ఇద్దరు పోలీసులపై ఏసీబీ కేసు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి పట్టణంలో ఇద్దరు పోలీసులపై ఏసీబీ కేసు నమోదరుుంది. పట్టణంలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ రామాంజనేయులు రూ.30వేలు లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఆయనతో పాటు అదే స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బాబునాయుడు కూడా ఏసీబీకి చిక్కారు. ఏసీబీ అధికారులు వీరిపై కేసు నమోదు చేశారు. ఇటీవల ఏర్పేడు ఎస్‌ఐ లంచం తీసుకుంటూ ఏసీబీకి వలలో పడిన విషయం తెలిసిందే. పోలీసుల అవినీతి బాగోతం చర్చనీయాంశంగా మారింది.
న్యాయవాది ఫిర్యాదు మేరకు...
పట్టణానికి చెందిన వంగపాటి వెంకటయ్య అనే న్యాయవాది ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో దాడులు నిర్వహించామనీ, ఈ దాడుల్లో ఎస్‌ఐ రామాంజనేయులు రూ.30వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడని ఏసీబీ తిరుపతి డీఎస్పీ శంకర్‌రెడ్డి తెలిపారు. దాడుల అనంతరం గురువారం డీఎస్పీ శంకర్‌రెడ్డి టూ టౌన్‌పోలీస్ స్టేషన్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ వంగపాటి వెంకటయ్య అనే న్యాయవాదికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న రెండు కేసులు (సీఆర్.నెంబర్ 95-2012,96-2012)కు ఎస్‌ఐ రామాంజనేయులు రూ.30వేలు డిమాండ్ చేశారని తెలిపారు. ఆ మేరకు న్యాయవాది ఫిర్యాదు చేయడంతో గురువారం మధ్యాహ్నం 12గంటల సమయంలో టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో దాడులు నిర్వహించి పట్టుకున్నామని చెప్పారు.
ఎస్‌ఐతో పాటు హెడ్‌కానిస్టేబుల్ బాబునాయుడు కూడా లంచం తీసుకున్నట్లు కెమికల్ లిక్విడ్ టెస్ట్ ద్వారా కూడా గుర్తించామని తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు చంద్రశేఖర్, సుధాకర్‌రెడ్డి, రామకిషోర్ పాల్గొన్నారని చెప్పారు. అధికారులు లంచాలకు పాల్పడుతుంటే ఏసీబీ అధికారుల నెంబర్లు 9440808112, 9440446190, 9440446193, 9440446138, 9440446191,9440446120 కు ఫోన్ ద్వారా సమాచారం అందివ్వాలని ప్రజలకు సూచించారు.