విశాఖపట్నంలో మరో స్వైన్ ఫ్లూ కేసు
విశాఖపట్నం: విశాఖపట్నంలో మరో స్వైన్ ఫ్లూకేసు నమోదైంది. ఎన్ ఏడీ కొత్త రోడ్డుకు చెందిన 35 ఏళ్ల వ్యక్తికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు వైద్యపరీక్షల్లో నిర్ధారణైంది. చికిత్స కోసం అతన్ని విశాఖ చెస్ట్ ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో విశాఖపట్నంలో ఇప్పటివరకు స్వైన్ ఫ్లూ కేసులు 15కు చేరాయి.