
చంద్రబాబుకు రూ.10 లక్షల చెక్కు అందజేసిన సమంత
హుదూద్ తుఫాన్ బాధితులకు హీరోయిన్ సమంత తన వంతు సాయం అందజేశారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో హుదూద్ తుఫాన్ బాధితుల సహాయార్థం హీరోయిన్ సమంత తన వంతు సాయం అందజేశారు. శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆయన కార్యాలయంలో సమంత కలిశారు.
తుపాను బాధితులను ఆదుకునేందుకు సమంత 10 లక్షల రూపాయల చెక్కును చంద్రబాబుకు అందజేశారు. సీఎం వ్యక్తిగత ప్రవేశమార్గం ద్వారా వెళ్లేందుకు సెక్యూరిటీ సిబ్బంది సమంతను అనుమతించడం విశేషం. పలువురు టాలీవుడ్ నటులు తుపాను బాధితులకు విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.