local status
-
‘లోకల్ స్టేటస్’ మరో రెండేళ్లు పొడిగింపు
సాక్షి, అమరావతి : రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి విద్య, ఉద్యోగాల్లో స్థానిక(లోకల్) కోటా రిజర్వేషన్లు పొందాలనుకుంటున్న వారికి శుభవార్త. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేవారు స్థానిక హోదా(లోకల్ స్టేటస్) పొందడానికి గడువును కేంద్ర ప్రభుత్వం మరో రెండేళ్లు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేవారికి 2021 జూన్ ఒకటో తేదీ వరకూ స్థానిక హోదా పొందడానికి అవకాశం లభించనుంది. తెలంగాణలో నివాసం ఉంటూ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేవారికి ఇక్కడ లోకల్ స్టేటస్ పొందడానికి కేంద్ర ప్రభుత్వం మొదట మూడేళ్లు గడువు ఇచ్చింది. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 370(డి)లోని ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ను రాష్ట్రపతి ఆమోదంతో సవరించింది. దీనిప్రకారం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ రోజైన 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 1 వరకు లోకల్ స్టేటస్ సర్టిఫికెట్లు పొందవచ్చని 2016 జూన్ 16న కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. తదుపరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు గడువును మరో రెండేళ్లు పొడిగిస్తూ 2017 అక్టోబర్ 30న మరో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం గడువు 2019 జూన్ 1వ తేదీతో ముగిసింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తొమ్మిది, పదో షెడ్యూళ్లలోని సంస్థల ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల విభజన పూర్తికాకపోవడం వల్ల చాలామంది ఏపీ ఉద్యోగులు ఇప్పటికీ తెలంగాణలోనే ఉండిపోయారు. కొందరు ఉద్యోగులు ఏపీకి వచ్చినప్పటికీ తమ కుటుంబాలను హైదరాబాద్‌లోనే ఉంచారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలో సైతం హైదరాబాద్‌ను పదేళ్ల వరకూ ఉమ్మడి రాజధానిగా అప్పట్లో కేంద్రం పేర్కొంది. విద్యా సంస్థలు, ఉద్యోగ నియామకాల్లో స్థానిక కోటా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే వారికి రాష్ట్రంలో స్థానిక హోదా పొందడానికి గడువును మరో రెండేళ్లు పొడిగించాలంటూ రాష్ట్ర సర్కారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం రాష్ట్రపతి అనుమతి తీసుకుని లోకల్ స్టేటస్ పొందడానికి గడువును మరో రెండేళ్లు పొడిగించింది. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 (డి)లోని 1, 2 క్లాజ్‌లను సవరిస్తూ ‘ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థల(నియంత్రణ, ప్రవేశాలు) సవరణ చట్టం–2019’ చేసింది. ఇది ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల ప్రవేశాలకు స్థానికత హోదా కల్పనకు వర్తిస్తుంది. అలాగే ఉద్యోగాల్లో స్థానిక హోదాను మరో రెండేళ్లు పొడిగించడం కోసం ఇదే తరహాలో రాష్ట్రపతి ఆమోదంతో ‘ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్) అమెండ్మెంట్ ఆర్డర్–2019’ చేసింది. దీంతో తెలంగాణ నుంచి 2021 జూన్ 1వ తేదీలోగా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినవారు నిబంధనల ప్రకారం స్థానికత సర్టిఫికెట్లు తీసుకోవచ్చు. ఉన్నత విద్యా సంస్థల్లో, ప్రత్యక్ష ఉద్యోగ నియామకాల్లో స్థానిక కోటా కింద రిజర్వేషన్లు పొందవచ్చు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ ఎస్కే షాహి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక హోదా సర్టిఫికెట్ పొందడమెలా? తెలంగాణ నుంచి ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి స్థిరపడినవారు, ఇప్పుడు రావాలనుకుంటున్న వారు స్థానిక హోదా పొందాలంటే కొన్ని మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించాలి. ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి వచ్చేశాం కదా ఆటోమేటిగ్గా లోకల్ స్టేటస్ వర్తిస్తుందనుకుంటే పొరపాటే. 2021 జూన్ 1వ తేదీలోగా తహసీల్దార్ నుంచి లోకల్ స్టేటస్ సర్టిఫికెట్లు పొందిన వారికి మాత్రమే విద్య, ఉద్యోగాల్లో స్థానిక కోటా రిజర్వేషన్లు వర్తిస్తాయి.