అంగన్‌వాడీ హెల్పర్ మృతి
గుర్తు తెలియని వాహనం ఢీకొని..
మృత దేహంతో మహిళల ఆందోళన
బీర్కూర్, న్యూస్‌లైన్ :
నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలంలోని బొమ్మన్‌దేవ్‌పల్లి చౌరస్తా వద్ద సోమవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని అంగన్‌వా డీ హెల్పర్ పార్వతి రెడ్డి (35) మృతి చెందింది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఆందోళనలో పా ల్గొని వచ్చిన పార్వతి గ్రామంలోకి వెళ్లేందుకు రాత్రి 11 గంటల ప్రాంతంలో వ్యాను దిగింది. రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే ఆమె ను 108 అంబులెన్స్‌లో జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొద్ది సేపటికే పార్వతి మృతి చెందింది. తమతో ఆందోళనలో పాల్గొన్న పార్వతి ఉదయం శవమై గ్రామానికి తిరిగి రావడంతో తోటి అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు బోరున విలపించారు.
పార్వతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బొమ్మన్‌పల్లి చౌరస్తా వద్ద శవం తో పాటు రాస్తారోకో నిర్వహించారు. పార్వతి మృతికి కారణమైన గుర్తు తెలియని వాహనాన్ని పోలీసులు పట్టుకోలేక పోయారని నిరసన వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన రాస్తారోకో వల్ల బాన్సువాడ-నిజామాబాద్ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. మృతురాలికి భర్త, కూతురు, కుమారుడు ఉన్నారు. ఆందోళనలో సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకటరాములు, సీఐటీ యు జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు, సీఐటీయు నాయకుడు రవీందర్‌గౌడ్, సీపీఎం బాన్సువాడ ఇన్‌చార్జి యాదగిరి గౌడ్, మహిళా నేతలు నూర్జహాన్, చుక్కమ్మ, భారతి, సు వర్ణ, జమున, ఝాన్సీ, సుజాతలతో పాటు బీర్కూర్, వర్ని, బాన్సువాడ, నిజాంసాగర్, పిట్లం మండలాలకు చెందిన అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.