సాక్షి, ఆత‍్మకూరు : నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట‍్టణం బీసీ కాలనీకి చెందిన వెంకటరమణయ్య (47) అనే అగ్రిగోల్డ్ ఏజెంట్ బుధవారం మృతిచెందాడు. అగ్రిగోల్డ్ ఏజెంట్‌గా పనిచేసిన వెంకటరమణయ‍్య ప్రజల నుంచి సుమారు కోటిన‍్నర రూపాయల వరకూ కట్టించాడు. తాము కట్టిన డబ్బు వెనక్కి ఇవ్వాలని బాధితులు ఇంటిమీదకు వచ్చి వత్తిడి చేస్తుండడంతో మనోవేదనకు గురైన ఆయన అనారోగ్యానికి గురై కొద్ది రోజులుగా మంచం పట్టాడు. చెన‍్నయ్‌లోని ఒక ప్రభుత‍్వ ఆస‍్పత్రిలో చికిత‍్సపొందుతూ వెంకటరమణయ‍్య బుధవారం ఉదయం మృతిచెందాడు.
Comments
Please login to add a commentAdd a comment