ఈ సర్టిఫికెట్ పొందగోరేవారు తెలంగాణలో నివాసం ఉంటూ ఇక్కడికి వచ్చినట్లు ఆధారాలతో దరఖాస్తు (ఫారం–1) సమర్పించాలి. గతంలో తెలంగాణలో నివాసం ఉన్నట్లు ఆధారాలుగా రేషన్ కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం లాంటివి జత చేయాలి. దీంతోపాటు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోఫలానా ప్రాంతంలో నివాసం ఉంటున్నామని, అందువల్ల లోకల్ స్టేటస్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ ఫారం–2 సమర్పించాలి. మీ–సేవా ద్వారా దరఖాస్తు చేసుకుంటే వారం రోజుల్లోగా సంబంధిత తహసీల్దార్ డిజిటల్ సంతకంతో కూడిన లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ జారీ చేస్తారు. -
తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన వారు స్థానికులే
వారికి సామాజిక రిజర్వేషన్లు వర్తింప జేయాలి: ఏపీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: విభజన తర్వాత తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వలస వచ్చిన వారి పిల్లలకు ఏపీ విద్యా సంస్థల(ప్రవేశాల నియంత్రణ) సవరణ ఉత్తర్వుల ప్రకారం స్థానికతతో పాటు ఆ రాష్ట్రంలో అమలవుతున్న సామాజిక రిజర్వేషన్లను కూడా వర్తింపజేయాలని ఏపీ సర్కారును హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ అనిస్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. విభజన చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి మూడేళ్లలోపు ఏపీకి వలస వెళ్లే వారిని స్థానికులుగా గుర్తించాలంటూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశించింది. ఏపీకి చెందిన తన తండ్రి ఉద్యోగరీత్యా తెలంగాణకు వచ్చారని, ఆ తర్వాత బదిలీపై ఏపీకి వెళ్లారని, అయితే ఎంసెట్ ప్రవేశాల సందర్భంగా తనను స్థానికేతరురాలిగా పరిగణిస్తూ బీసీ-ఏ కింద రిజర్వేషన్లు కల్పించేందుకు నిరాకరిస్తున్నారంటూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన బొడ్డేపల్లి జోత్స్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు విన్న ధర్మాసనం, జోత్స్నను స్థానికురాలిగా పరిగణించి ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశం కల్పించాలని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులను ఆదేశించింది. అలాగే రిజర్వేషన్లు వర్తింపజేయాలంది. -
ఏపీ ఎంసెట్‌పై ‘స్థానికత’ ప్రభావం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వారికి ఆ రాష్ట్ర స్థానికతను వర్తింపచేసేలా శుక్రవారం రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడంతో ఆ ప్రభావం ప్రస్తుతం జరుగుతున్న ఎంసెట్ కౌన్సెలింగ్‌పై పడుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ ఎంసెట్ రాసి కౌన్సెలింగ్‌కు హాజరవుతున్న తెలంగాణ ప్రాంత అభ్యర్థులు ఏపీకి వెళ్తే కనుక అక్కడి స్థానికత ఆధారంగా వారికి లోకల్ కోటాలో సీట్లు కేటాయిస్తారా? లేదా? అన్నది సందిగ్ధంగా మారింది. దీనిపై ఉన్నతాధికారవర్గాల్లోనూ తర్జనభర్జన సాగుతోంది. గతనెలలో జరిగిన ఏపీ ఎంసెట్‌లో తెలంగాణ(ఓయూ రీజియన్) నుంచి ఇంజనీరింగ్‌లో 17,548 మంది, మెడికల్ విభాగంలో 22,591 మంది పరీక్ష రాశారు. ఇంజనీరింగ్‌లో దాదాపు 1.60 లక్షల సీట్లుండగా, ఎంబీబీఎస్‌లో 3,900 సీట్లు, డెంటల్ కోర్సులో 1,300 సీట్లు ఉన్నాయి. వీటిలో 371 డీ ప్రకారం ఆయా రీజియన్ల పరిధిలోని సీట్లలో 85 శాతం స్థానికులకు, 15 శాతం సీట్లు మెరిట్లో ఓపెన్ టు ఆల్ ప్రాతిపదికన భర్తీచేయాలి. ఏపీ ఎంసెట్‌కు సంబంధించి 371 డీ ప్రకారం ఏపీలోని ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ, తెలంగాణలోని ఉస్మానియా వర్సిటీల రీజియన్లుగా ఉన్నాయి. ఈ లెక్కన హైదరాబాద్, తెలంగాణలో ఇంటర్ వరకు చదివి ఎంసెట్‌లో ఉత్తీర్ణులైన వారికి ఏపీలోని ఇంజనీరింగ్, మెడికల్ సీట్లలో 15 శాతం కోటా మాత్రమే వస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్‌లో ఉస్మానియా పరిధి నుంచి ఉత్తీర్ణులైన వారిని ఎంసెట్ అడ్మిషన్ల కమిటీ అధికారులు 15 శాతం ఓపెన్ కోటాకు అనుమతించేలా చర్యలు తీసుకున్నారు. ఆన్లైన్ సీట్ల కేటాయింపులో ఆమేరకు సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి కౌన్సెలింగ్‌ను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 1 నుంచి 35 వేల ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఆప్షన్ల నమోదు పూర్తిచేశారు. వీరిలో అత్యధిక శాతం మంది తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్‌కు చెందిన అభ్యర్థులున్నారు. ఈ తరుణంలో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వారికి స్థానికతను వర్తింపచేసే ఫైలుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో కౌన్సెలింగ్‌పై దాని ప్రభావం పడుతోంది. 85 శాతమా..? 15 శాతమా..? ప్రస్తుతం ఏపీ ఎంసెట్‌లో అర్హత సాధించిన ఓయూ రీజియన్ అభ్యర్థుల్లో అనేక మంది తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే అవకాశముంటుందని పలువురు పేర్కొంటున్నారు. అలా అయితే వారికి ఏపీ స్థానికత వర్తిస్తుంది. అపుడు ఎంసెట్‌లో వారికి 85 శాతం స్థానిక కోటాలో సీట్లు కేటాయిస్తారా? లేక ఇంటర్ హైదరాబాద్, తెలంగాణలో చదివినందున 15 శాతం స్థానికేతర కోటాలో సీట్లు కేటాయిస్తారా? అన్నది సందిగ్ధంగా మారింది. ఏపీకి వెళ్లే ఈ విద్యార్థులకు ఏ రీజియన్ పరిధిలో స్థానికత వర్తిస్తుందన్నది కూడా మరో ప్రశ్నగా ఉంది. ఎందుకంటే ఏపీలోని ఏయూ, ఎస్వీయూలు రెండు రీజియన్లుగా ఉన్నాయి. ఏయూ పరిధిలోని ఇంజనీరింగ్, మెడికల్ సీట్లలో ఎస్వీయూ పరిధిలో స్థానికత ఉన్నవారికి 15 శాతం ఓపెన్ కోటాలో మాత్రమే కేటాయింపులు చేస్తారు. అలాగే ఎస్వీయూ పరిధిలోని సీట్లలో ఏయూ పరిధి స్థానికత ఉన్నవారిని 15 శాతం సీట్లలో మాత్రమే అనుమతిస్తారు. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుకనుగుణంగా రాష్ట్రప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోవాలి. ఆ తరువాత తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వారికి ఏ రీజియన్‌కు సంబంధించిన స్థానికత వర్తిస్తుందో తేలాలి. అప్పటికి గానీ ఆయా అభ్యర్థుల స్థానికతపై ఒక స్పష్టత రాదు. ఇందుకు చాలా సమయం పట్టనుంది. ఉన్నత స్థాయిలో చర్చించాకే స్పష్టత.. ఏపీ ఎంసెట్‌కు సంబంధించి ఈనెల 22న మొదటి విడత కౌన్సెలింగ్ సీట్ల అలాట్‌మెంటు పూర్తవుతుంది. ఆలోగా ఈ వ్యవహారమంతా తేలదు. ఈ నేపథ్యంలో దీనిపై ఏంచేయాలా? అని అధికారులు ఆలోచనల్లో పడుతున్నారు. ఎంసెట్ అడ్మిషన్ల కమిటీ అధికారులు దీనిపై స్పందిస్తూ దీనిపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాలననుసరించి ముందుకు వెళ్తాం. దీనిపై మంత్రి గంటా శ్రీనివాసరావు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం అని వివరించారు. ఉన్నత స్థాయిలో చర్చించాకే దీనిపై ఒక స్పష్టత వస్తుంది అని పేర్కొన్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ రాష్ట్రపతి ఉత్తర్వులు రాకముందే ప్రారంభమైనందున ఆ ఉత్తర్వులు ఈ కౌన్సెలింగ్‌కు అమలు చేయాలా? లేదా అన్నది ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవలసి ఉందని వివరించారు. -
సర్టిఫికెట్లతో ఉద్యోగుల స్థానికత నిర్ధారణ
కమలనాథన్ కమిటీ నిర్ణయం ఉద్యోగుల సర్వీస్ రికార్డులతో పాటే పరిశీలన ఆప్షన్లు దుర్వినియోగం కాకుండా గట్టి చర్యలు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజనలో స్థానికతను నిర్ధారించడానికి సర్వీసు రికార్డులతోపాటు, ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించాలని కమలనాథన్ కమిటీ నిర్ణయించింది. ఆప్షన్ల విధానం దుర్వినియోగం కాకుండా చూసేందుకు అవసరమైన ఇతర చర్యలకూ సిద్ధమైంది. విభజన తేదీకి ముందు ఉద్యోగులు లేదా వారి కుటుంబసభ్యుల్లో దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న, అంగవైకల్యం ఉన్నట్లు నమోదైన వారినే పరిగణనలోకి తీసుకోవాలని, దీర్ఘకాలిక వ్యాధులపై మెడికల్ బోర్డుతో పరిశీలన చేయించాలని కూడా కమిటీ అభిప్రాయపడుతోంది. ఉద్యోగుల విభజనపై ఏర్పాటైన కమలనాథన్ కమిటీ బుధవారం తెలంగాణ సచివాలయంలో సమావేశమైంది. ఈ సమావేశానికి కేంద్ర ప్రభుత్వం తరఫున అర్చనావర్మ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుతో