సాక్షి, తిరుపతి: జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు సమైక్యవాద శంఖం పూరించారు. సోమవారం అర్ధరాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగ, కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1350 ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. ముఖ్యంగా తిరుమలకు వెళ్లే 500 బస్సులు బస్టాండ్‌కే పరిమితం చేశా రు. ఆర్టీసీ బస్ డిపోలన్నీ బోసిపోయి కని పించాయి. ఆర్టీసీ కార్మికులతో పలు దఫాలు టీటీ డీ అధికారులు చేసిన చర్చలు ఫలించలేదు. ఫలి తంగా మంగళవారం తిరుమల ఘాట్‌రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. ఏ ఒక్క వాహనం కొం డెక్కకుండా ఆర్టీసీ, టీటీడీ ఉద్యోగులు అడ్డుకున్నా రు. భక్తులు కొండకు చేరుకోలేకపోయారు. బస్సుల్లేక పోవడంతో పెద్ద సంఖ్యలో భక్తులు నడకదారిలో తిరుమలకు చేరుకోవటం కనిపించింది. తిరుమలలో పనిచేసే అత్యవసర సేవలకు చెందిన ఉద్యోగ, కార్మికులను టీటీడీ ట్రాక్టర్లు, లారీ, టెంపోల్లో తరలించింది. శ్రీకాళహస్తీశ్వరాలయం, శ్రీవరసిద్ధి వినాయక ఆలయాలు బోసిపోయాయి.
కలెక్టరేట్ ఖాళీ
ఏపీ ఎన్‌జీవో పిలుపు మేరకు వివిధ ప్రభుత్వశాఖల ఉద్యోగులంతా మంగళవారం సమ్మెలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం,జేసీ, ఏజేసీ, పౌరసరఫరాలశాఖ కార్యాల యాలు బోసిపోయి కనిపించాయి. డీఆర్‌వో తప్ప ఏఒక్క అధికారి కార్యాలయానికి రాలే దు. ట్రెజరీ, సంక్షేమ శాఖ కార్యాలయాలు, డీఆర్‌డీఏ, డ్వామా, సమాచార శాఖ కార్యాలయాలన్ని ఖాళీగా కనిపించాయి. కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ తన క్యాంప్ కార్యాల యానికే పరిమితమయ్యారు. జిల్లాపరిషత్ ప్రాంగణానికి తాళాలు వేయటంతో పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్, పీఐయూ, సబ్ డివిజన్ కార్యాలయాలు, జెడ్పీ కార్యాల యాలు తెరుచుకోలేదు. విద్యాశాఖాధికారి కార్యాలయం ఖాళీగా కనిపించింది. హెచ్‌ఓడీలు మాత్రం హాజరై వెళ్లిపోయారు.
పడకేసిన పాలన
పల్లెల్లో పాలనా వ్యవహారాలను చూసే మండల పరిషత్ కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. ఉద్యోగులెవ్వరూ రాలేదు. ముఖ్యంగా విద్యార్థులు కుల, ఆదాయ సర్టిఫికెట్స్ కోసం వచ్చేవారు కూడా 13 రోజులుగా ప్రభుత్వ కార్యాలయాలవైపు కన్నెత్తి చూడటం లేదు. పంచాయతీ కార్యాలయాలు, పశు వైద్యశాలలకు తాళాలు వేశారు. జిల్లా వ్యాప్తంగా 27వేల మంది పైచిలుకు ఉద్యోగులు బంద్‌లో పాల్గొన్నారు. ఎస్సీడీసీఎల్ పరిధిలోని ఆరు జిల్లాల పరిధిలోని 10 వేల మంది ఉద్యోగలు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు.
మున్సిపల్.. మీ సేవలు బంద్
జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని సిబ్బంది మంగళవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల్లో మొత్తం 29 సేవలకు సంబంధించిన 3,500 మంది ఉద్యోగులు ఆయా కార్యాలయాల ఎదుట బైఠాయించి సమైక్య గళం వినిపించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, వీధిలైట్ల నిర్వహణలో పనిచేసే కార్మికులు విధుల్లో ఉన్నప్పటికీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో సమ్మె నుంచి ఈ మూడు సేవలను మినహాయించినట్టు ప్రకటించారు. ‘మీ సేవ’ ద్వారా అందించే 16 సేవలను స్తంభింపజేశారు.
సేవలు బంద్
Published Wed, Aug 14 2013 3:34 AM | Last Updated on Sat, Aug 18 2018 4:16 PM
Advertisement
Advertisement