పదో తరగతి విద్యార్థికి ఆంత్రాక్స్?
అయోమయంలో విద్యార్థి తల్లిదండ్రులు
లేపాక్షి : లేపాక్షి మండలం మానేపల్లికి చెందిన పదవ తరగతి విద్యార్థి శ్రీకాంత్‌కు ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలున్నట్లు వైద్యులు నిర్ధారించడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇతను శిరివరం జిల్లా పరిషత్ హైస్కూల్ లో 10వ తరగతి చదువుతున్నాడు. కర్ణాటకలోని చింతలపల్లి గ్రామంలో బంధువుల ఇంట్లో ఉంటూ నాలుగు కిలోమీటర్ల దూరంలో వున్న శిరివరం హైస్కూల్‌కు రోజూ వచ్చివెళుతుంటాడు.
మూడు నెలల క్రితం చింతలపల్లి చెరువులో కలుషిత నీరు సేవించి సుమారు 300 గొర్రెలు చనిపోయాయి. కొంతమంది చింతలపల్లి గ్రామస్తులు వాటి మాంసం తిన్నారు. దీంతో ఒకరిద్దరికి చర్మంపై రంధ్రాలు పడ్డాయి. ఇటీవల శ్రీకాంత్ చేతులపై అదే తరహాలో గుల్లలు, మచ్చలు వచ్చారుు.
ఏమైందో.. ఏమో..
శ్రీకాంత్‌కు చేతులపై అక్టోబర్ 27న చిన్న గుల్లల్లాంటివి ఏర్పడినట్లు తల్లిదండ్రులు నరసప్ప, పార్వతమ్మ తెలిపారు.‘‘28న చేతుల కింద, భుజాల వద్ద రెండు, మూడు చోట్ల రంధ్రాలు ఏర్పడ్డారుు. అనుమానం వచ్చి మానేపల్లికి దగ్గరలో వున్న పులమతిలో ఆర్‌ఎంపీ వైద్యుడి వద్ద వైద్యం చేరుుంచాము. ఆయన సూచన మేరకు హిందూపురంలోని ఓ ప్రరుువేటు నర్సింగ్‌హోమ్‌కు తీసుకెళ్లాము.
29న వైద్య పరీక్షలు చేశారు. అక్కడి సిబ్బంది ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. ప్రభుత్వాస్పత్రిలో సరైన వైద్యం చేయలేక.. బెంగ ళూరుకు తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో శ్రీకాంత్‌కు బెంగళూరులోని వాణీవిలాస్, బాప్టిస్ట్ ఆస్పత్రుల్లో చికిత్స చేరుుంచాము. అక్కడి వైద్యులు పలు పరీక్షలు చేసిన అనంతరం ఆంత్రాక్స్ లక్షణాలు ఉన్నట్లు చెప్పి.. ఐసోలేషన్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ 10 రోజులకు సరిపడే మందులు ఇచ్చి వాటిని క్రమం తప్పకుండా వాడాలని చెప్పినారు.
అక్టోబర్ 30వ తేదీ సాయంత్రం మా ఊరు మానేపల్లికి వచ్చినాము. ఈ వ్యాధి ఇతరులకు సోకే ప్రమాదం వుందని ఊరోళ్లు గోల చేయడంతో హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చినాము. ఇదేం వ్యాధో మాకు అర్థం కావడం లేదు. మా బిడ్డకు ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో.. భయంగా ఉంది’’ అంటూ కన్నీటి పర్యంతమయ్యూరు.
శ్రీకాంత్ ఆరోగ్యం బాగానే ఉంది..
శ్రీకాంత్‌కు ఆంత్రాక్స్ లక్షణాలు ఉన్నాయని బెంగళూరు వైద్య నిపుణులు తేల్చారని, ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగానే ఉందని, ఆందోళన చె ందాల్సిన అవసరం లేదని హిందూపురం వైద్యులు దివాకర్, శివకుమార్‌స్వామి చెప్పారు. పశు సంవర్ధక శాఖ జారుుంట్ డెరైక్టర్ శ్యామ్‌మోహన్‌రావ్, డి ప్యూటీ డెరైక్టర్ జయకుమార్, స్థానిక ఏడీ శుభదాస్ తదితరులు విద్యార్థిని పరిశీలించారు.
ఈ వ్యాధి పశువుల నుంచి మాత్రమే మనుషులకు సోకుతుందని, మనుషుల నుంచి ఇతరులకు రాదని జేడీ చెప్పారు. లేపాక్షి మండలంతో పాటు కర్ణాటక పరిసర గ్రామాల్లోని గొర్రెలకు ఏమైనా ఈ వ్యాధి సోకివుండవచ్చన్నారు. ముందు జాగ్రత్తగా లేపాక్షి మండలంలో గొర్రెలకు వ్యాక్సినేషన్ చేపడతామన్నారు. జిల్లా అదనపు వైద్యారోగ్యశాఖాధికారి వెంకటరమణ శుక్రవారం విద్యార్థి శ్రీకాంత్‌ను పరిశీలించి ఎలాంటి ప్రమాదం లేదని ధైర్యం చెప్పారు. చింతలపల్లిలోని నీటిని, గొర్రెలకు సంబంధించిన రక్తాన్ని లేపాక్షి పశు వైద్యశాలలో పరీక్షించారు. కొన్నింటిలో ఆంత్రాక్స్ లక్షణాలు ఉన్నట్లు తెలిసింది.