పాటు తెలంగాణ ఉన్నతాధికారులు రేమండ్ పీటర్, రామకృష్ణారావు, ఏపీ అధికారులు ఎల్వీ సుబ్రమణ్యం, డాక్టర్ పీవీ రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగుల స్థానికతను సర్వీసు రికార్డుల ఆధారంగా తనిఖీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి వాదించారు. మరోవైపు ఉద్యోగుల ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించాలని తెలంగాణ సీఎస్ సూచించారు. దీంతో ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకోవాలని కమిటీ నిర్ణయానికి వచ్చింది. ఉద్యోగుల విభజనకు సంబంధించి ఈ కమిటీ గత నెల 25న జారీ చేసిన మార్గదర్శకాలపై వంద వరకు అభ్యంతరాలు, సూచనలు వచ్చాయి. ఎక్కువగా 18(ఎఫ్) నిబంధనపై అభ్యంతరాలు వచ్చాయి. ఒక కేడర్‌లో స్థానికత ఆధారంగా సీనియర్లందరినీ భర్తీ చేశాక.. మిగిలిన వాటిని స్థానికతతో సంబంధం లేకుండా ఏ రాష్ర్టంలోని జూనియర్లతోనైనా భర్తీ చేయొచ్చని 18(ఎఫ్) నిబంధనలో ఉంది. దీనిపైనే ఎక్కువగా అభ్యంతరాలు రావడంతో స్వల్ప మార్పులు చేయడానికి కమిటీ నిర్ణయించింది. తప్పనిసరి ఆప్షన్స్ ఉన్న ఉద్యోగుల్లో భార్యాభర్తలు, ఒంటరి మహిళలు, వితంతువులు, విడాకులు తదితర అంశాలను దుర్వినియోగం చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఇక ఉద్యోగుల విభజన సెల్లో తెలంగాణ అధికారులకు భాగస్వామ్యం కల్పించనున్నారు. ఆంధ్రా సచివాలయానికి సంబంధించి మొత్తం సమాచారం సీజీజీ విభాగం నుంచి రానున్న నేపథ్యంలో.. దానికి డీజీగా ఉన్న తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిని కూడా ప్రత్యేక ఆహ్వానితుడిగా విభజన ప్రక్రియలో భాగస్వామిని చేయాలని సమావేశంలో నిర్ణయించారు. కాగా, చివరి గ్రేడ్ ఉద్యోగులైన అటెండర్లు, డ్రైవర్లు, లిఫ్ట్ ఆపరేటర్లు తదితరులను స్థానికత ఆధారంగా ఆయా రాష్ట్రాలకు కేటాయిస్తారు. ఈ ఉద్యోగులు ఆప్షన్స్ ఇస్తే ఆ ప్రకారమే విభజిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మొత్తం కేడర్ పోస్టులను ఒకట్రెండు రోజుల్లోనే ప్రభుత్వ వెబ్సైట్లో పెట్టనున్నారు. తుదకు ఖరారు చేసిన మార్గదర్శకాలు కేంద్ర హోం, న్యాయ శాఖల ద్వారా ప్రధాని ఆమోదం కోసం వెళతాయి. అక్కడ ఆమోదముద్ర పడగానే ఇరు రాష్ట్రాలకు కేడర్ పోస్టులను కేటాయిస్తారు. వీటి ఆధారంగా తుది మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగుల విభజన జరుగుతుంది. భౌగోళికంగా కచ్చితంగా ఉండాల్సిన పోస్టులను ఆయా రాష్ట్రాలకే కేటాయించనున్నారు. ఉదాహరణకు పోర్టులు, ఈఎస్ఐ సంస్థలు ఉన్న చోట మొత్తం ఉద్యోగులను ఆయా రాష్ట్రాలకే కేటాయిస్తారు. ఇక్కడ 58:42 నిష్పత్తిని పాటించరు. ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ తాత్కాలికంగా పూర్తయ్యాక ఏ ప్రభుత్వం ఎన్ని సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించడానికి అంగీకరిస్తుందో తెలుస్తుందని, దాని ఆధారంగా శాశ్వత విభజన చేయాలని కమలనాథన్ కమిటీ నిర్ణయించింది. ప్రస్తుతానికి ఈ విషయంలో ఇరు రాష్ట్రాలు ఎలాంటి ప్రతిపాదనలు చేయనట్లు సమాచారం. -
సర్వే స్థానికత కోసం కాదు: కేటీఆర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ రాష్ర్ట ప్రభుత్వం చేపట్టని సాహసోపేతమైన కార్యక్రమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పూనుకున్నదని, ఏ ఒక్కరినో లక్ష్యం చేసుకొని రాష్ర్టంలో సర్వే నిర్వహించడం లేదని తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు స్పష్టం చేశారు. వాస్తవ సమాచార సేకరణ కోసం మాత్రమే ఆగస్టు 19న సర్వే నిర్వహిస్తున్నామని, ఒకవర్గం మీడియా ప్రచారం చేస్తున్నట్లుగా స్థానికత నిర్థారణ లేదా ఒక ప్రాంతం వారిని లక్ష్యం చేయడం ఉద్దేశం కాదన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వచ్చే ఐదేళ్లు ప్రభుత్వ పథకాల అమలుకు సమగ్ర ప్రణాళికను తయారు చేయడానికి పూర్తి సమాచారం కోసం ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర అసమగ్రమైన సమాచారం ఉందని, దీనిస్థానంలో వాస్తవికతతో కూడిన పూర్తిస్థాయి సమాచారాన్ని ఈ సర్వే ద్వారా సేకరిస్తామన్నారు. -
తేడా వస్తే ఊరుకోం!
జిల్లాలో ఒక్క తప్పుడు పత్రం వచ్చినా తహసీల్దార్, కలెక్టర్ కూడా బాధ్యులే స్థానికత, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీపై సీఎం కేసీఆర్ హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: స్థానికత, కుల, ఆదాయ ధ్రువపత్రాల జారీలో ఏమాత్రం తేడా వచ్చినా సహించేది లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. ఒక జిల్లాలో ఒక్క తప్పుడు ధ్రువపత్రం వచ్చినా సంబంధిత తహసీల్దార్, కలెక్టర్ కూడా బాధ్యులేనని ఆయన స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటుందని... అలాగని ఏదైనా తేడా వస్తే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ఆర్థిక సహాయం అందిస్తామని మరోసారి స్పష్టం చేశారు. శుక్రవారం మంత్రులు, వివిధ శాఖల అధిపతులు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లతో హెచ్ఐసీసీలో జరిగిన ‘పకడ్బందీ సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వే’ సదస్సులో సీఎం కేసీఆర్ అధికారులకు మార్గ నిర్దేశం చేశారు. ‘‘ఇప్పటికే పలు రకాల సర్వేలు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు ఈ ఇంటింటి సర్వే ఎందుకని ప్రశ్నలు వస్తున్నాయి. ఈ సర్వే చేపట్టడానికి బలమైన కారణాలు ఉన్నాయి. గతంలో చేసిన సర్వేలన్నీ తప్పులతడకలు. కొన్నయితే వందశాతం తప్పు. జనాభా లెక్కలు, బహుళార్థ ప్రయోజన ఇంటింటి సర్వే, ‘సెర్ప్’, డీఆర్డీఏ సర్వే ఇలా ఏది చూసినా.. ఒకదానితో మరోదానికి పొంతన లేదు. గణాంకాలు ఒకేలా లేవు. ఆఖరుకు నెలనెలా ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నా... కచ్చితంగా ఎంతమంది ఉద్యోగులున్నారన్న వివరాలు లేకపోవడమనేది తలదించుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు చేసే సర్వే వివరాలు మండల అధికారుల నుంచి ముఖ్యమంత్రి వద్ద ఉండే కంప్యూటర్లో వరకూ ఒకే విధంగా ఉంటాయి. మారుమూల గ్రామంలో ఒక రైతు గురించి తెలుసుకోవాలంటే.. ఒక్క బటన్‌తో వివరాలు రావాలి. తొందరేమీ లేదు.. మీరు సమయం తీసుకుని చెప్పండి.. ఈ సర్వే ఒకేరోజు రాష్ట్రం మొత్తం జరగాలి. అందుకు రెవెన్యూ శాఖ నోడల్ ఏజెన్సీగా ఉండాలి. ఊహలు, కలల్లో జీవించడం వద్దు. వాస్తవ పరిస్థితుల్లో జీవిద్దాం. భేషజాలు లేకుండా, చిత్తశుద్ధితో పనిచేద్దాం..’’ అని అధికారులకు కేసీఆర్ సూచించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు పాత బకాయిలు రూ. 1,300 కోట్లు ఉన్నాయని, ఈ ఏడాదికి మూడు వేల కోట్లు కావాలంటున్నారని... ఇంత విచ్చలవిడిగా ఎందుకు ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ప్రభుత్వం మెడపై కత్తిపెట్టి బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్నారని, అయినా ప్రభుత్వం భయపడబోదని కేసీఆర్ స్పష్టం చేశారు. ‘ఇతర ప్రాంతాల విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీజు ఇవ్వబోమని, స్థానికతను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలదేనని సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చిందని చెప్పారు. ఆయన చెప్పిన ప్రధాన అంశాలు... రాష్ట్ర ప్రజలకు సంబంధించి స్థితిగతులు తెలియకుండా ప్రణాళికలు రూపొందిస్తే వ్యర్థమవుతాయి. పకడ్బందీ డాటాబేస్ ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు దళారీలపాలు కాకుండా అర్హులకే అందుతాయి. రేషన్‌కార్డులు, ఇళ్లు, పెన్షన్ల నిధులను దొంగలు దోచుకున్నారు. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 84 లక్షల కుటుంబాలు ఉంటే.. ప్రస్తుతం 86 లక్షల కుటుంబాలు అంటున్నాయి. రేషన్‌కార్డులు మాత్రం 1.07 కోట్లు ఉన్నాయి. మిగతా 22 లక్షల కార్డులు ఎక్కడ ఉన్నాయి? తెల్లరేషన్కార్డులతో విచ్చలవిడి అవినీతి జరుగుతోంది. అన్నింటికీ తెల్లరేషన్కార్డులతో అనుసంధానం పొరపాటు చర్య. రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వ పథకాల కింద 52 లక్షల ఇళ్లు కట్టారు. మళ్లీ కొత్తగా ఇళ్ల నిర్మాణం అవసరమా..? గ్రామాలకు వెళితే ప్రజలు ఇళ్లు కావాలంటున్నారు. మరి కట్టిన ఇళ్లు ఏమయ్యాయి? ప్రజాధనానికి ప్రభుత్వం ధర్మకర్త మాత్రమే. నిధులు దుర్వినియోగం కానీయొద్దు. ఇష్టానుసారం దానం చేయొద్దు. -
పత్రం ఇవ్వాలంటే.. వంశవృక్షం చూడాల్సిందే
