చిత్తూరు : చిత్తూరు జిల్లాలో మరో స్వైన్‌ఫ్లూ కేసు నమోదయ్యింది. మూడు రోజులుగా ఇక్కడి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలికి స్వైన్‌ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. గంగాధర నెల్లూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన 55 ఏళ్ల వృద్ధురాలు జ్వరం, దగ్గుతో బాధపడుతూ శనివారం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. ఈమెను పరీక్షించిన వైద్యులు స్వైన్‌ఫ్లూ లక్షణాలున్నాయని భావించారు. వ్యాధి నిర్ధారణ కోసం అవసరమైన గల్ల, తదితర కొన్ని శాంపిల్స్ తీసి హైదరాబాద్‌లోని వైద్యశాఖకు పంపారు. ఆమెను ఐసోలేటెడ్ వార్డులోనే ఉంచారు. ఆమెకు స్వైన్‌ఫ్లూ సోకినట్లు వైద్యశాఖ అధికారుల నుంచి సోమవారం నివేదిక అందింది. గంగాధరనెల్లూరు సమీపంలోని ఓ గ్రామంలో ఆమె హోటల్‌లోని క్యాష్ కౌంటర్‌లో కూర్చోవడం వల్ల వ్యాధి సోకినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు సోమవారం హైదరాబాదులోని వైద్యశాఖ నుంచి ఈ ఆస్పత్రికి సమాచారం అందింది. బాధితురాలిని జిల్లా ప్రభుత్వాస్పత్రుల సమన్వయాధికారిణి (డీసీహెచ్‌ఎస్) డాక్టర్ సరళమ్మ, పర్యవేక్షకులు డాక్టర్ జయరాజ్, ఆర్‌ఎంవో డాక్టర్ సంధ్య పరామర్శించారు. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని, ఆమెకు టామీ ఫ్లూ మాత్రలు సైతం ఇస్తున్నారని డీసీహెచ్‌ఎస్ పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లాలో మరో స్వైన్‌ఫ్లూ కేసు
Published Mon, Feb 16 2015 8:14 PM | Last Updated on Thu, May 10 2018 12:34 PM
Advertisement
Advertisement