సాక్షి, మంచిర్యాల : జిల్లాలో పశువైద్యం అందని ద్రాక్షగా మారింది. మూడేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం పశు వైద్యశాల భవన నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేస్తున్నా పశుసంవర్ధక, పంచాయతీ రాజ్ అధికారుల సమన్వయ లోపంతో నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. మరోవైపు పశువైద్యశాలల భవన నిర్మాణాల కోసం ఏటా ప్రతిపాదనలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు సుమారు 40 ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కేవలం మంచిర్యాల డివిజన్ నుంచి ర్యాలీగడ్పూర్(మంచిర్యాల) నుంచి ఒకటి, సిర్పూర్(టి), జన్నారం, వేమనపల్లి, కోటపల్లి, బెజ్జూర్, కౌటాల మండలాల నుంచి రెండు చొప్పున, ఆసిఫాబాద్ మండలం నుంచి 4 ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపినట్లు ఆ శాఖ మంచిర్యాల డివిజన్ అసిస్టెంట్ డెరైక్టర్ కుమారస్వామి తెలిపారు.
మూడేళ్లుగా నిధులు మంజూరు
జిల్లాలో పశువైద్య కేంద్రాలు, గ్రామీణ పశువైద్యశాల లు వంద వరకు ఉన్నాయి. వీటితోపాటు ఆదిలాబా ద్, చెన్నూర్, లక్సెట్టిపేట, ఆసిఫాబాద్, నిర్మల్ తాలు కా కేంద్రాల్లో పెద్ద ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో చా లా వైద్యశాలలు ఏళ్ల తరబడి అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఇంకొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. పలు ప్రాంతాల్లో వైద్యశాలలకు అద నపు భవనాలు అవసరమున్నాయి. దశాబ్దకాలంలో భవన నిర్మాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏనాడూ నిధులు విడుదల చే యలేదు. దీంతో సగానికి పైగా గ్రామాల్లో పశువైద్యం అందని ద్రాక్షలా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషణ, పాడిపరిశ్రమకు అనుకూల వాతావరణం ఉ న్నా భవనాలు, మౌలిక వసతులు లేకపోవడాన్ని గు ర్తించిన కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
2012-13 ఆర్థి క సంవత్సరం నుంచి నాబార్డు కింద గ్రామీణ మౌలిక అభివృద్ధి నిధి(ఆర్‌ఐడీఎఫ్) - 14, 18, 19 పథకం ద్వారా భవనాలు మంజూరు చేస్తూ వస్తుంది. 2012-13లో ఆర్‌ఐడీఎఫ్ -14 కింద 8 భవనాలు, 2013-14 ఆర్‌ఐడీఎఫ్ 18 కింద 18 భవనాలు మంజూరు చేసిం ది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ఆర్‌ఐడీఎఫ్-19 కింద 34 భవనాలు మంజూరు చేసింది. వీటితోపాటు ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కింద గిన్నెదరి, సి ర్పూర్(యు), తిర్యాణి, కెరమెరిలో నూతన భవనాలు మంజూరు చేసింది. రూ.16 లక్షలతో ఒక్కో భవన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది.
నిర్మాణాలకు గ్రహణం
పశుసంవర్ధక శాఖకు భవనాలు మంజూరు చేసిన ప్ర భుత్వం వాటి నిర్మాణ బాధ్యతను పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగానికి అప్పగించింది. కానీ పలుచో ట్ల ఆ విభాగం అధికారుల అలసత్వంతో నిర్మాణ పను లు మందకొడిగా సాగుతున్నాయి. 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది భవన నిర్మాణాల కోసం రూ.1.28 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో దాదాపు అన్ని పూర్తయ్యాయి. గతేడాది జిల్లాకు 18 భవనాల కోసం రూ. 2.88 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు రెండు భవనాలు నిర్మాణానికి నోచుకోలేదు. ఏ డు భవనాలు బేస్‌మెంట్ స్థాయిని దాటలేదు. మూడు భవనాలు స్లాబ్ లెవల్‌లో ఉంటే, మిగిలినవి గోడల వరకు పూర్తయ్యాయి. చెన్నూరు మండలం ఆస్నాద్‌లో భూ వివాదం కారణంగా భవన నిర్మాణ పనులు ప్రా రంభం కాలేదు.
కుంటాల మండలం కల్లూరులోనూ పనులు ప్రారంభ కాలేదు. ఇదిలావుంటే.. ఈ ఆర్థిక సంవ త్సరం కేంద్రం ఆర్‌ఐడీఎఫ్-19 కింద మరో 34 భవనాలు మంజూరు చేసింది. దీనికి అధికారులు టెం డర్ పిలిచారు. మరోపక్క.. త్వరలోనే ఎన్నికల నోటిఫికెషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఒకవేళ నోటిఫికేషన్‌లోగా పనులు ప్రారంభించకపోతే ఈ భవన నిర్మాణాలకు బ్రేక్ పడే అవకాశముంది. మంచిర్యాల డివిజన్ పీఆర్ ఇంజినీరింగ్ విభాగం ఈఈ మధుసూదన్ వివరణ ఇస్తూ ‘సాధ్యమైనంత త్వరలో భవన నిర్మాణాలు పూర్తి చేసి.. పశుసంవర్ధక శాఖకు అప్పగిస్తామని చెప్పారు.
పునాదులకే పరిమితం
Published Sat, Feb 22 2014 2:15 AM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM
Advertisement
Advertisement