టీటీడీ ఖాళీల భర్తీకి ప్రత్యక్ష పోరాటాలు
‘ఆప్స్’ రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి
తిరుపతి అర్బన్: టీటీడీలోని ఖాళీల భర్తీకి ఇక ప్రత్యక్ష పో రాటాలకు సిద్ధమవ్వాలని ఆంధ్రప్రదేశ్ అభివృ ద్ధి పోరాట సమితి(ఆప్స్) రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాజారెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక బాలాజీ కా లనీలోని కెరీర్ లాంచర్ సమావేశ హాలులో ఆప్స్, నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీల సంయుక్త ఆ ధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జిల్లాస్థా యి నిరుద్యోగ సదస్సుకు రాజారెడ్డి ముఖ్యఅతి థిగా హాజరై, మాట్లాడారు. టీటీడీలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 8వేల పోస్టులను త్వర లో భర్తీ చేస్తామని స్వయంగా టీటీడీ చైర్మనే ప్ర కటించి మూడు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ కూడా జారీ చేయకుండా తాత్సారం చేస్తుండడం వెనుక మ తలబేంటో ధర్మకర్తల మండలి, అధికారులు బ హిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆప్స్ రాష్ట్ర నాయకుడు క్యాన్ ఆంజనేయులు మాట్లాడుతూ టీటీడీలాంటి అతిపెద్ద ధార్మిక సంస్థలో కూడా ఉద్యోగాల భర్తీకి మీనమేషాలు లెక్కిస్తూ నిరుద్యోగుల ఆశలతో చెలగాటం ఆడడం సరి కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తర్వాత రెండో పె ద్ద ఆదాయ సంస్థగా పేరున్న టీటీడీలో శాశ్వత ప్రాతిపదికన కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగాలను భర్తీ చేయడం నిరుద్యోగులకు శాపమేనన్నారు. జిల్లా కన్వీనర్లు రుద్రగోపి, రంజిత్‌లు మాట్లాడుతూ ‘జాబు రావాలంటే బాబు రావాలన్న’ నినాదంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ విషయం గురించి పట్టించుకోకపోవడం దా రుణమన్నారు. ఈ సమావేశంలో నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌రెడ్డి, కార్యదర్శి బాలాజీ, రాష్ట్ర నాయకులు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.