
'చంద్రబాబు పెద్ద గజదొంగ'
దేశంలో పెద్ద గజదొంగ ఎవరైన ఉన్నారంటే అది టీడీపీ అధ్యక్షడు చంద్రబాబు నాయుడేనని అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం అనంతపురంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంత మాట్లాడుతూ... గతంలో టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ను, ప్రస్తుతం విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి తెలుగు ప్రజలను వెన్నుపోటు పోడిచారని ఆరోపించారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబే ముఖ్య కారణమని అనంత విమర్శించారు.
వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 150 స్థానాలను కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి జోస్యం చెప్పారు. టీడీపీ, బీజేపీ పొత్తు అత్యంత ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు.