అనంతపురం న్యూటౌన్, న్యూస్‌లైన్: హైదరాబాద్‌లోని సీమాంధ్ర ఉద్యోగులు తమ ప్రాంతాలకు వెళ్లిపోవాల్సిందేనని, అందులో ఎలాంటి ఆప్షన్లు ఉండబోవంటూ వ్యాఖ్యానించిన టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఇండియన్ మైనార్టీ హక్కుల సమితి అధ్యక్షుడు కడియాల ఫకృద్దీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఆ సంఘం నేతలతో కలసి ఆయన వన్‌టౌన్ సీఐ గోరంట్ల మాధవ్‌ను కలిశారు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చిన కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభం కాకుండానే కేసీఆర్ భయాందోళనలు సృష్టిస్తున్నారన్నారు. హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడిన వారిని పొమ్మనేందుకు ఆయనకు ఏం అధికారం ఉందని ప్రశ్నించారు. ఒక ప్రాంతీయ పార్టీకి అధ్యక్షుడైన కేసీఆర్ ఈ విధమైన ప్రకటనలు చేస్తుంటే ప్రభుత్వం చేతులు ముడుచుకుని ఉండడం శోచనీయమన్నారు. తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రాజేసే విధంగా వ్యవహరిస్తున్న ఈయనపై తక్షణమే బ్లాక్‌మెయిలింగ్ కేసు నమోదు చేయాలని కోరారు. సీఐను కలిసినవారిలో నాయకులు షఫీ, హబీ, బండి జైపాల్, శ్రీనాథ్, నరసారెడ్డి, గోవింద్, ఆదామ్, కిరణ్, మసూద్‌వలి, లక్ష్మణ్ ఉన్నారు.
కేసీఆర్‌పై పోలీసులకు ఫిర్యాదు
Published Mon, Aug 5 2013 5:08 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement