పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖలో మరో మలుపు | Another turn of the Panchayat Raj Engineering Department | Sakshi
Sakshi News home page

పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖలో మరో మలుపు

Published Tue, Sep 2 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 12:43 PM

Another turn of the Panchayat Raj Engineering Department

సాక్షి, ప్రతినిధి, విజయనగరం : పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖలో మరో మలుపు చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యేల అండతో డీఈ శ్రీనివాస్ పీఏ టూ ఎస్‌ఈగా వేయించుకున్న పోస్టింగ్ ఉత్తర్వులను  జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి రద్దు చేయించారు. పాత తేదీతో అవుట్ సోర్సింగ్ టెక్నికల్ అసిస్టెంట్ల కొనసాగింపు ఉత్తర్వులపై సంతకం చేశారన్న అభియోగం తో శ్రీనివాస్‌కుమార్‌పై విచారణ జరిగిన విషయం తెలిసిందే. జె డ్పీ చైర్‌పర్సన్ డీఈ వ్యవహా రా న్ని వెలుగులోకి తీసుకురావడమే కాకుండా ఆయనపై విచారణ జ రిగేలా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశా రు. ఫిర్యాదు మేరకు జెడ్పీ సీఈఓ ఇప్పటికే విచారణ చేసి, కలెక్టర్‌కు నివేది క ఇచ్చారు.
 
 ఇదేసమయంలో డీఈ శ్రీనివాస్ తీరుపై సీరియస్‌గా స్పంది స్తూ.. మంత్రి మృణాళిని ఆయన్ను సరెండర్ చేయాలని ఆదేశిస్తూ పంచాయతీరాజ్ ఎస్‌ఈకి లేఖ రాశారు. దీంతో శ్రీనివాస్‌కు ఉచ్చు బిగుసుకుందనుకున్న తరుణంలో  చైర్‌పర్సన్ ప్రయత్నాలను తిప్పికొడుతూ..తనకు అండగా నిలిచిన టీడీపీ ఎమ్మెల్యేల సాయంతో ఏకంగా పీఏ టూ ఎస్‌ఈగా పోస్టింగ్ వేయించుకున్నారు. దీనిపై జెడ్పీ చైర్‌పర్సన్ కేంద్రమంత్రి అశోక్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తనను, రాష్ట్ర, కేంద్రమంత్రులను ఓవర్ టేక్ చేసి, పోస్టింగ్ తీసుకుంటారా..? అంటూ జెడ్పీ చైర్‌పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏ టూ ఎస్‌ఈ ఉత్తర్వులు ఎలాగైనా రద్దు చేయించాలని  పట్టుదలకు వెళ్లారు. ఆ ప్రయత్నంలో భాగంగానే శ్రీనివాస్‌కుమార్‌కు వేసిన పీఏ టూ ఎస్‌ఈ పోస్టింగ్ ఉత్తర్వులను రద్దు చేయించారు. మరి తనకు అండగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలతో శ్రీనివాస్‌కుమార్ ఇంకేం చేస్తారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement