
సాక్షి, అమరావతి: దివంగత నేత, ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ప్రజారంజక పాలన అందించిన వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8వ తేదీని రైతు దినోత్సవంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి రైతు సంక్షేమానికి చేసిన సేవలు, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు గుర్తుగా ఆయన జయంతిని ఏటా రైతు దినోత్సవంగా పాటించనుంది.
వ్యవసాయం, రైతు సంక్షేమానికి ఆయన తీసుకున్న చర్యలు విప్లవాత్మకమైనవిగా వ్యవసాయ రంగ నిపుణులు చెబుతారు. కాగా, వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించడంపై రాష్ట్ర అగ్రి మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.