ఆంధ్రప్రదేశ్‌కు శాసనమండలి సీట్ల కేటాయింపులో జరిగిన అన్యాయాన్ని సవరించడంలో భాగంగా ప్రస్తుతం ఉన్న 50 స్థానాలను 58కి పెంచాలని కోరుతూ సభ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది.
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు శాసనమండలి సీట్ల కేటాయింపులో జరిగిన అన్యాయాన్ని సవరించడంలో భాగంగా ప్రస్తుతం ఉన్న 50 స్థానాలను 58కి పెంచాలని కోరుతూ సభ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. సరైనవిధం గా, సంతృప్తికరంగా సంప్రదింపులు జరపకుం డా, ప్రధానమైన భాగస్వామ్యపక్షాలను పట్టిం చుకోకుండా, భవిష్యత్ దుష్ఫలితాలను ఏమాత్రం పరిగణనలోనికి తీసుకోకుండా, హేతుబద్దత లేకుండా జరిగిన రాష్ట్ర విభజన ప్రక్రియ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసింది. శుక్రవారం మండలి చేసిన మరిన్ని తీర్మానాల వివరాలు..
- రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా, సమతుల అభివృద్ధి లక్ష్య సాధనకు శాసనమండలి కట్టుబడి ఉంది.
- ప్రపంచ స్థాయి రాజధాని నగరం ఏర్పాటుకు కావాల్సిన వనరులను కేంద్రం అందించాలి.
- ఏపీ పునర్విభజన చట్టం- 2014లో పొందుపరిచిన అన్ని ప్రతిపాదనలు, పార్లమెంటులో అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలను త్వరితగతిన అమలు చేసి కొత్త రాష్ట్ర నిర్మాణానికి కేంద్రం సహకరించాలి.
- విభజన వల్ల ఏపీకి జరిగిన వివక్షను పూరిం చేందుకు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఏర్పాటుకు కావాల్సిన చర్యలన్నీ కేంద్రం తీసుకోవాలి.
- రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఆర్థిక మద్దతు, విధానపర మద్దతును కేంద్రం అందించాలి.
- పోలవరం నిర్మాణం నాలుగేళ్ళలో పూర్తయ్యేలా అన్ని చర్యలను కేంద్రం తీసుకోవాలి.
- రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి.