కూల్చేందుకున్నారు.. కౌన్సెలింగ్‌కు లేరా?
హైదరాబాద్: స్థానికత సమస్యపై రేపు ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లనున్నట్టు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు. కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, రాజ్‌నాథ్ సింగ్ లను అఖిలపక్ష నాయకులు కలుస్తారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరి వల్లే ఎంసెట్ కౌన్సెలింగ్ ఆలస్యమవుతోందని ఆరోపించారు. బిల్డింగ్‌లు కూల్చేందుకు ఉన్న సిబ్బంది కౌన్సెలింగ్ నిర్వహించేందుకు లేరా అంటూ రావెల ప్రశ్నించారు.
స్థానికతపై తెలంగాణ సీఎ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని అంతకుముందు అన్నారు. రాష్ట్రాలు ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని అన్నారు.