Fill the gaps
-
అర్హతను బట్టి ఉద్యోగాలు
సాక్షి, సిటీబ్యూరో: వివిధ శాఖల్లో వికలాంగుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశామని, దరఖాస్తు చేసుకున్న వారి అర్హతల మేరకు ఆయా ఉద్యోగాల్లో నియమిస్తామని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో ఆయన ప్రజలనుంచి వినతి పత్రాలు స్వీకరించారు. మైనార్టీ కార్పోరేషన్ ద్వారా గత వారమే 367 మందికి రూ.2 లక్షల రుణానికి సంబంధించి లబ్ధిదారులను చేశామన్నారు. రూ.లక్ష లోపు రుణాలను త్వరలో మంజూరు చేస్తామన్నారు. రూ.2లక్షల నుంచి రూ.5 లక్షల వరకు దరఖాస్తు చేసుకున్నవారు ఇంకా రెండు నెలలు వేచి ఉండాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం బస్తీల వారిగా సమావేశాలు నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ అధ్వర్యంలో త్వరలో తేదీలు ఖరారు చేస్తామని, అప్పుడే దరఖాస్తు చేయాలని సూచించారు. ► బంధువుల కిరాణం షాపులో పని చేస్తుండగా బాలనేరస్తుడని అపోహపడి తన కుమారుడు దేవేందర్‌ను పోలీసులు తీసుకెళ్లారని ఆగాపురాకు చెందిన శ్యామ్ భవాన్ కలెక్టర్‌ను కోరారు. తన కుమారుడిన్ని అప్పగించాలని విజ్ఞప్తి చేయగా, ఛైల్డ్ ప్రొటెక్షన్ అధికారిని ఈ విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ► ఆసీఫ్‌నగర్‌కు చెందిన గీత తాను 2005లో ఇంటి కోసం రూ.1000 చెల్లించానని, ఇప్పటి వరకు ఇల్లు రాలేదని వినతి పత్రం ఇచ్చారు. స్పందించిన కలెక్టర్ డబ్బు చెల్లించిన వారు జిల్లాలో 35 వేల మంది ఉన్నారని, వారందరి జాబితాను డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ప్రభుత్వానికి పంపామన్నారు. తుది నిర్ణయం వెలువడే వరకు ఓపిక పట్టాలని సూచించారు. మీకోసం కార్యక్రమంలో ఇన్చార్జి ఏజేసీ అశోక్‌కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
టీటీడీ ఖాళీల భర్తీకి ప్రత్యక్ష పోరాటాలు
‘ఆప్స్’ రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి తిరుపతి అర్బన్: టీటీడీలోని ఖాళీల భర్తీకి ఇక ప్రత్యక్ష పో రాటాలకు సిద్ధమవ్వాలని ఆంధ్రప్రదేశ్ అభివృ ద్ధి పోరాట సమితి(ఆప్స్) రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాజారెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక బాలాజీ కా లనీలోని కెరీర్ లాంచర్ సమావేశ హాలులో ఆప్స్, నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీల సంయుక్త ఆ ధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జిల్లాస్థా యి నిరుద్యోగ సదస్సుకు రాజారెడ్డి ముఖ్యఅతి థిగా హాజరై, మాట్లాడారు. టీటీడీలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 8వేల పోస్టులను త్వర లో భర్తీ చేస్తామని స్వయంగా టీటీడీ చైర్మనే ప్ర కటించి మూడు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ కూడా జారీ చేయకుండా తాత్సారం చేస్తుండడం వెనుక మ తలబేంటో ధర్మకర్తల మండలి, అధికారులు బ హిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఆప్స్ రాష్ట్ర నాయకుడు క్యాన్ ఆంజనేయులు మాట్లాడుతూ టీటీడీలాంటి అతిపెద్ద ధార్మిక సంస్థలో కూడా ఉద్యోగాల భర్తీకి మీనమేషాలు లెక్కిస్తూ నిరుద్యోగుల ఆశలతో చెలగాటం ఆడడం సరి కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తర్వాత రెండో పె ద్ద ఆదాయ సంస్థగా పేరున్న టీటీడీలో శాశ్వత ప్రాతిపదికన కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగాలను భర్తీ చేయడం నిరుద్యోగులకు శాపమేనన్నారు. జిల్లా కన్వీనర్లు రుద్రగోపి, రంజిత్‌లు మాట్లాడుతూ ‘జాబు రావాలంటే బాబు రావాలన్న’ నినాదంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ విషయం గురించి పట్టించుకోకపోవడం దా రుణమన్నారు. ఈ సమావేశంలో నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌రెడ్డి, కార్యదర్శి బాలాజీ, రాష్ట్ర నాయకులు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.