కలెక్టరేట్, న్యూస్‌లైన్: అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మెకు దిగుతామని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. భిక్షమయ్య డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్,హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ)జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంగన్‌వాడీ ఉద్యోగుల పని గంటలు పెంచి.. వేతనాలు పెంచకపోవడం శ్రమదోపిడేనన్నారు. ప్రభుత్వం.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించట్లేదని, ఉద్యోగ భద్రత అంటే ఉద్యోగం లేకుండా చేస్తోందని పేర్కొన్నారు.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు సక్రమంగా వినియోగించకుండా ఐకేపీ, సీడీఆర్ స్వచ్ఛంద సంస్థలకు అప్పగించడం మోసపూరితమన్నారు. అంగన్‌వాడీలను ఐసీడీఎస్ ఉద్యోగులుగా గుర్తిస్తూ కనీస వేతనం రూ.10వేలు ఇవ్వాలని, వంటకు సరిపడా గ్యాస్‌ను సబ్సిడీతో ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పాలకులకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. సీఐటీయూ కరీంనగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎడ్ల రమేశ్, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రమాదేవి, నాయకురాల్లు భాగ్యలక్ష్మి, లలితామేరీ, పద్మశ్రీ, శారద, హసీనా, సల్లా వరమ్మ తదితరులు పాల్గొన్నారు.
పోరాటానికి అండగా ఉంటాం: సింగిరెడ్డి
అంగన్‌వాడీల దీక్షకు వైఎస్సార్సీపీ జిల్లా నాయకులు సంఘీభావం తెలిపారు. వీరి పోరాటానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరారు. పార్టీ జిల్లా కన్వీనర్ సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎస్సీసెల్ జిల్లా కన్వీనర్ అక్కెనపెల్లి కుమార్, పార్టీ నాయకులు సొల్లు అజయ్‌వర్మ, జూపాక సుదర్శన్, వరాల శ్రీనివాస్, ఎడ్ల సురేందర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, శ్రావణ్ తదితరులు ఉన్నారు.
స్పందించకుంటే నిరవధిక సమ్మె
Published Fri, Feb 7 2014 4:38 AM | Last Updated on Sat, Sep 2 2017 3:24 AM
Advertisement
Advertisement