శ్రీకాకుళం (పాత బస్టాండ్): శ్రీకాకుళం జిల్లాలో తొలిసారిగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) ఆదివారం పాతపట్నం పరిసరాల్లో పర్యటించారు. అనంతరం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనాను పూర్తిగా నిర్మూలించేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. అందుకే దేశంలో ఎక్కడా లేనివిధంగా అత్యధిక సంఖ్యలో పరీక్షలు చేయిస్తున్నట్లు వెల్లడించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
► శ్రీకాకుళం జిల్లాకు విదేశాల నుంచి 1,445 మంది వచ్చారు. వీరితో 4,271 మంది కాంటాక్ట్ అయ్యారు. ఢిల్లీ నుంచి 230 మంది, ముంబై నుంచి 488 మంది వచ్చారు.
► ఢిల్లీ నుంచి వచ్చిన ఒకరి ద్వారా వైరస్ వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళంలోనూ కోవిడ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నాం.
► గుజరాత్‌లో చిక్కుకున్న మత్స్యకారులను జిల్లాకు తీసుకొచ్చే ఏర్పాటు చేశాం. జిల్లాలో మరోసారి ఇంటింటా సర్వే చేయాలని ఆదేశించాం.
► సమీక్షలో స్పీకర్ తమ్మినేని సీతారామ్, మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, కలెక్టర్ జె.నివాస్, ప్రత్యేకాధికారి ఎంఎం నాయక్, ఎస్పీ ఆర్‌ఎన్ అమ్మిరెడ్డి, జేసీ డా.కె.శ్రీనివాసులు పాల్గొన్నారు.
కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు
Published Mon, Apr 27 2020 3:56 AM | Last Updated on Mon, Apr 27 2020 3:56 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment