
విశాఖ సముద్ర జలాల్లోకి చేరుకున్న యూ ఎస్‌ఎస్ యాంకరేజ్ (ఇన్‌సెట్) అమెరికా నౌకాదళ బృందానికి నేవీ బ్యాండ్ స్వాగతం
విశాఖసిటీ: అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన యూఎస్‌ఎస్ యాంకరేజ్ ల్యాండిగ్ ప్లాట్‌ఫాం డాక్ నౌక విశాఖకు ఆదివారం చేరుకుంది. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రానికి చేరుకున్న యాంకరేజ్ నౌకకు ఈఎన్‌సీ బ్యాండ్ బృందం సంప్రదాయ స్వాగతం పలికింది. కెప్టెన్ డెన్నిస్ జాకో నేతృత్వంలో అమెరికా నౌకాదళ బృందం నాలుగు రోజుల పాటు ఈఎన్‌సీలో పర్యటించనుంది. పర్యటనలో భాగంగా వృత్తిపరమైన పరస్పర అవగాహన చర్చలు, నౌకాదళ పరమైన ఒప్పందాలు, క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పలు అంశాలపై ఇరుదేశాల నౌకాదళాధికారులు చర్చించనున్నారు. భారత యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ రాజ్‌పుత్ తో కలిసి విన్యాసాల్లో పాల్గొన్న అనంతరం ఈ నెల 26న యూఎస్‌ఎస్ యాంకరేజ్ నౌక తిరుగుప్రయాణం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment