గుంటూరులో కాదు బీహార్లో ఉన్నట్టుంది | Ambati RamBabu takes on TDP | Sakshi
Sakshi News home page

గుంటూరులో కాదు బీహార్లో ఉన్నట్టుంది

Published Mon, Jul 14 2014 9:55 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

గుంటూరులో కాదు బీహార్లో ఉన్నట్టుంది - Sakshi

గుంటూరులో కాదు బీహార్లో ఉన్నట్టుంది

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీ చేస్తున్న దాడులను చూస్తుంటే బీహార్లో ఉన్నట్టుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. దారి దోపిడీ దొంగలకు టీడీపీ నాయకులకు తేడా లేదని విమర్శించారు.

టీడీపీ నాయకులు అరాచకం సృష్టించి ఎంపీటీసీలను ఎత్తుకెళ్లడం అప్రజాస్వామ్యమని రాంబాబు అన్నారు. ఎంపీటీసీ సభ్యులను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని చెప్పారు. కొందరు పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement