swineflu case
-
నెల్లూరులో స్వైన్ఫ్లూ కేసు నమోదు
నెల్లూరు (అర్బన్): నెల్లూరు నగరంలో మరో స్వైన్ఫ్లూ కేసు నమోదైంది. డీఎంహెచ్ఓ కార్యాలయ అధికారుల వివరాల ప్రకారం... లక్ష్మీపురానికి చెందిన ఓ మహిళ (43) ఈనెల 19న తీవ్ర జలుబు, జ్వరంతో బాధపడుతూ నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లింది. అక్కడి వైద్యులు స్వైన్ఫ్లూ అనుమానంతో పరీక్షలు చేయించారు. 22న పరీక్షల్లో ఆమెకు స్వైన్ఫ్లూ ఉందని నిర్ధారణ అయింది. అయితే ఆమె ఆసుపత్రిలో చేరలేదు. ఇంటి వద్దే ఉంటూ చికిత్స తీసుకుంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగ్గానే ఉందని అధికారులు తెలిపారు. జిల్లాలో ఇప్పటికే ఐదు కేసులు నమోదు కాగా ఇది ఆరో కేసు. ఇంటి వద్దే ఉంటున్న ఆమెను మంగళవారం డీఎంహెచ్ఓ కార్యాలయ అధికారులు శ్యాంసన్బాబు, మురళీకృష్ణ, వరప్రసాద్, శివరామకృష్ణలు పరామర్శించారు. చుట్టుపక్కల వారికి ఫ్లూ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. -
విశాఖపట్నంలో మరో స్వైన్ ఫ్లూ కేసు
విశాఖపట్నం: విశాఖపట్నంలో మరో స్వైన్ ఫ్లూకేసు నమోదైంది. ఎన్ ఏడీ కొత్త రోడ్డుకు చెందిన 35 ఏళ్ల వ్యక్తికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు వైద్యపరీక్షల్లో నిర్ధారణైంది. చికిత్స కోసం అతన్ని విశాఖ చెస్ట్ ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో విశాఖపట్నంలో ఇప్పటివరకు స్వైన్ ఫ్లూ కేసులు 15కు చేరాయి. -
చిత్తూరు జిల్లాలో మరో స్వైన్ఫ్లూ కేసు
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో మరో స్వైన్ఫ్లూ కేసు నమోదయ్యింది. మూడు రోజులుగా ఇక్కడి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలికి స్వైన్ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. గంగాధర నెల్లూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన 55 ఏళ్ల వృద్ధురాలు జ్వరం, దగ్గుతో బాధపడుతూ శనివారం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. ఈమెను పరీక్షించిన వైద్యులు స్వైన్ఫ్లూ లక్షణాలున్నాయని భావించారు. వ్యాధి నిర్ధారణ కోసం అవసరమైన గల్ల, తదితర కొన్ని శాంపిల్స్ తీసి హైదరాబాద్లోని వైద్యశాఖకు పంపారు. ఆమెను ఐసోలేటెడ్ వార్డులోనే ఉంచారు. ఆమెకు స్వైన్ఫ్లూ సోకినట్లు వైద్యశాఖ అధికారుల నుంచి సోమవారం నివేదిక అందింది. గంగాధరనెల్లూరు సమీపంలోని ఓ గ్రామంలో ఆమె హోటల్లోని క్యాష్ కౌంటర్లో కూర్చోవడం వల్ల వ్యాధి సోకినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు సోమవారం హైదరాబాదులోని వైద్యశాఖ నుంచి ఈ ఆస్పత్రికి సమాచారం అందింది. బాధితురాలిని జిల్లా ప్రభుత్వాస్పత్రుల సమన్వయాధికారిణి (డీసీహెచ్ఎస్) డాక్టర్ సరళమ్మ, పర్యవేక్షకులు డాక్టర్ జయరాజ్, ఆర్ఎంవో డాక్టర్ సంధ్య పరామర్శించారు. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని, ఆమెకు టామీ ఫ్లూ మాత్రలు సైతం ఇస్తున్నారని డీసీహెచ్ఎస్ పేర్కొన్నారు. -
చిత్తూరులో ఓ వ్యక్తికి స్వైన్ ఫ్లూ
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని లక్షీ నగర్ కాలనీకి చెందిన ఓ 50 ఏళ్ల వ్యక్తికి స్వైన్ ఫ్లూ వచ్చినట్లు శనివారం డాక్టర్లు నిర్ధారించారు. బాధితుడిని మెరుగైన చికిత్స కోసం తమిళనాడులోని వేలూరు ఆస్పత్రికి తరలించారు.