మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి : ఈ ఏడాది ఖరీఫ్ ఆశాజనకంగానే ఆరంభమైంది. జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుం డటంతో గత రెండేళ్ల పంటనష్టం బారి నుంచి గట్టెక్కేందుకు రైతులు పంటసాగు చేపట్టారు. తీ రా అవసరానికి సరిపడా ఎరువులు దొరక్కపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డా రు.
ఈ ఖరీఫ్‌లో వరితో పాటు ప త్తి, మొక్కజొన్న తదితర రకాల పంటలను రై తులు సాగుచేశారు. అందుకు తగ్గట్టుగానే జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఎరువులు కోసం ప్రణాళికలు రూపొందించారు. సాగువిస్తీర్ణం పె రిగే అవకా శం ఉందని ముందుగానే భావించి అవసరమైన ఎరువులు సరఫరా చేయాలని నెలవారీ నివేదికలు పంపినా ఫలితం లేకపోయింది. దీంతో రైతన్నలు ఎరువులను బ్లాక్ మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి త లెత్తింది. కొందరు వ్యాపారులు యూరియాపై అదనంగా రూ.100 నుంచి 150 వరకు వసూలు చేస్తున్నారు. మిగిలిన ఎరువులపై నిర్ణయించిన ధర కంటే అదనంగా రూ.100 వసూలు చేస్తున్నా వ్యవసాయశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.
పెరగనున్న సాగు
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు జూరాల జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో ఆయకట్టులో దాదాపు లక్ష హెక్టార్లలో వరిపంట సాగు కావచ్చని అధికారులు అంచనా వే శారు. అలాగే ఆర్డీఎస్, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టుల ఆయకట్టులో పంటల సాగుకు నీళ్లిచ్చే అవకాశం ఉండటంతో సాగువిస్తీర్ణం భారీగా పెరగనుంది. ఆ మేరకు రైతులకు ఎరువులు దొరకని పరిస్థితి నెలకొంది.
జూలైలో 22 వేల 650 టన్నుల యూరియా అవసరం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు కోరగా, ఇందులో 16,120 టన్నులు మాత్రమే వచ్చింది. ఆగస్టులో 20,050 టన్నుల యూరియా కోసం ప్రణాళికలు పంపించగా ఇప్పటివరకు ఒక్క టన్ను ఎరువు కూడా రాలేదు. జిల్లాలో ఎరువుల కొరత లేదని అధికారులు చెబుతున్నా మార్కెట్లో మాత్రం దొరకడం లేదని రైతులు పెదవివిరుస్తున్నారు. అలాగే జిల్లాలో కొన్ని ప్రాంతాలకు ఎక్కువ..మరికొన్ని ప్రాంతాలకు తక్కువ కోటా కేటాయించడంతో ఎరువుల సమస్య ఉత్పన్నమవుతుంది. జిల్లాకు కేటాయించిన ఎరువుల్లో 50 శాతం మార్క్‌ఫెడ్‌కు, మరో 50 శాతం డీలర్లకు కేటాయిస్తున్నారు. మార్క్‌ఫెడ్‌కు కేటాయించిన ఎరువులను కూడా వ్యవసాయశాఖ అధికారులు సహకార సంఘాలకు కేటాయిస్తున్నారు. అయితే చాలాచోట్ల అక్కడి నుంచి బయట మార్కెట్‌కు తరలిపోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కొరత ఏర్పడటంతో రైతులు నిత్యం సహకార సంఘం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
పెరిగిన డిమాండ్
సకాలంలో వర్షాలు రావడం వల్ల మెట్ట ప్రాంతంలో సాగు చేసిన మొక్కజొన్న, పత్తిర, కంది, ఆముదం, జొన్నతో పాటు వివిధ రకాల కూరగాయలకు సంబంధించిన పంటలు సాగుచేశారు. అదేవిధంగా బోరుబావుల కింద సాగుచేస్తున్న వరి పైరుకు, మెట్ట ప్రాంతంలో సాగు చేసిన పంటలకు రైతులు ఒకే సారి ఎరువులు కొనుగోలు చేయాల్సి వస్తుండటంతో డిమాండ్ ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు ఎరువుల కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఎరువుల కొరతను అధిగమిస్తాం..
ఒక్కసారిగా వర్షం రావడం వల్ల ఎరువుల కొనుగోలుకు రైతులు వస్తుండటంతో కొంత మేరకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయినా కూడా కొరతను అధిగమించేందుకు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో మాట్లాడి తెప్పిస్తున్నాం. ఎరువులు వచ్చిన వెంటనే ఆయా సహకార సంఘాలకు కేటాయించి రైతులకు పంపిణీ చేయాలని ఆదేశాలిస్తున్నాం. ప్రతి రోజూ మానిటరింగ్ చేస్తూ రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నాం.
గతేడాది జూలై ఆఖరు నాటికి 33,070 మెట్రిక్ టన్నుల యూరియా రాగా ఈ ఏడాది జూలై ఆఖరుకు 46, 238 మెట్రిక్ టన్నులు వచ్చింది. రైతులు తక్కువ ధర అనే కారణంతో యూరియా వైపు మొగ్గు చూపుతుండటం వల్ల వాటికి కొంతమేర డిమాండ్ ఏర్పడింది.
- కెవి.రామరాజు,
వ్యవసాయశాఖ జేడీ
ఎరువూ..కరువే
Published Thu, Aug 8 2013 3:11 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
Advertisement
Advertisement