సాక్షి, తాడేపల్లి : కోవిడ్ పరీక్షలో దేశంలోనే మొదటిప్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం కొనసాగుతుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమవేశంలో ఆయన మాట్లాడుతూ..ప్రతి మిలియన్‌కు 1,147 మందికి పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు రాష్ర్టంలో 54వేల 341 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, వారిలో 1016 మందికి పాజిటివ్ అని తేలిందని అన్నారు. కరోనా పరీక్షలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్‌వన్‌గా నిలిచిందని చెప్పారు.
కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్న అంబటి..ఇప్పటివరకు చంద్రబాబు కరోనా కట్టడికి ఒక్క మంచి సలహా కూడా ఇవ్వలేదని ద్వజమెత్తారు. సలహాల పేరుతో కరొనాను కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారాని ఆరోపించారు. ప్రభుత్వంపై విమర్శల పేరుతో రాజకీయం చేయాలనే దుర్భుద్ది తప్పా చంద్రబాబుకు మరొకటి లేదని మండిపడ్డారు. దీనికి ఆయన తాబేదారులు భజన చేస్తున్నారని అన్నారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ సీఎం జగన్ ముందుకెళ్తున్నారని, కరోనాను అరికట్టే యంత్రాంగంపై ప్రతిపక్షం రాళ్లు వేస్తుందని దుయ్యబట్టారు. ఢిల్లీ, తెలంగాణలో ఒకరకంగా, ఆంద్రప్రదేశ్‌లో మరోరకంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. బాబుకు భజన చెయొద్దని కన్నా లక్ష్మీనారాయణకు బీజేపీ అధిష్టానం మొట్టికాయలేసిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment