అనంతపురం ఎడ్యుకేషన్ : అంబేడ్కర్ యూనివర్సిటీ అడకత్తెరలో పోకచెక్కలా మారింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన నేపథ్యంలో మన రాష్ట్రంలో వర్సిటీ సేవలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో మన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు, అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఆందోళనకు గురువుతున్నారు. దీనిపై పలువురి స్పందనలు ఇలా ఉన్నాయి.
విద్యార్థులకు తీవ్ర నష్టం
మన రాష్ట్రంలో అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ సేవలు నిలిచిపోవడంతో వివిధ కోర్సులు చేస్తున్న విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. పిల్లల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని విద్యార్థులు నష్టపోకుండా చూడాలి.
-రామగంగిరెడ్డి, అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్
రాష్ట్ర విభజనతో దుష్ఫలితాలు
రాష్ట్ర విభజన నేపథ్యం విద్యారంగంపై దుష్ఫలితాలు చూపుతోంది. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అంబేడ్కర్ వర్సిటీని ఆశిస్తున్నారు. చేయని తప్పుకు విద్యార్థులు బలవుతున్నారు. గవర్నర్ జోక్యం చేసుకోవాలి మన రాష్ట్రంలో అంబేడ్కర్ దూరవిద్య విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి.
-డీ. మురళీధర్‌రావు, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎస్కేయూ
విద్యలో పక్షపాతం తగదు
విద్యలో పక్షపాత ఉండకూడదు. పద్మావతి యూనివర్సిటీలో రాయలసీమకు 20 శాతం, తెలంగాణకు 40, కోస్తాకు 40 శాతం సీట్లు కేటాయించారు. అంబేడ్కర్ యూనివర్సిటీలోనూ ఇదే విధానం అనుసరించాలి. విద్య అనేది అందరికీ సమానం
-డాక్టర్ ఎం. శ్రీరాములు, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎస్కేయూ
ప్రభుత్వ నిర్లక్ష్యంతో స్తంభించిన అంబేడ్కర్ వర్సిటీ సేవలు
Published Sun, Jul 26 2015 3:42 AM | Last Updated on Sun, Sep 3 2017 6:09 AM
Advertisement
Advertisement