ఆదాయ, కుల, స్థానిక ధ్రువపత్రాల జారీలో అత్యంత జాగ్రత్త వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సూచించారు. స్థానికత విషయంలో వంశవృక్షాన్ని చూడాల్సిందేనని, ఒక్క తప్పుడు ధ్రువీకరణ పత్రం కూడా ఇవ్వడానికి వీల్లేదని స్పష్టం చేశారు. తప్పుడు ధ్రువీకరణ పత్రం ఇస్తే దాన్ని జారీ చేసిన అధికారులే బాధ్యులు అవుతారని ఆయన హెచ్చరించారు. ఇక మీదట తెలంగాణలో మీసేవా కేంద్రాల ద్వారా ధ్రువీకరణ పత్రాల జారీని నిలిపివేసే అవకాశం కనిపిస్తోంది. ఇకపై కేవలం ఎమ్మార్వో ద్వారానే ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ప్రధానంగా ప్రభుత్వం తలపెట్టిన 'ఫాస్ట్' పథకం కోసం 1956 స్థానికతను ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణయించడంతో దానికి సంబంధించిన ధ్రువపత్రాలు అత్యంత కీలకంగా మారాయి. వీటి విషయంలోనే అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. -
ఏడేళ్ల విద్యార్హత ఆధారంగానే స్థానికత
-
ఏడేళ్ల విద్యార్హత ఆధారంగానే స్థానికత
ఏడేళ్ల విద్యార్హతల ఆధారంగానే స్థానికతను నిర్ణయించాలని కమలనాథన్ కమిటీ సూచించింది. ఈ మేరకు ఉద్యోగుల విభజన అంశానికి సంబంధించి తాము సూచించిన మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ వెబ్సైట్లో కమిటీ ఉంచింది. కేంద్రం ఆమోదం మేరకు 19 పేజీల మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెబ్సైట్లో ఉంచింది. ఉద్యోగులలో దంపతులు, ఒంటరి మహిళలకు ఆప్షన్లు ఉంటాయని, అయితే రిటైరయ్యే ఉద్యోగులకు మాత్రం ఆప్షన్లు లేవని అందులో తెలిపారు. ఆర్టికల్ 371 డి రెండు రాష్ట్రాల్లో కొనసాగుతుందని, గ్రూప్-4 ఉద్యోగులను పూర్తిగా స్థానికత ఆధారంగా విభజించాలని నిర్ణయించారు. ఏడేళ్ల విద్యార్హత ఆధారంగానే స్థానికత నిర్ణయిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. వికలాంగులకు, తీవ్రమైన వ్యాధులతో బాధపడేవారికి ఆప్షన్ సదుపాయం ఉంటుందని తెలిపారు. అలాగే, ఒక్కసారి ఆప్షన్ ఇస్తే మళ్లీ మార్చడం కుదరదని స్పష్టం చేశారు. విధివిధానాలపై అభ్యంతరాలు, సలహాలు ఉంటే ఆగష్టు 5 లోపు ఇవ్వాలని కమలానాథన్ కమిటీ కోరింది. వాటిని పరిశీలనకు తీసుకున్న తర్వాత మళ్లీ కేంద్రం తుది మార్గదర్శకాలను ఖరారు చేస్తుందని చెప్పారు. 1975 ఆర్డర్ సర్వీసు రికార్డ్ ఆధారంగా స్థానికతను గుర్తిస్తామన్నారు. తప్పుడు స్థానికత ధ్రువీకరణ ఇస్తే తీవ్రమైన కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు. -
కూల్చేందుకున్నారు.. కౌన్సెలింగ్‌కు లేరా?
హైదరాబాద్: స్థానికత సమస్యపై రేపు ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లనున్నట్టు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు. కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, రాజ్‌నాథ్ సింగ్ లను అఖిలపక్ష నాయకులు కలుస్తారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరి వల్లే ఎంసెట్ కౌన్సెలింగ్ ఆలస్యమవుతోందని ఆరోపించారు. బిల్డింగ్లు కూల్చేందుకు ఉన్న సిబ్బంది కౌన్సెలింగ్ నిర్వహించేందుకు లేరా అంటూ రావెల ప్రశ్నించారు. స్థానికతపై తెలంగాణ సీఎ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని అంతకుముందు అన్నారు. రాష్ట్రాలు ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని అన్నారు. -
కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు: రావెల
హైదరాబాద్: స్థానికతపై తెలంగాణ సీఎ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. ఆర్టికల్-371(డీ) ఉండగా కొత్త నిబంధనలు ఎలా తీసుకువస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. గవర్నర్, కేంద్రం తక్షణమే చొరవ తీసుకుని ఈ విషయంలో జోక్యం చేసకోవాలని విజ్క్షప్తి చేశారు. రాష్ట్రాలు ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని అన్నారు. విద్యార్థులకు ఆర్థిక సాయం కోసం ఉద్దేశించిన కొత్త పథకం ఫాస్ట్ (ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ) అమలుకు స్థానికత, ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని కేసీఆర్ తెలిపారు. 1956కు ముందు తెలంగాణలో నివాసం కలిగి ఉన్న వారికే దీన్ని వర్తింపచేస్తామని, ఈ దిశగా ఆర్థిక, సాంఘిక సంక్షేమ, విద్యా శాఖలు మార్గదర్శకాలు రూపొందిస్తాయని ఆయన వెల్లడించారు. -
స్థానికత ఆధారంగానే పంపిణీ!
అభిప్రాయం చెప్పాలని 2 రాష్ట్రాల సీఎస్‌లను కోరిన కమలనాథన్ 27న మరోసారి ఉద్యోగుల విభజన కమిటీ భేటీకి నిర్ణయం సాక్షి, హైదరాబాద్: స్థానికత ఆధారంగా ఉద్యోగుల పంపిణీకి వీలుగా సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించే విషయంలో ఇరు రాష్ర్ట ప్రభుత్వాల అభిప్రాయం చెప్పాలని కమలనాథన్ కమిటీ కోరింది. రాష్ర్ట విభజన నేపథ్యంలో ఉద్యోగుల పంపిణీపై ఏర్పాటైన రాష్ట్ర స్థాయి సలహా కమిటీ సమావేశం గురువారం సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా స్థానికత ఆధారంగానే పంపిణీ జరగాలన్న ఉద్యోగుల అభిప్రాయంపై చర్చ జరిగింది. అలా చేస్తే మిగులు ఉద్యోగులున్న చోట సూపర్ న్యూమరరీ పోస్టుల ఏర్పాటు, తక్కువ మంది ఉన్న చోట పదోన్నతులు కల్పించి ఆయా పోస్టుల భర్తీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సిద్ధం కావాల్సి ఉంటుందని కమిటీ చైర్మన్ కమలనాథన్ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఇరు రాష్ట్రాల అభిప్రాయం తెలుసుకుని ఈ నెల 27న జరిగే భేటీలో స్పష్టతనివ్వాలని ఉన్నతాధికారులకు కమిటీ సూచించింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించే పక్షంలో ఆ మేరకే కేంద్ర ప్రభుత్వానికి మార్గదర్శకాలు పంపేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కమలనాథన్ చెప్పారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతోపాటు కేంద్ర సిబ్బంది, శిక్షణా శాఖ కార్యదర్శి, అలాగే కమిటీ సభ్యులుగా ఉన్న ఇరు రాష్ట్రాల ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు నాగిరెడ్డి, డాక్టర్ పీవీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల పంపిణీపై గురువారమే పూర్తిస్థాయి మార్గదర్శకాలు ఖరారవుతాయని భావించినప్పటికీ... కమిటీ సభ్యులు పలు అంశాలపై ఏకాభిప్రాయానికి రాకపోవడంతో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తొలిసారి ఈ కమిటీ భేటీకి వచ్చినందున ఉద్యోగుల పంపిణీ విధానాన్ని ఈ సందర్భంగా వారికి వివరించారు. ఇరువురు ప్రధాన కార్యదర్శులు సమన్వయంతో ఏకాభిప్రాయానికి రావడానికి కొంత గడువు ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. దీంతో ఈ నెల 27న జరిగే సమావేశంలోనే మార్గదర్శకాల తుది నివేదిక సిద్ధంకానుంది. ఉద్యోగుల నుంచి సలహాలు, సూచనల కోసం ఇరు రాష్ట్రాల ప్రభుత్వ పోర్టల్స్‌లో ఆ మార్గదర్శకాలను అందుబాటులో పెట్టనున్నారు. అందిన సలహాలు, సూచనలపై సలహా కమిటీ మరోసారి సమావేశమై తుది మార్గదర్శకాలను ఖరారు చేస్తుంది. వాటినే కేంద్రం ఆమోదానికి పంపించనుంది. ఆ తర్వాతే ఉద్యోగుల శాశ్వత పంపిణీ జరుగుతుంది. ప్రస్తుతం దాదాపు తొమ్మిది వేలమందికిపైగా ఉద్యోగులను ఆర్డర్ టు సర్వ్ పద్ధతిలో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన సంగతి తెలిసిందే. కాగా, తాము రూపొందించే మార్గదర్శకాలు పూర్తి పారదర్శకంగా ఉంటాయని కమిటీ సభ్యుడొకరు వివరించారు. రెండేళ్లలో పదవీ విరమణ చేసే ఉద్యోగులు, భార్యాభర్తలు, కుటుంబ సభ్యుల్లో తీవ్ర అనారోగ్యం ఉన్నవారు, ఎస్సీ, ఎస్టీలు ఇచ్చే ఆప్షన్ల ప్రకారమే వారి పంపిణీ చేయాలనే కోణంలో చర్చ జరిగినట్లు సమాచారం. ఇక రాష్ట్ర కేడర్‌లో పంపిణీ అయ్యే అధికారులు, ఉద్యోగుల సంఖ్య దాదాపు 65 వేల వరకు ఉంటుందని తెలుస్తోంది. వీరిచ్చే ఆప్షన్లలో అన్నింటినీ ఆమోదించాలా.. లేదా? అన్న విషయాన్ని తర్వాతే నిర్ణయించనున్నారు. స్థానికతే ఆధారం కావాలి: టీజీవో సంఘం వినతి సర్వీసు రిజిస్టర్లో పేర్కొన్న స్థానికత ఆధారంగా ఉద్యోగుల కేటాయింపు ఉండాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కమలనాథన్ కమిటీకి విజ్ఞప్తి చేసింది. కొందరు అధికారుల గందరగోళ నిర్ణయాల వల్ల తెలంగాణ సిబ్బంది ఆంధ్రప్రదేశ్‌లో, ఆంధ్రా ప్రాంత సిబ్బంది తెలంగాణలో పనిచేసే పరిస్థితి నెలకొంద ని, ఇలా కాకుండా ఎక్కడివారక్కడే పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. గురువారం కమలనాథన్ కమిటీతో భేటీ అయిన అనంతరం టీజీవో సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ప్రతినిధులు మమత, రాజ్‌కుమార్ గుప్తా తదితరులు మీడియాతో మాట్లాడారు. సమస్య జటిలం కాకుండా ఇద్దరు ముఖ్యమంత్రులు చొరవ తీసుకుని, అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి ఎక్కడి ఉద్యోగులు అక్కడే పనిచేసేలా చర్యలు తీసుకోవాలనే విషయాన్ని కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్టు వారు వెల్లడించారు. -
ఎవరు లోకల్.. ఎవరు నాన్‌లోకల్!?
