భీకరి | Another farmer killed in the attack elephants | Sakshi
Sakshi News home page

భీకరి

Published Sat, Dec 20 2014 2:03 AM | Last Updated on Thu, Jul 11 2019 6:30 PM

భీకరి - Sakshi

భీకరి

ఏనుగుల దాడిలో మరో రైతు మృతి
శాశ్వత నివారణ చర్యలు శూన్యం..!

 
పలమనేరు : మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో అటవీ సమీప ప్రాంత గ్రామాల్లో సాగులోని పంటలకే కాకుండా, ప్రజలకు కూడా ఏనుగుల దాడులతో రక్షణ లేకుండా పోయింది. ఆంధ్రా-కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో ఉన్న గ్రామాల ప్రజలకు దశాబ్దాలుగా కష్ట, నష్టాలు తప్పడం లేదు. పంటలతో పాటు గుడుపల్లె, వి.కోట, తాజాగా గురువారం రామకుప్పం మండలంలో అటవీ ఉద్యోగి ప్రాణా లు కోల్పోయాడు. అవే ఏనుగులు శుక్రవారం వి.కోట మండల సరిహద్దులో తమిళనాడు రాష్ట్రం గుడియాత్తం తాలూకా పేర్నంబట్ మజారా చారగల్లు గ్రామానికి చెందిన దొరస్వామి నాయుడుపై దాడిచేసి చంపేశాయి. ప్రభుత్వం శాశ్వత నివారణ చర్యలు తీసుకోవడంలో అలక్ష్యంగా వ్యవహరించడమే ఈ ఘటనలకు ప్రధాన కారణమని భావిస్తున్నారు.
 
సోలార్ ఫెన్సింగ్ అంతే..!

ఏనుగులను నియంత్రించడానికి 1984లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చురీ వల్ల ప్రయోజనం కనిపించడం లేదు. రూ.లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సోలార్‌ఫెన్సింగ్ నిర్వహణను అధికారులు మరిచారు. దీంతో పంటలకే కాదు.. మనుషులకు కూడా రక్షణ లేకుండా పోయింది. పలమనేరు, కుప్పం పరిధిలోని కౌండిన్య అభయారణ్యం 250 కి.మీ వ్యాపించి ఉంది. ఇందులో 36 ఏనుగులున్నట్లు అటవీశాఖ చెబుతోంది. ఇవి గుంపులుగా విడిపోయి సంచరిస్తున్నాయి. అడవిని దాటి బయటకు రాకుండా ప్రభుత్వం బంగారుపాళ్యం మండలం నుంచి కుప్పం వరకు 230 కి.మీ మేర సోలార్‌ఫెన్సింగ్‌ను రెండు దఫాలుగా ఏర్పాటు చేసింది. ఇంకా 40 కి.మీ మేర ఫెన్సిం గ్ ఏర్పాటు చేయాల్సి ఉంది.  పలుచోట్ల ఫెన్సిం గ్ ఇప్పటికే దెబ్బతింది.  దీనిని పర్యవేక్షించేం దుకు లైన్ వాచర్లను ఏర్పాటు చేసినా  ఫలితం లేదు.

మూడు రాష్ట్రాల కారిడార్ ఎప్పుడో ?

ఏనుగుల సమస్యకు మూడు రాష్ట్రాల్లో కారిడార్ నిర్మాణం ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. కర్ణాటకలోని బన్నేరుగట్ట, తమిళనాడులోని క్రిష్ణగిరి, హోసూరు, కావేరిపట్నం తదితర ప్రాంతాల నుంచి కౌండిన్యలోకి తరచూ   ఏనుగులు రావడంతోనే రైతులకు ఎక్కువ నష్టం వాటిల్లుతోంది. శాశ్వత పరిష్కారంలో భాగంగా మూడు రాష్ట్రాల్లోని అడవిలో ఓ కారిడార్ నిర్మించేందుకు స్థానిక అధికారులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైల్డ్ అనిమల్ ప్రొటెక్ట్‌కు నివేదిక పంపినా పనులు ముందుకు సాగలేదు. ఏనుగుల సంరక్షణ కోసం అడవుల్లో నీటి కుంటలు, షెల్టర్ల పనులు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. మరోవైపు కందకాలు (ఎలిఫెంట్ ఫ్రూఫ్ ట్రెంచెస్) చేపడితేగానీ సమస్య పరిష్కారమయ్యేలా లేదు.  
 
 19పీఎల్‌ఎన్‌ఆర్02: పలమనేరు మండలంలోని తామరఒడ్డు చెరువు వద్ద ఏనుగులు
 19పీఎల్‌ఎన్‌ఆర్03: బెరైడ్డిపల్లె మండలం కైగల్ జలపాతం వద్ద దాహం తీర్చుకుంటున్న ఏనుగు (ఫైల్)
 19పీఎల్‌ఎన్‌ఆర్04: పలమనేరు మండలంలోని కాలువపల్లె వద్ద దెబ్బతిన్న సోలార్‌ఫెన్సింగ్
 
ఈ మధ్య జరిగిన గజదాడులు

2013లో ఏనుగుల గుంపు గుడిపల్లె మండలం పెద్దపత్తికుంట గ్రామంలోకి చొరబడింది. బిసానత్తం తదితర ప్రాంతాల్లో పంటలు ధ్వంసం చేశాయి. ఓ రైతును పొట్టనపెట్టుకున్నాయి.
 
 
► 2014లో వి.కోట మండలం నాయకనేరి ప్రాంతంలో ఓ రైతు ఏనుగు దాడిలో మృత్యువాత పడ్డాడు.
 
► గురువారం రామకుప్పం మండలం ననియాల అటవీ ప్రాంతంలో వాచర్ మునెప్పను ఏనుగుల గుంపు తొక్కి చంపాయి.
 
► శుక్రవారం వి.కోట సరిహద్దులో చారగల్లు గ్రామంలో ఓ రైతును గజరాజులు తొక్కి చంపేశాయి.
 
► అడవిలో ఆహారం, నీరు దొరక్క ఇవి గ్రామాలవైపొస్త్తున్నాయి.

ఇదే క్రమంలో ఇప్పటికి ఆరు ఏనుగులు మరణించాయి. కౌండిన్య అభయారణ్యంలో ఈ ఏనుగులు సంచరిస్తున్నాయి. ముఖ్యంగా వీటిని దారి మళ్లించేందుకు ఫారెస్ట్ ట్రాకర్స్ టైర్లను కాల్చడం, టపాసులు పేల్చడం వంటి కారణాలతో ఏనుగులు రెచ్చిపోయి జనాన్ని చూస్తేనే తరుముతున్నాయి.
 
ఏనుగులు రావడంతోనే రైతులకు ఎక్కువ నష్టం వాటిల్లుతోంది. శాశ్వత పరిష్కారంలో భాగంగా మూడు రాష్ట్రాల్లోని అడవిలో ఓ కారిడార్ నిర్మించేందుకు స్థానిక అధికారులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైల్డ్ అనిమల్ ప్రొటెక్ట్‌కు నివేదిక పంపినా పనులు ముందుకు సాగలేదు. ఏనుగుల సంరక్షణ కోసం అడవుల్లో నీటి కుంటలు, షెల్టర్ల పనులు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. మరోవైపు కందకాలు (ఎలిఫెంట్ ఫ్రూఫ్ ట్రెంచెస్) చేపడితేగాని సమస్య పరిష్కారమయ్యేలా లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement