రాయలసీమను కాపాడుకునేందుకే పట్టిసీమ
హైదరాబాద్ : రాయలసీమను కాపాడుకోవాలంటే పట్టిసీమ ప్రాజెక్ట్ అవసరమని ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఏడాదిలోగా పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆయన బుధవారం అసెంబ్లీలో పేర్కొన్నారు. పోలవరం కుడికాలువ ద్వారా రాయలసీమకు నీరందిస్తామని దేవినేని ఉమ తెలిపారు.