విద్యార్థుల స్థానికత నిర్ధారణలో గందరగోళం హైదరాబాద్: ఒక విద్యార్థి బీటెక్‌లో చేరాలంటే.. అతని ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం నుంచి గడిచిన ఏడేళ్లలో (ఇంటర్ నుంచి 6వ తరగతి వరకు) వరుసగా నాలుగేళ్లు ఎక ్కడ చదివితే అక్కడి విద్యాప్రవేశాల్లో లోకల్ అభ్యర్థిగా పరిగణిస్తారు. అదే ఆ ఏడేళ్ల విద్యాభ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్‌లో పూర్తి చేసి, తెలంగాణలోని కాలేజీలో బీటెక్‌లో చేరాలంటే 15 శాతం ఓపెన్ కోటాలో నాన్‌లోకల్ అభ్యర్థిగానే చేరాలి. ఇదీ ప్రస్తుతం విద్యా ప్రవేశాల్లో అమలు చేస్తున్న నిబంధన. పదేళ్ల పాటు ఇదే ఉంటుందని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం చెబుతోంది. అయితే నాన్‌లోకల్ అభ్యర్థిగానే తెలంగాణలో బీటెక్ పూర్తి చేసిన సదరు విద్యార్థి ప్రస్తుత నిబంధనల ప్రకారం ఎంటెక్‌లో చేరేందుకు వెళ్లేప్పుడు మాత్రం తెలంగాణలో లోకల్ అభ్యర్థి అవుతున్నాడు. అదెలాగంటే.. గడిచిన ఏడేళ్లలో (బీటెక్ నుంచి 9వ తరగతి వరకు) బీటెక్ కోర్సు కాలవ్యవధే నాలుగేళ్లు. వరుసగా ఆ నాలుగేళ్లు తెలంగాణలోనే చదివాడు కాబట్టి ఎంటెక్‌లో అతన్ని లోకల్ అభ్యర్థిగా చేర్చుకోవాల్సిందే. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం అదే. ఇప్పటివరకు జరిగిన ప్రవేశాలన్నీ అలాగే జరిగాయి. ఇలా అనేకమంది విద్యా సంస్థల్లో ప్రవేశాల విషయంలో నాన్‌లోకల్ నుంచి లోకల్ స్టేటస్‌కు మారుతున్నారు. బీటెక్, ఎంటెక్‌లే కాదు... ఒక్క బీటెక్‌లో మాత్రమే కాదు.. ఇతర ఇంజనీరింగ్, ఫార్మసీ, ఇతర డిగ్రీ కోర్సుల్లోనూ ఇలా చదువుతున్న వారు ఉన్నారు. పాఠశాల విద్యలో కొన్ని తరగతులు ఆంధ్రప్రదేశ్‌లో, మరికొన్ని తరగతులు తెలంగాణలో చదివిన వారు ఉన్నారు. తెలంగాణలో చదువుతున్న వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇలాంటి విద్యార్థులు అనేక మంది ఉన్నారు. మరి వారికి తెలంగాణ ప్రభుత్వం ఎంటెక్‌లో స్థానికులుగా గుర్తిస్తుందా? ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘ప్రస్తుతం ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని అమలు చేస్తాం. తెలంగాణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వర్తింపజేస్తాం. ఇతర రాష్ట్ర విద్యార్థులకు ఫీజులను తెలంగాణ ప్రభుత్వం ఇవ్వదు’ అని ప్రభుత్వం తమ విధానాన్ని స్పష్టం చేసింది. దీని ప్రకారం తెలంగాణలో బీటెక్ చదివే ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల ఫీజును అక్కడి ప్రభుత్వం భరిస్తే... అదే విద్యార్థులు పోస్టు గ్రాడ్యుయేషన్‌కు వ చ్చే సరికి తెలంగాణలో స్థానికులు అవుతున్నందున వారి ఫీజును తెలంగాణ ప్రభుత్వం భరిస్తుందా? లేదా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో చదువుతున్న వారు, భవిష్యత్తులో చదువుకోబోయే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విధానం ఎలా ఉంటుందనే ఆసక్తి తల్లిదండ్రుల్లో వ్యక్తం అవుతోంది. ఈ విషయంలో అధికారుల్లోనూ స్పష్టత లేదు. నిబంధనలు ఎలా ఉండాలన్న విషయంపై వారు తలలు పట్టుకుంటున్నారు. చర్చనీయాంశంగా స్థానికత.. రాష్ట్ర విభ జన నేపథ్యంలో స్థానికతకు ప్రామాణికతపై అధికారుల్లోనే సందేహాలు తలెత్తుతున్నాయి. తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపుల విషయంలో స్థానికత నిర్ధారణ అనేది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిబంధనలతో ఉత్తర్వులు జారీ చేస్తుందనే అంశంపై తల్లిదండ్రుల్లో ఆసక్తి నెలకొంది. క్వాలిఫైయింగ్ పరీక్షకు ముందు చదివిన ఏడేళ్ల విద్యలో నాలుగేళ్లను పరిగణనలోకి తీసుకుంటుందా? లేదా పాఠశాల విద్యను ఎక్కడ పూర్తి చేశారనే అంశం ఆధారంగా స్థానికతను నిర్ధారిస్తుందా? అనేది వేచి చూడాల్సిందే. మరోవైపు ఉద్యోగాల భర్తీ విషయంలో.. పాఠశాల విద్యలో నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు ఎక్కడ ఎక్కువ కాలం చదివితే ఆ ప్రాంతానికి వారిని లోకల్‌గా పరిగణనలోకి తీసుకోవడం గమనార్హం.