
నూకలవాడలో కిరాణా షాపులో మద్యం విక్రయిస్తున్న వ్యాపారి
విజయనగరం, బలిజిపేట: నూకలవాడలో కిరాణా షాపుల్లో మద్యం విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నా అధికారులు నిమ్మకునీరెత్తడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. లాక్‌డౌన్ సమయంలో కూడా వారికి మద్యం ఎలా వస్తుందని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బొబ్బిలి ఎక్సైజ్ సీఐ విజయకుమార్‌ను వివరణ కోరగా మండలంలో ఎక్కడా మద్యం విక్రయాలు జరగడం లేదని తెలిపారు.