పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని ఎయిర్‌టెల్ టవర్ ఎక్కి మరమ్మతులు చేస్తుండగా మధుప్రసాద్ (35) అనే ఉద్యోగి కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని ఎయిర్‌టెల్ టవర్ ఎక్కి మరమ్మతులు చేస్తుండగా మధుప్రసాద్ (35) అనే ఉద్యోగి కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన బుధవారం ఉదయం జరిగింది. ఎయిర్‌టెల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే మధుప్రసాద్ మృతిచెందాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పాలకొల్లు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద మధుప్రసాద్ బంధువులు ఆందోళన చేపట్టారు. పోస్టు మార్టం ను అడ్డుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తీసుకు వచ్చారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.