ఖమ్మం ఖిల్లా, న్యూస్‌లైన్: తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీలు శుక్రవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. నాలుగు రోజులుగా ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చౌక్‌లో నిరవధిక దీక్షలు చేపట్టినా అధికారులు స్పం దించలేదు. దీంతో ఆగ్రహించిన అంగన్‌వాడీలు శుక్రవారం కలెక్టరేట్ ముట్టడించారు. తొలుత జిల్లా నలుమూలల నుంచి సుమారు 500 మంది అంగన్‌వాడీలు ధర్నా చౌక్ వద్దకు చేరుకున్నారు.
సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో అక్కడి నుంచి కలెక్టరేట్ ముట్టడికి ర్యాలీగా వెళ్లారు. అప్పటికే పోలీసులు కలెక్టరేట్ గేట్లను మూసివేశారు. ఈ నేపథ్యంలో పలువురు సీఐటీ యూ నాయకులు, అంగన్‌వాడీలు గేటు దూకి లోపలికి వెళ్లేందుకు యత్నించారు. పోలీసు లు వారిని నియంత్రించలేకపోవడంతో ఒక్కసారిగా గేటు నెట్టుకుని లోపలికి దూసుకెళ్లారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని అంగన్‌వాడీ ఆయా ఒకరు స్పృహ కోల్పోయారు.
దీంతో ఆమెను అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలిం చారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు నర్సింహారావు, గణపతి, మధు, లిం గయ్య, విష్ణు, బ్రహ్మచారి, మోహన్‌రావు, నిర్మల్‌లు మాట్లాడుతూ అంగన్‌వాడీలు చాలిచాలనీ వేతనంతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి కనీస వేతనం రూ.10,000 చెల్లించాలని డిమాండ్‌చేశారు. ఎలాంటి షరతులు లేకుం డా సెంటర్ అద్దెలు, మెస్‌ఛార్జీలు, కట్టెల బిల్లులను ఇవ్వాలని లేనిచో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
దీక్షభగ్నం....
అంగన్‌వాడీలు కలెక్టరేట్ ముట్టడికి తరలివెళ్లడంతో ధర్నా చౌక్‌లో సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి కల్యాణం వెంకటేశ్వరరావు నాయకత్వంలో 17 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అక్కడున్న వారు తీవ్రంగా ప్రతిఘటించినప్పటికీ పోలీసులు వారిని జీపుల్లో, ఆటోల్లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ వారు చికిత్సకు సహకరించకపోవడంతో పోలీసులు అక్కడే ఉండి వైద్యులతో సెలైన్ పెట్టించి చికిత్స చేయిం చారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు అంగన్‌వాడీలు కలెక్టరేట్ నుంచి ధర్నాచౌక్‌కు చేరుకుని అక్కడ కూడా ఆందోళనకు సిద్ధమయ్యారు. దీక్షభగ్నానికి నిరసనగా నేడు (శనివారం) అన్ని మండలాకేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తున్నట్లుఅంగన్‌వాడీల యూనియన్ జిల్లా కార్యదర్శి కోటేశ్వరి తెలిపారు. అదేవిధంగా 17నుంచి 22 వరకు సమ్మె చేస్తామని వెల్లడించారు.
సమస్యల పరిష్కారానికి ఐసీడీఎస్ పీడీ హామీ
అంగన్‌వాడీల ఆందోళనకు ఐసీడీఎస్ పీడీ సుఖజీవన్‌బాబు స్పందించారు. ఆయన కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్దకు వచ్చి వారి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దీంతో అక్కడున్న వారు ఆందోళన విరమించడంతో ఆయన ధర్నా చౌక్ వద్దకు వెళ్లి అక్కడి వారితో మాట్లాడారు. అంగన్‌వాడీలు చేసిన డిమాండ్‌లు చాలా వరకు తన పరిధి లో లేవని, ఉన్న వాటిని 100 శాతం పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. మిగి లిన పాలసీ విషయాలు ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి తెలియపరుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీ యూ జిల్లా నాయకులు అమరనేని కృష్ణా, మర్రి బాబురావు, శ్రీనివాసరావు, పుల్లయ్య, అంగన్‌వాడీ యూనియన్ నాయకులు ప్రమీల, సుధారాధ, జ్యోతి, నాగమణి, శ్రీదేవి, రజియా పాల్గొన్నారు.
పోలీసుల తీరుపై ఉన్నతాధికారుల మండిపాటు...!
అంగన్‌వాడీల కలెక్టరేట్ ముట్టడి సందర్భంగా పోలీసులు అనుసరించిన తీరుపై జిల్లా ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. భారీ సంఖ్యలో అంగన్‌వాడీలు వస్తున్నారని తెలిసినా తగిన విధంగా బందోబస్తు ఏర్పాటు చేసుకోకపోవడంతో పోలీసులపై కలెక్టరేట్‌లోని ఉన్నతాధికారి ఒకరు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. 500 మంది మహిళలు వస్తుంటే కేవలం ఒకరిద్దరు మహిళా పోలీసులను మాత్రమే ఏర్పాటు చేయడం, పైగా సర్కిల్ స్థాయి అధికారి అక్కడ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
మరోవైపు ముట్టడి సమయంలో అప్పలనర్సింహాపురం గ్రామానికి చెందిన అంగన్‌వాడీ ఆయా సుజాత స్పృహ కోల్పోయినప్పటికీ ఒక్క మహిళా పోలీసు కూడా అందుబాటులోకి లేకపోవడంతో పలువురు పోలీసుల తీరుపై మండిపడ్డారు.
కలెక్టరేట్
Published Sat, Feb 15 2014 2:45 AM | Last Updated on Thu, Mar 28 2019 5:23 PM
Advertisement
Advertisement