బాధితుడి నుంచి రూ.4వేల లంచం డిమాండ్
అచ్చంపేట, న్యూస్‌లైన్: బాధితుడి నుంచి రూ.నాలుగువేల లం చం తీసుకుంటూ బ ల్మూర్ వీఆర్వో గుజ్జుల వెంకటయ్య మంగళవారం ఏసీబీ అధికారులకు దొరికిపోయా డు. అతని విచారించి డబ్బును సీజ్‌చేశారు. ఏసీబీ హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ ఎం.ప్రభాకర్‌రెడ్డి వివరాలను వెల్లడించారు. బల్మూర్‌కు చెందిన పల్లె హర్షవర్దన్‌రెడ్డి తండ్రి పల్లె శేఖర్‌రెడ్డి 2012లో చనిపోయారు. అత ని తండ్రి పేర అదే గ్రామ సర్వేనెం.88, 89అ, 126అ, 127అలో 1.39 ఎకరాల భూమి ఉంది.
తనపేర విరాసత్ చేయాల్సిందిగా హర్షవర్దన్‌రెడ్డి బల్మూర్ తహశీల్దార్‌కు దరఖా స్తు చేసుకోగా, వీ ఆర్వో గుజ్జుల వెంకటయ్యకు రెఫర్ చేశారు. అయితే పట్టాపాసు పుస్తకాల కోసం బాధితుడు మూణ్నెళ్లుగా కార్యాలయం చుట్టూ తి రుగుతున్నాడు. పాసుపుస్తకాలు ఇంకా సిద్ధంకాలేదని సదరు వీ ఆర్వో చెబుతూవస్తున్నాడు. ఇదిలాఉండగా, గతనెల 25న వీ ఆ ర్వో వెంకటయ్య హర్షవర్దన్‌రెడ్డికి ఫోన్‌చేసి పట్టాపాసు పుస్తకం, టై టిల్‌డీడ్ కోసం రూ.ఐదువేలు కావాలని అడిగాడు. పాస్‌పుస్తకాలు కావాలని మరోసారి అడిగితే రూ.నాలుగువేలు కావాలని డిమాం డ్ చేశాడు. చేసేదిలేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయిం చాడు.
పథకం ప్రకారం మంగళవారం డబ్బులు తీసుకుని బల్మూర్‌కు రమ్మంటే హర్షవర్దన్‌రెడ్డి అక్కడికి వెళ్లాడు. అక్కడికి వెళ్లి ఫోన్‌చేయగా సదరు వీఆర్వో అచ్చంపేట ఆర్టీసీ బస్టాండ్‌కు రమ్మని కబురుపెట్టాడు. డబ్బులు తీసుకుంటుండగా వీఆర్వో వెంకట య్యను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పట్టాపాసు పుస్తకాలు, డబ్బును సీజ్‌చేశారు. వీఆర్వోను పట్టుకున్నవారిలో మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల ఇన్‌స్పెక్టర్లు తిరుపతిరాజు, సి.రాజు, సిబ్బంది ఉన్నారు.
ఏసీబీ వలలో వీఆర్వో
Published Wed, Jan 8 2014 5:30 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement