఐ పెట్టుబడులు పెట్టినట్టు స్వయాన మద్యం దుకాణ దారులే పేర్కొం టుండడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement