ఐ విల్ స్పీక్... యు కెన్ నాట్ స్పీక్ | ap assembly: ys jagan mohan reddy appeals I will speak on ap budget | Sakshi
Sakshi News home page

ఐ విల్ స్పీక్... యు కెన్ నాట్ స్పీక్

Published Thu, Mar 19 2015 10:28 AM | Last Updated on Sat, Aug 18 2018 8:54 PM

ఐ విల్ స్పీక్... యు కెన్ నాట్ స్పీక్ - Sakshi

ఐ విల్ స్పీక్... యు కెన్ నాట్ స్పీక్

హైదరాబాద్ :  ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గురువారం ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి...స్పీకర్ కోడెల శివప్రసాదరావు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. బడ్జెట్పై చర్చ సందర్భంగా సమయం ముగిసిందంటూ వైఎస్ జగన్ మాట్లాడుతుండగానే స్పీకర్ మైక్ కట్ చేశారు. బడ్జెట్పై విపక్షం చర్చ ముగిసిందంటూ ప్రకటించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ అభ్యంతరం తెలుపుతూ ఐ విల్ స్పీక్ అనగా స్పీకర్....నో... యు కెన్ నాట్ స్పీక్ అని వ్యాఖ్యానించారు.

తాను కేవలం సబ్జెక్టు మాత్రమే మాట్లాడుతున్నానని వైఎస్ జగన్ ఈ సందర్భంగా స్పీకర్తో తెలిపారు.  రైతుల దుస్థితిపై మాట్లాతున్నానని, రూ.4300 కోట్లు ఇచ్చారని, బడ్జెట్పై మాట్లాడుతున్నప్పుడు ఎలా అడ్డుకుంటారన్నారు. బడ్జెట్పై అన్ని అంశాలనూ మాట్లాటే హక్కు ఉందన్నారు. అయినా స్పీకర్ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు.

ఈ సందర్భంగా విపక్ష నేత మాట్లాడుతుండగానే  మైక్‌ కట్‌ చేయడంపై వైఎస్ఆర్ సీపీ తీవ్ర నిరసన తెలిపింది.  విపక్షానికి  కావాల్సినంత  సమయమివ్వలేమని స్పీకర్‌ స్పష్టం చేయడంతో విపక్షం ఆందోళనకు దిగింది  విపక్ష నేతకు మాట్లాడేందుకు తగిన అవకాశం కల్పించాలని కోరుతూ  వైఎస్ఆర్ సీపీ సభ్యులంతా  స్పీకర్‌ పొడియం ముందుకు దూసుకువచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  విపక్ష సభ్యుల నినాదాల మధ్యే మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ మాట్లాడారు.  గందరగోళం తీవ్రస్థాయికి చేరడంతో స్పీకర్‌ సభను పది నిమిషాలు వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement