మరో పుష్కర విషాదం... | Another Pushkarni tragedy | Sakshi
Sakshi News home page

మరో పుష్కర విషాదం...

Published Fri, Jul 24 2015 2:33 AM | Last Updated on Tue, Aug 28 2018 7:14 PM

మరో పుష్కర విషాదం... - Sakshi

మరో పుష్కర విషాదం...

 పెంటపాడు : జాతీయ రహదారిపై తాడేపల్లిగూడెం ఆటోనగర్ సమీపంలోని బ్రిడ్జి మలుపు ముగ్గురు ప్రాణాలను బలిగొంది. పుష్కర యూత్రికులు ప్రయూణిస్తున్న రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందగా 13 మందికి గాయూలయ్యూరుు. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించి  పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన 9 మంది గురువారం ఉదయం పెనుగొండ మండలం సిద్ధాంతం వద్ద పుష్కర స్నానాలు చేసి మహీంద్రా కారులో తిరుగు ప్రయాణమయ్యారు.

ఇదే సందర్భంలో ప్రకాశం జిల్లా ఒంగోలుకు సమీపంలోని ఇడుపులపాడుకు చెందిన ఆరుగురు నిస్సాన్ కారులో పుష్కర స్నానాలకు వెళ్తున్నారు.  ప్రత్తిపాడు వద్ద రైల్వే కం రోడ్డు బ్రిడ్జి దిగుతుండగా నల్లపాడుకు చెందిన మహీంద్ర కారు మలుపు తప్పించే క్రమంలో డివైడర్ దాటి కుడివైపున వెళ్తున్న నిస్సాన్ కారును రాంగ్‌రూట్‌లో వెళ్లి ఢీకొట్టింది. ప్రమాదంలో నిస్సాన్ కారులో ప్రయాణిస్తున్న ఇడుపులపాడుకు చెందిన బుడవల రామకృష్ణ (42), అదే గ్రామానికి చెందిన పుల్లెల భూషారావు (40) అక్కడికక్కడే మృతి చెందారు. అదే కారులో ప్రయాణిస్తున్న పుల్లెల భూషారావు భార్య లక్ష్మికి రెండు కాళ్లు విరిగిపోయాయి.

మరో మహిళ పుల్లెల సుబ్బరావమ్మ తలకు తీవ్ర గాయాలయ్యాయి. బుడవల శైలజ, బుడవల మానస సాయికి పలుచోట్ల గాయాలయ్యాయి. మహీంద్ర కారులో ప్రయాణిస్తున్న కొఠారి పుట్టయ్య (65) తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించగా కొద్దిసేపటికే మృతి చెందాడు. ఆ కారులో ప్రయాణిస్తున్న షేక్ సాయి, మన్నిడి శ్రీనివాసరావు, అతని భార్య నాగమణి, అతని తల్లి సామ్రాజ్యం, బావ కొఠారి వెంకటేశ్వరరావు, చెల్లి ఆదిలక్ష్మి, చిన్నారులు శ్రావణి, గౌతమి తీవ్రంగా గాయపడ్డారు. ఏడాది చిన్నారి మన్నిడి అనన్య స్వల్పంగా గాయపడింది. క్షతగాత్రులను తొలుత తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాలకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement